Thursday, April 5, 2018

ఎక్కడ ఉన్నా నిన్నే తలిచెదను మాతా

ఎక్కడ ఉన్నా నిన్నే తలిచెదను మాతా
ఎలాగ ఉన్నా నిన్నే స్మరించెదను ఓ పరమాత్మ

ఏ క్షణమైనా నిన్నే పలికించెదను మాతా
ఏ కాలమైనా నిన్నే గమనించెదను ఓ పరమాత్మ

నీ శ్వాసలో నేనే ఎదిగాను నీ ధ్యాసలో నేనే ఒదిగాను
నీ భావంతో నేనే ఎదిగాను నీ తత్వంతో నేనే ఒదిగాను   || ఎక్కడ ||

ఏమని తలిచినా ఎంతని తపించినా తీరని తపనం నీ భావం
ఏదని తలిచినా ఎలాగని తపించినా తరగని తపనం నీ తత్త్వం

ప్రతి రూపంలో నీవే ప్రతి దేహంలో నీవే చలనం
ప్రతి ఉచ్చ్వాసలో నీవే ప్రతి ధ్యాసలో నీవే గమనం   || ఎక్కడ ||

నీలో నేనే ఆత్మగా ఒదిగినా నాలో నేనే మహాత్మగా ఎదిగాను
నీలో నేనే ఋషిగా ఒదిగినా నాలో నేనే మహర్షిగా ఎదిగాను

నీలో నేనే శ్వాసనై జీవిస్తున్నా నాలో నేనే ధ్యాసనై స్మరిస్తున్నా
నీలో నేనే భావమై జీవిస్తున్నా నాలో నేనే తత్వమై స్మరిస్తున్నా    || ఎక్కడ || 

No comments:

Post a Comment