Showing posts with label పరసత్యం. Show all posts
Showing posts with label పరసత్యం. Show all posts

Thursday, January 5, 2017

పరధ్యానం పరకార్యం పరధ్యాసతో చేసుకో

పరధ్యానం పరకార్యం పరధ్యాసతో చేసుకో
మహా జ్ఞానం ప్రజ్ఞానం విజ్ఞానంతో తెలుసుకో  || పరధ్యానం ||

పరవేదాన్ని పరజ్ఞానాన్ని పరమాత్మగా చూసుకో
పరతత్వాన్ని పరభావాన్ని పరంధామగా కలుపుకో
పరజీవాన్ని పరరూపాన్ని పరబ్రంహగా తలుచుకో
పరదేహాన్ని పరదైవాన్ని పరంజ్యోతిగా వెలిగించుకో  || పరధ్యానం ||

పరంపరల పరవిశ్వాన్ని పరస్థానంగా నిలుపుకో
పరంపరల పరదేశాన్ని పరధర్మంగా రక్షించుకో
పరంపరల పరలోకాన్ని పరసత్వంగా మలుచుకో
పరంపరల పరకర్మాన్ని పరసత్యంగా సాగించుకో   || పరధ్యానం ||