Showing posts with label సూర్యుడు. Show all posts
Showing posts with label సూర్యుడు. Show all posts

Monday, August 7, 2017

ఉదయించే సూర్యుడు వచ్చేనమ్మా

ఉదయించే సూర్యుడు వచ్చేనమ్మా
అస్తమించే సూర్యుడు వెళ్ళేనమ్మా

ఆకాశమంతా సూర్య తేజమై సువర్ణాలతో వేద భావమై ప్రకృతినే పరిశోధించేనమ్మా
ఆకాశమంతా చంద్ర బింబమై నీలి వర్ణముతో విశ్రాంతమై ప్రకృతినే పరిశీలించేనమ్మా  || ఉదయించే ||

ప్రజ్వలమైన కాంతులతో సువర్ణాల కిరణాలతో జగతిని వెలిగించేనులే
నిశ్చలమైన అగ్ని కణాలతో సువర్ణాల బింబాలతో లోకాన్ని జ్వలించేనులే

రమణీయమైన భావాలతో రంగుల రూపులతో ఆకారాలనే చూపించేనులే
సుందరమైన స్వభావాలతో లేత సోయగాలతో రూపాలనే అందించేనులే  || ఉదయించే ||

వెలుగే ప్రతి జీవికి వేదమై జీవనమే ప్రతి జీవికి విజ్ఞానమై మేధస్సే ప్రకాశించేనులే
తేజమే ప్రతి జీవికి ఉత్తేజమై వర్ణమే ప్రతి జీవికి ఆనవాలై మేధస్సే ఉదయించేనులే

నేత్ర కాంతమే లోకమంతా విజ్ఞాన భవనమై జగమంతా అనుభవ మందిరమై సాగించేనులే
భావ చంద్రమే విశ్వమంతా విజ్ఞాన సోపానమై ప్రపంచమంతా భువన సాగరమై తపించేనులే  || ఉదయించే || 

Friday, February 3, 2017

సూర్యుడు నీవే చంద్రుడు నీవే

సూర్యుడు నీవే చంద్రుడు నీవే
విశ్వ జగతికి చీకటి వెలుగువు నీవే
లోకాలన్నింటికి భావాల తత్వం నీవే

ఏ దేహమైన ఏ జీవమైన ఉదయిస్తూ అస్తమించేది నీవే
ఏ రూపమైన ఏ ఆకారమైన ఎదుగుతూ ఒదుగుతున్నది నీవే || సూర్యుడు ||

అణువైనా నీ రూపమే పరమాణువైనా నీ ఆకారమే పరిశోధించే ఏ సూక్ష్మమైన నీ స్వభావత్వమే
తెలియని మర్మం తెలిసిన తంత్రం సృష్టించిన ఏ జీవ యంత్రమైనా నీలో దాగిన మంత్రమే

మేధస్సులో దాగిన విజ్ఞానం నీవే కలలతో సాగే ఊహల భావ స్వభావాలు నీవే
కాలంతో సాగే జనన మరణాలు నీవే సమయంతో సాగే అజ్ఞాన విజ్ఞానాలు నీవే  || సూర్యుడు ||

నీవు లేని భావం ఏదైనా శూన్యమే
భావం లేనిది ఏదైనా మహా శూన్యమే
ఏమి లేని భావం సంపూర్ణమైన శూన్యమే
ఏమి తోచని భావం పరిశుద్ధమైన శూన్యమే  || సూర్యుడు ||

Friday, September 23, 2016

మనిషిగా ఉదయించాము ఋషిగా ఎదుగుతున్నాము

మనిషిగా ఉదయించాము ఋషిగా ఎదుగుతున్నాము
కాలంతో కార్యాలనే సాగిస్తూ సమయంతో నడిచెదము

సూర్యుడు లేనిచోట విశ్వానికే సూర్యోదయం లేదంటు
సూర్యాస్తమయంతో జగతికి చీకటే పడుతుందంటా

జనులకు కావాలి విశ్వ జగతి ఇచ్చే ప్రేమే వెలిగేలా
జనులే చెప్పేరు సూర్యునికే జయహో జనతా జై జై మాతా  || మనిషిగా ||

మాటలతో సాగే స్నేహం ప్రేమగా మారే మన జీవం
మనస్సుతో కలిసే ప్రేమ జీవితాన్ని ఇచ్చే ప్రతి రూపం

మనస్సులు కలవక ముందు ఎవరికి ఎవరో తెలియము
మాటలు కలిసిన తరువాతే స్నేహ ప్రేమని తెలిసేను

జనులంతా ప్రేమతో చెప్పేరు జయహో జనతా జై జై మాత  || మనిషిగా ||

ప్రేమే లేదన్న చోట హృదయమే దుఃఖించెను
ప్రేమే కాదన్న చోట మనస్సే తడబడి పోయేను

ప్రేమే లేని నాడు ప్రేమించే తల్లి హృదయం ఆగేనా
ప్రేమే లేని రోజు మన విశ్వ జగతి తల్లడిల్లి పోయేనా

జనులంతా ప్రేమకై  చెప్పేరు జయహో జనతా జై జై మాత  || మనిషిగా ||

Friday, July 8, 2016

వర్ణమే తేజమై విశ్వమే వెలుగై జీవమే ఉత్తేజమై జీవితమే కొనసాగేను

వర్ణమే తేజమై విశ్వమే వెలుగై జీవమే ఉత్తేజమై జీవితమే కొనసాగేను
ఆలోచనలలో వర్ణ భావమే ఉత్తేజమై విజ్ఞాన అన్వేషణ కొనసాగించేను
మేధస్సే మహా విజ్ఞాన ప్రదేశమై అర్థాను గుణ ప్రద భావాలను గమనించేను
సూర్యని వర్ణ తేజస్సులలో ఎన్నో ఉత్తేజ విజ్ఞాన గుణ భావాలు దాగివుండేను
వర్ణం లేని వెలుగు సూర్యుడు లేని ఉత్తేజము అల్పజ్ఞానమై మేధస్సుకు సోకేను

Wednesday, April 27, 2016

విశ్వమంతా నీ రూపాన్ని సూర్యుడిలా చూసే సమయం ఏనాటికో

విశ్వమంతా నీ రూపాన్ని సూర్యుడిలా చూసే సమయం ఏనాటికో
నీలో దాగిన విశ్వ విజ్ఞాన భావాలను ఎలా అందరికి తెలిపెదవో
అనంతమైన అపురూపమైన విశ్వ భావాలను ఎలా ఆలోచిస్తున్నావో
విశ్వానికే మైమరిపించేలా మధుర భావనలు నీ మేధస్సులో ఎలా దాగున్నాయో
అద్భతమైన ఆశ్చర్యపు ఇంద్రియాల సూక్ష్మ కదలికల భావాలు ఎన్నున్నాయో
క్షణ క్షణాలకు కలిగే భావాలను మేధస్సులోనే దాచుకుంటూ ఎలా వివరిస్తున్నావో
ప్రతి సంఘటనను భావనగా తలచి విజ్ఞాన ఆలోచనగా అర్థమయ్యేలా ఎలా మలచెదవో
జీవిత కాలమంతా విశ్వ విజ్ఞాన భావాలతోనే జీవిస్తూ సూర్యుడిలా నీవే ప్రకాశిస్తున్నావు
నీవే సూర్యుడివై ఎందరికో స్పూర్తివై ప్రతి జీవి మేధస్సులో ఆలోచనగా ఉదయిస్తున్నావు
నీలో దాగిన సూర్య తేజ భావనలే ప్రతి జీవి మేధస్సుకు ఉత్తేజమై జీవన కార్యాలు సాగుతున్నాయి
సూర్యుడిలా ప్రపంచమంతా నీ విశ్వ రూపాన్ని భావాలతో దర్శిస్తూనే జీవిస్తున్నారు 

Wednesday, April 20, 2016

సూర్యుడినై వచ్చాను సూర్యోదయం అయ్యాను

సూర్యుడినై వచ్చాను సూర్యోదయం అయ్యాను
ఉజ్వల భవిష్యత్ కై ప్రజ్వలమై ప్రకాశిస్తున్నాను
ఉత్తేజముకై మేధస్సులలో సూర్య కిరణమైనాను
విజ్ఞాన ఆలోచనకై ఆకాశమంతా వెలుగుతున్నాను
కార్య కలాపాలకై సూర్యాస్తం వరకు జ్వలిస్తున్నాను
ప్రతి జీవికి విశ్వానికి ప్రతి అణువుకు చలనమైనాను
సూర్యుడిగా విశ్వానికి కాలమై నిత్యం సాగుతున్నాను
ప్రకృతిలో ప్రతి సహజ భావనతో నేనే ప్రభావమైనాను

Monday, April 4, 2016

సూర్యుడికై లోకమే వేచి ఉన్నది సూర్యోదయాన

సూర్యుడికై లోకమే వేచి ఉన్నది సూర్యోదయాన
సూర్యోదయమే లోక జీవుల కార్య కలాపాల ఆరంభం
సూర్యుడే ఉత్తేజ్జాన్ని సూర్యోదయాన కలిగిస్తూ సాగేను
సూర్యాస్తం వరకు సూర్య తేజమే మేధస్సుకు సామర్థ్యం మహా ధైర్యం
సృష్టిలో ప్రతి అణువు ఎదిగేందుకు సూర్య శక్తియే మహా తేజం
సూర్యుడు లేని లోకం మేధస్సు లేని ప్రపంచ విజ్ఞానమే  

Friday, April 1, 2016

ఆకాశమే విశ్వ రూపమై కనిపించేలా సూర్యుడే ప్రకాశిస్తున్నాడు

ఆకాశమే విశ్వ రూపమై కనిపించేలా సూర్యుడే ప్రకాశిస్తున్నాడు
సూర్యుడే లోకమై విశ్వానికే మహా తేజమై ఉదయిస్తున్నాడు
ప్రతి కిరణం ఓ విజ్ఞాన క్షేత్రమై జీవుల మేధస్సులలో వెలుగుతున్నది
సూర్యుడే విశ్వానికి శక్తి స్వరూపుడై ఆకాశమంతట ఎదిగి ఉన్నాడు
ప్రతి అణువుకు తానే మూలాధారమై కాల చలనమై సాగుతున్నాడు
నిలువలేని చలనం తరగని తేజస్సు వర్ణ ఉషస్సు ఆగని ఆర్భాటపు ఛందస్సు
మేఘ వర్ణ రూపం కిరణాత్మక ఆకార వైభోగ ఛాయా చిత్రపు స్వర్ణ సుందరం
ఆకాశం సూర్య విజ్ఞాన విశ్వ కళాశాల - రూప వర్ణం భావ ప్రభావ గమన చలనం

Tuesday, October 6, 2015

ఆకాశమే విశ్వ రూపమై కనిపించేలా సూర్యుడే ప్రకాశిస్తున్నాడు

ఆకాశమే విశ్వ రూపమై కనిపించేలా సూర్యుడే ప్రకాశిస్తున్నాడు
సూర్య ప్రకాశమే తేజోదయమై విశ్వమంతా వెలుగుతో ఉదయిస్తున్నాడు
ఆకాశాన కనిపించే మేఘ వర్ణ రూపాలు సూర్య కిరణాల తేజస్సు భావాలే
సూర్యుడే జగతికి స్పూర్తినిస్తూ జీవులకు మార్గ దర్శకమౌతున్నాడు
సూర్యని నుండే జీవుల మేధస్సులలో మార్పు కలుగుతూ వస్తున్నది
మానవ మేధస్సుకు సూర్యుడే ఆది జీవమై పరిణామం చెందించాడు
సూర్యుని నుండే మానవ మేధస్సు ఉత్తేజమై ఆలోచన అర్థాన్ని గ్రహిస్తున్నది
అన్ని దిక్కులను సమ భావాలతో చూసే మహా నేత్ర గుణపతి సూర్యుడే 

Tuesday, September 15, 2015

సూర్యుని తేజస్సులో శిలనునై సువర్ణము వలే ప్రకాశిస్తున్నా

సూర్యుని తేజస్సులో శిలనునై సువర్ణము వలే ప్రకాశిస్తున్నా
కిరణాల తేజస్సులో మిళితమై ఎవరికి కనిపించలేక పోతున్నా
సూర్యుని ప్రజ్వల కాంతిలో జఠిలమై జగతికి వెలుగునిస్తున్నా
విశ్వమంతా వెలుగుతో నిలిచిపోయేలా సూర్యునితో ఉదయిస్తున్నా
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

Tuesday, September 8, 2015

సముద్రమందైనా హిమాలయమందైనా ఉదయించే సూర్యుడిని ఒక్కడినే

సముద్రమందైనా హిమాలయమందైనా ఉదయించే సూర్యుడిని ఒక్కడినే
ఎక్కడ ఎలా కనిపించినా ఎలా ఉదయిస్తున్నా ప్రతి చోట నేను ఒక్కడినే
మేఘాలయందైనా కొండ వాగులయందైనా ఆకాశపు సరిహద్దులయందైనా
పగటి వెలుగును ఇచ్చే దివ్య కాంతుల భావాన్ని జగతికి నేను ఒక్కడినే
నా కిరణాలే నా వర్ణ తేజస్సు నా వర్ణమే అగ్ని కణాల సమర కూటమి
అస్తమించుటలో కూడా ప్రతి చోట ఆకాశమందు ఎచటనైనా నేను ఒక్కడినే
ఎడారియందైనా పచ్చని పొలాలయందైనా ఉదయిస్తూ అస్తమించే వాడిని నేనే
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

విశ్వమా! నేనే సూర్యుడినై ఉదయిస్తున్నా ఈ లోకంలో

విశ్వమా! నేనే సూర్యుడినై ఉదయిస్తున్నా ఈ లోకంలో
విశ్వపు జీవుల మేధస్సులలో ఉత్తేజానికై ప్రకాశిస్తున్నా
జీవుల కార్యాల బహు జీవన విధానాన్ని కొనసాగిస్తున్నా
తరతరాల జీవుల జీవితాలకై లోకమంతా వెలుగును ఇస్తున్నా
నాలోనే విజ్ఞానం నాలోనే కదలిక నాలోనే అనంతం నేనే జీవిస్తున్నా
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!  

Monday, August 31, 2015

ఆకాశ దేశంలో సూర్యుడే ఉదయించేను ఓ... మేఘమా!

ఆకాశ దేశంలో సూర్యుడే ఉదయించేను ఓ... మేఘమా!
ప్రతి రోజు ఉదయిస్తూ ప్రతి జీవికి మెలకువ కలిగిస్తూ
విశ్వానికే తేజమై మేధస్సులకే ఉత్తేజమై సాయంత్రపు సంధ్య వేళ అస్తమించేను ఓ... మేఘమా! ॥

జగతికే ఆది కేంద్రంలా ఉదయిస్తూ మేధస్సులకే ఆలోచన భావనను కలిగించేను
సూర్య కిరణాలతో వెలుగును ప్రసారిస్తూ మేధస్సులకే విజ్ఞానాన్ని అందించేను
తన వెలుగులోనే ప్రతి జీవి చలనం సాగిస్తూ జీవనాన్ని కార్యాలతో సాగించేను
చీకటి అయ్యేలోగా ఇంటిని చేరుతూ విశ్రాంతితో సేద తీరి జీవులు నిద్రించేను ఓ... మేఘమా! ॥

సూర్య దేశం ఓ విజ్ఞాన క్షేత్రమై ప్రతి జీవి సూర్య తేజస్సుతో విజ్ఞానంగా ఎదుగుతుంది
సూర్యుని కిరణాల తేజస్సు మేధస్సులో కలిగే ఉత్తేజమైన ఆలోచనలకు స్పూర్తినిస్తుంది
సూర్యుని శక్తితోనే మన సామర్థ్యం పట్టుదల ధృడమై వివిధ కార్యాలకు చేయూతనిస్తుంది
సూర్య ప్రపంచం ఓ విజ్ఞాన స్థావరమై విశ్వానికి పరిపూర్ణమైన సంపూర్ణ భావాన్ని కలిగిస్తుంది ఓ... మేఘమా! ॥ 

Tuesday, August 25, 2015

సూర్యుడే మన ఆలోచన సూర్యుడే మన భావన

సూర్యుడే మన ఆలోచన సూర్యుడే మన భావన
సూర్యుడే మన ఉత్తేజం సూర్యుడే మన విజ్ఞానం
సూర్యుడే మన ఓపిక సూర్యుడే మన పట్టుదల
సూర్యుడే మన చైతన్యం సూర్యుడే మన సామర్థ్యం
సూర్యుడే మన స్నేహం సూర్యుడే మన బంధం
సూర్యుడే మన గురువు సూర్యుడే మన మార్గదర్శి
సూర్యుడే మన కాలం సూర్యుడే మన కార్యం
సూర్యుడే మన జీవనం సూర్యుడే మన జీవితం
సూర్యుడే మన ఆరోగ్యం సూర్యుడే మన ఆనందం
సూర్యుడే మన దైవం సూర్యుడే మన లోకం
సూర్యుడే జగతికి అధిపతి సూర్యుడే విశ్వానికి దిక్సూచి
విశ్వ కార్యాలను నడిపించేది సూర్యుడే
మెలకువతో కార్యాలను ఆరంభింపజేసేది సూర్యుడే
సూర్యుడు లేని మేధస్సు ఉత్తేజం లేని సోమరితనమే
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!