Showing posts with label విశేషణం. Show all posts
Showing posts with label విశేషణం. Show all posts

Thursday, November 10, 2016

మహారాజ విశ్వానికి నీవే మహోదయ శుభోదయం

మహారాజ విశ్వానికి నీవే మహోదయ శుభోదయం
యువరాజ జగతికి నీవే నవోదయ సర్వోదయం      || మహారాజ ||

లోకాలకు మహారాజుని పరిపాలన మహోదయ భావాల సంకీర్తనం
సృష్టికి యువరాజుని పరిశోధన నవోదయ భావాల వేద సంభాషణం

మహనీయుల రాజ్యాలలో మహోత్తరమైన భావాల విజ్ఞాన పాండిత్యం
మహానుభావుల సామ్రాజ్యాలలో మహనీయమైన వేద జ్ఞాన వేదాంతం   || మహారాజ ||

సంఘములో ఉన్న సమైక్యమే రాజుల పరిపాలన విశేషణం
సమూహములో ఉన్న ఐక్యమే రారాజులా పరిపూర్ణ విన్యాసం

ఏ రాజ్యంలో మహాత్ములు జీవించినా మన చరిత్రకే నిదర్శనం
ఏ సామ్రాజ్యంలో మహర్షులు జీవించినా లోకాలకే మార్గదర్శకం  || మహారాజ ||