Tuesday, February 7, 2017

ఇది బ్రంహ భ్రమయేనా విష్ణు మాయయేనా శివ భ్రాంతియేనా

ఇది బ్రంహ భ్రమయేనా విష్ణు మాయయేనా శివ భ్రాంతియేనా
పర బ్రంహ మంత్రమో విష్ణు లీల తంత్రమో శివ ధ్యాన యంత్రమో
మానవ జీవుల మేధస్సులలో మహా వేద విజ్ఞాన పరిశోధన మర్మమే  || ఇది బ్రంహ ||

మర్మము లేని యంత్రం ఏ జీవికి లేని దేహం
మంత్రము లేని భావం ఏ జీవికి లేని మనస్సు
తంత్రం లేని తత్వం ఏ జీవికి లేని మేధస్సు

విజ్ఞానమే మహా మంత్రం విశ్వమే మహా మర్మం
దేహమే మహా యంత్రం దైవమే మహా స్తోత్రం
భావమే మహా తంత్రం తత్వమే మహా దైవం

కార్యమే మహా పరిశోధనం సాధనే వేద పర్యవేక్షణం
కాలమే మహా అనుభవం సమయమే మహా ప్రతిఫలం
జీవ ధ్యానమే మహా మోక్షం దైవ స్మరణమే మహా కటాక్షం  || ఇది బ్రంహ ||

మనస్సులోనే మంత్రం
దేహంలోనే యంత్రం
వయస్సులోనే తంత్రం
మేధస్సులోనే మర్మం

కాలమే పర బ్రంహ మంత్రం
జగమే పర విష్ణు యంత్రం
జీవమే పర శివుని తంత్రం
ఇహ పర లోకమే మర్మం

యంత్రమైన తంత్రమైన మంత్రమైన కాలమే మహా మర్మం
జీవమైన దేహమైన దైవమైన అనుభవమే మహా వేద జీవితం  || ఇది బ్రంహ || 

No comments:

Post a Comment