Showing posts with label సర్వాంతము. Show all posts
Showing posts with label సర్వాంతము. Show all posts

Monday, October 17, 2016

శాంతం ప్రశాంతం మనస్సే ఏకాంతం

శాంతం ప్రశాంతం మనస్సే ఏకాంతం
భావం ప్రభావం వయస్సే సుఖాంతం
లోకం పర లోకం మనిషికే వేదాంతం  || శాంతం ||

ఏనాటికో మనకు ఏకాంతము ఎవరితో మనకు సుఖాంతము
ఎప్పటికో మనకు సర్వాంతము ఎందుకో మనకు వేదాంతము

ఏకాంతమే ఏకాగ్రతమై విజ్ఞానమే ప్రజ్ఞానమయ్యేను
భావాంతమే స్వభావమై ఊహత్వమే వేదాంతమయ్యేను
సుఖాంతమే సంపూర్ణమై సర్వత్వమే సమాప్తమయ్యేను   || శాంతం ||

కాలమే మనకు కార్య గమనమై సమయమే సాగిపోవును
నాదమే మనకు వేద వచనమై విజ్ఞానమే వెలిగిపోవును

విశ్వాంతమే జీవత్వమై దేహమే ఉదయించేను
ప్రశాంతమే ఏకత్వమై దైవమే ప్రజ్వలించేను
సర్వాంతమే సమాప్తమై ధర్మమే అస్తమించేను  || శాంతం ||

Tuesday, July 19, 2016

ఆత్మగా ఉదయించి మహాత్మగా అస్తమించవా దేవా

ఆత్మగా ఉదయించి మహాత్మగా అస్తమించవా దేవా
శ్వాసతో జన్మించి స్వధ్యాసతో అధిరోహించవా దైవా
మౌనంతో అధిగమిస్తూ జీవంతో మోక్షమించవా దేవా  || ఆత్మగా ||

దైవాధీనము జగత్సర్వము అద్వైత దైవత్వము ఒక్కటే
అభియోగము సర్వాంతము అభ్యుదయము అంతర్గతమే

నీలో నీవై దైవ ప్రవక్తగా ఉదయిస్తూ విశ్వానికే మహాత్మవై నిలిచావు
నీలో నీవే దైవ ధూతగా మేల్కొంటూ జగతికి పరమాత్మవై వెలిసావు   || ఆత్మగా ||

భగవంతుడే వచ్చి విజ్ఞానాన్ని తెలిపేనా మహాత్మయే నడిచి ధర్మాన్నే భోదించేనా
మహాత్వ పూర్ణమైన సేవలను అందించి మహా తత్వాన్ని సంపూర్ణగా సంభోదించేనా

విశ్వమే పర తత్వమై ఆత్మే మహా పర్వతమై మహాత్మగా ఉదయించేనా
జగమే పర భావమై పరమాత్మే మహా శిఖరమై దైవాత్మగా అవతరించేనా  || ఆత్మగా ||