Friday, February 3, 2017

సూర్యుడు నీవే చంద్రుడు నీవే

సూర్యుడు నీవే చంద్రుడు నీవే
విశ్వ జగతికి చీకటి వెలుగువు నీవే
లోకాలన్నింటికి భావాల తత్వం నీవే

ఏ దేహమైన ఏ జీవమైన ఉదయిస్తూ అస్తమించేది నీవే
ఏ రూపమైన ఏ ఆకారమైన ఎదుగుతూ ఒదుగుతున్నది నీవే || సూర్యుడు ||

అణువైనా నీ రూపమే పరమాణువైనా నీ ఆకారమే పరిశోధించే ఏ సూక్ష్మమైన నీ స్వభావత్వమే
తెలియని మర్మం తెలిసిన తంత్రం సృష్టించిన ఏ జీవ యంత్రమైనా నీలో దాగిన మంత్రమే

మేధస్సులో దాగిన విజ్ఞానం నీవే కలలతో సాగే ఊహల భావ స్వభావాలు నీవే
కాలంతో సాగే జనన మరణాలు నీవే సమయంతో సాగే అజ్ఞాన విజ్ఞానాలు నీవే  || సూర్యుడు ||

నీవు లేని భావం ఏదైనా శూన్యమే
భావం లేనిది ఏదైనా మహా శూన్యమే
ఏమి లేని భావం సంపూర్ణమైన శూన్యమే
ఏమి తోచని భావం పరిశుద్ధమైన శూన్యమే  || సూర్యుడు ||

No comments:

Post a Comment