Showing posts with label వేదాంశం. Show all posts
Showing posts with label వేదాంశం. Show all posts

Wednesday, January 18, 2017

ఏది నీ దైవాంశం ఏది నీ పరమాంశం

ఏది నీ దైవాంశం ఏది నీ పరమాంశం
ఏది నీ దేవాంశం ఏది నీ ఆత్మఆంశం  ఓ మానవా!  || ఏది నీ దైవాంశం ||

జన్మించిన స్థానమున ఏది నీ జన్మాంశం
ఎదిగిన కాలమున ఏది నీ జీవ రూపాంశం
నేర్చిన విజ్ఞానమున ఏది నీ వేద సారాంశం

విజ్ఞానమే పొందిన ఏది నీ గౌరవ స్థానాంశం
అనుభవమే కలిగిన ఏది నీ విషయాంశం
వేదాంతమే చదివిన ఏది నీ జ్ఞానాంశం          || ఏది నీ దైవాంశం ||

జన్మించడమే నీ జీవాంశం జీవితానందమే నీ సారాంశం
దేవత్వమే నీ దేవాంశం మహాత్మానందమే నీ ఆత్మఆంశం
దైవానందమే నీ దైవాంశం పరమానందమే నీ పరమాంశం
జీవనమే నీ జ్ఞానాంశం కాల ప్రభావమే నీ వేద విషయాంశం

కాలమే నీ పాటాంశం ప్రయాణందమే నీ చరితాంశం
గతమే నీ పాతాంశం భవిష్యానందమే నీ భవితాంశం
భావమే నీ వేదాంశం తత్వానందమే నీ గుణ సర్వాంశం    || ఏది నీ దైవాంశం || 

Monday, July 18, 2016

కాలంతో సాగే కవితలు ఎన్నో

కాలంతో సాగే కవితలు ఎన్నో
కవితలుగా సాగే భావాలు ఎన్నో
కాలంతో సాగే కవితలలో కవి విజ్ఞాన భావాలు ఏవో ఎన్నెన్నో  || కాలంతో ||

కవితలుగా తెలిపే భావాలలో విజ్ఞానమే ముఖ్యాంశం
విజ్ఞానంతో సాగే కవితలలో ప్రముఖ జ్ఞానమే వేదాంశం

విజ్ఞానంతో లేని కవితలు ఏనాటికైనా చెదిరిపోయేనులే
భావాలోచన లేని కవిత్వాలు ఎప్పటికైనా చెల్లాచెదురులే  || కాలంతో ||

విజ్ఞానంతో కూడిన భావ కవితలనే విశ్వానికి అందించు
జ్ఞానంతో సాగే ఆలోచన భావాలనే ప్రపంచానికి విస్తరించు

కవితలతోనే కవి హృదయం మౌనమై కాలంతో సాగిపోయేనే
భావాలతోనే కవి మేధస్సు అమరమై వేదంతో వెళ్ళిపోయేనే   || కాలంతో ||