Showing posts with label ప్రబోధనం. Show all posts
Showing posts with label ప్రబోధనం. Show all posts

Wednesday, June 14, 2017

విజ్ఞానం నీ మేధస్సుకు తెలిసిందా పరిజ్ఞానం నీ ఎరుకకు తోచిందా

విజ్ఞానం నీ మేధస్సుకు తెలిసిందా పరిజ్ఞానం నీ ఎరుకకు తోచిందా
పరజ్ఞానం నీ మనస్సుకు కలిగిందా ప్రజ్ఞానం నీ వయస్సుకు చేరిందా  || విజ్ఞానం ||

అనుభవమే విజ్ఞానం సమ భావమే ప్రజ్ఞానం సుజ్ఞానమే పరిజ్ఞానం
సమయమే సందర్భోచితం సమ కాలమే సమయస్ఫూర్తి దాయకం

జీవితమే విజ్ఞాన పరిశోధనం జీవనమే ప్రజ్ఞాన పర్యవేక్షణం
పరిశోధనమే పరిమితి లేనిది పరిశీలనమే పరిమానం కానిది  || విజ్ఞానం ||

ప్రకృతిలోనే పరిశుద్ధ భావం విశ్వంలోనే పరిపూర్ణ స్వభావం
జగములోనే పవిత్ర బంధం లోకంలోనే ప్రత్యేక అనుబంధం

నేర్చిన భావాలే నేర్పరి తనమున విజ్ఞాన పరిశోధనం
గడిచిన స్వభావాలే లేఖరి తనమున జ్ఞాన ప్రబోధనం  || విజ్ఞానం ||