Showing posts with label జగదేశ్వరుడు. Show all posts
Showing posts with label జగదేశ్వరుడు. Show all posts

Friday, May 27, 2016

జీవము నీవే విశ్వము నీవే భావానివి నీవే

జీవము నీవే విశ్వము నీవే భావానివి నీవే
మేము కోరినవన్నీ తీర్చే అనంత శక్తివి నీవే
జగతికి జగదేశ్వరుడు నీవే లోకానికి లోకేశ్వరుడు నీవే
గంగా జలానికి గంగాధరుడు నీవే సృష్టికి మూలం నీవే || జీవము ||

మేధస్సున కలిగే ఆలోచనలో అర్థానివి నీవే
ఆలోచనలో దాగిన భావ పరమార్థానివి నీవే

కాలంతో సాగే ఆలోచనలలో కలిగే కోరికలు తీర్చుకునే సమయం నీవే
కోరికలను తీర్చుకునేందుకు కావలసిన విజ్ఞాన సామర్థ్యాని కలిగించేది నీవే

కోరికలతో పాటు ఎన్నో సంతోషాలను కలిగించే విశ్వ చైతన్య మూర్తివి నీవే
సుఖ సంతోషాల ఆనందాలతో మానవ హృదయాలను నడిపించేది నీవే    || జీవము ||

జగతికి జీవము నీవై ఎన్నో జీవరాసులకు ప్రాణమిచ్చే దాతవు నీవే
విశ్వానికి శ్వాసవు నీవై ఎన్నో జీవులకు జనన మరణ కర్త క్రియ నీవే

ఆకలి నుండి అనంతమైన కోరికలను తీర్చే ఆది పరాశక్తివి నీవే
క్షణము నుండి యుగాలుగా సాగే కాల చక్రానికి భైరవుడవు నీవే

లోకాన్ని శాసించే మహా పంచభూత పరంజ్యోతివి నీవే
బ్రంహాండాన్ని నడిపించే లోకాలకు జగద్గురువు నీవే   || జీవము ||