Showing posts with label ప్రవాహం. Show all posts
Showing posts with label ప్రవాహం. Show all posts

Tuesday, November 8, 2016

ఎవరే నీవు ఎవరే అని అంటున్నది నా హృదయం

ఎవరే నీవు ఎవరే అని అంటున్నది నా హృదయం
ఎవరే నీవు ఎవరే అని అడుగుతున్నది నా మౌనం

మనస్సులో కలిగే భావాలకు నీవే ప్రతి రూపం
వయస్సులో తోచే భావాలకు నీవే ప్రతి నాదం   || ఎవరే నీవు ||

ప్రతి మాటలో నీ ప్రేమే పిలుస్తున్నది
ప్రతి బాటలో నీ భావమే కనిపిస్తున్నది

ఏ చోట ఉన్నా నీ ధ్యాసే ఏ క్షణమైనా నీ శ్వాసే నాలో
ఏనాటికైనా నీ వైపు నేనే ఏ చెంతనైనా నీ తోడు నేనే  

ఏ లోకమైన కనిపించేది నీవే పరలోకమైన వినిపించేది నీవే
ఏ విశ్వమైన చూపులకు నీవే ఏ జగమైన అలజడులకు నీవే  || ఎవరే నీవు ||

ఏ దేశమైన ప్రతి దేశం నా ప్రపంచంలోనే ప్రేమగా ఉంటుంది నీ దేహం
ఏ ప్రాంతమైన ప్రతి ప్రాంతం నా ప్రదేశంలోనే స్థిరమై పోతుంది నీ రూపం

సముద్రాల కెరటాలలో దాగిన అలల ప్రవాహం నీ కోసమే ఉప్పొంగేనే
నదుల ప్రవాహాలలో దాగిన నీటి ఊటలే నీ కోసమే ఉరకలు సాగించేనే  || ఎవరే నీవు ||