Wednesday, February 1, 2017

మానవా మహాశయా! నీ రూపమే మహోదయా

మానవా మహాశయా! నీ రూపమే మహోదయా
మాధవా మహాదయా! నీ దేహమే మహాత్రయా

ప్రతి రూపం నీవేనని ప్రతి దేహం నీదేనని తెలిసేనా ఓ మహానుభావా
ప్రతి భావం నీలోనేనని ప్రతి తత్వం నీతోనేనని తోచేనా ఓ మహానుదేవా  || మానవా ||

నీ దేహమే మహా రూపమై మహాత్మగా ఉదయించెనే
నీ రూపమే మహా భావమై పరమాత్మగా జ్వలించెనే

సకాలమే నీ రూపానికి తేజమై ప్రకాశించునే
సమయమే నీ దేహానికి కాంతమై తపించునే

జీవమే నీ రూపంలో ఉచ్చ్వాస నిచ్చ్వాసగా చలించునే
వేదమే నీ దేహంలో విజ్ఞాన వేదాంతమై అధిరోహించునే  || మానవా ||

ఎన్నెన్నో రూపాలలో ఎన్నెన్నో భావాలలో నీవే కనిపించెదవు
ఎన్నెన్నో దేహాలలో ఎన్నెన్నో తత్వాలలో నీవే ప్రసవించెదవు

ఏ జీవమైన ఏ రూపమైన నీలోనే మహోదయం ఉద్భవించేను
ఏ దైవమైన ఏ దేహమైన నీలోనే శుభోదయం అంతర్భవించేను

మానవుడిగా నీ రూప స్వభావమే విశ్వానికి విజ్ఞాన సంభోగము
మాధవుడిగా నీ దేహ తత్వమే జగతికి వేదాంత సంయోగము   || మానవా || 

No comments:

Post a Comment