Showing posts with label గుర్తింపు. Show all posts
Showing posts with label గుర్తింపు. Show all posts

Monday, August 15, 2016

దేశం అంటే మన దేశమే ధైర్యాన్ని ఇచ్చేను మన కోసమే

దేశం అంటే మన దేశమే ధైర్యాన్ని ఇచ్చేను మన కోసమే
దేశంలో ప్రతి జీవికి ప్రశాంతమైన స్వేచ్ఛను కలిగించేను
దేశానికి ప్రతి దేశం గౌరవంతమైన గుర్తింపులెన్నో ఇచ్చేను
దేశంతో ప్రతి దేశం స్నేహాన్ని సమకూర్చేను ఎందరికోసమో
దేశానికి శాంతియుత భావాలు అవసరమయ్యేను ఎప్పటికైనా
దేశం విదేశానికి విశ్వమే రక్షణ ఇచ్చేను శాంతంగా ఉన్నప్పుడే
దేశం ఒక విజ్ఞాన ప్రగతిగా మార్గదర్శకమయ్యేను ఎన్నో దేశాలకు

Thursday, July 28, 2016

కవితలే కవిని సృష్టించేనా కవితలే కాలాన్ని కదిలించేనా

కవితలే కవిని సృష్టించేనా కవితలే కాలాన్ని కదిలించేనా
కవితలే రేపటి విజ్ఞానాన్ని సూచించేనా కవితలే కాలాన్ని మార్చేనా  || కవితలే ||

కవిగా తెలియని కవితలు ఎన్నో
కవితలుగా తెలిపే కవులు ఎందరో
కవిగా కవితలను గుర్తింపు తెచ్చేవి ఎన్నో
కవితలే కవిని స్మరింప జేసేవి ఎన్నెన్నో   || కవితలే ||

కవితలుగా కవిని కాలంతో సాగించేవి ఏవో
కవిగా కవితలను తెలిపే కాలం ఏదో ఏనాటిదో
కవితలే కాలంతో సాగుతూ పరిచయమయ్యేవి ఏవో
కవిగా తన జీవిత కాలాన్ని కవితలుగా తెలిపేవి ఎన్నెన్నో  || కవితలే || 

Friday, April 15, 2016

ఆహారముకై అలసిపోయేదనా ఆరోగ్యముకై కాలాన్ని నిద్రతో సాగించెదనా

ఆహారముకై అలసిపోయేదనా ఆరోగ్యముకై కాలాన్ని నిద్రతో సాగించెదనా
విజ్ఞానముకై అన్వేషణలో సమయం చాలక మరణించెదనా  
విజ్ఞానము ఉన్నా ఉపయోగము లేక కాలంతో నిరుపయోగమా
విజ్ఞాన నైపుణ్యాన్ని గుర్తించలేక కాలంతో భవిష్యత్ వృధాయేనా
విజ్ఞానం కలిగిన వారిని సమాజం వ్యాపార సాంకేతిక రంగం గుర్తించునా
గుర్తింపు లేనివారు సమాజంలో దినచర్యలతో సతమతమయ్యేనా
విజ్ఞానంలో ఎదుగుదలను గురించలేక సమాజంలో సమస్యలు అధికమేనా
సమస్యకు తాత్కాళిక ప్రయోజనాలకన్నా శాశ్విత ప్రణాళికలే ముఖ్యమేగా
శాశ్విత ప్రణాళికలతో పాత సమస్యలు పునరావృతం కానట్లు చేసుకోవాలిగా  
మనలో విజ్ఞానం ఉన్నా గురించలేని సమాజం యదార్థంగా సాగిపోవును
శాశ్విత ప్రణాళికల ఆలోచనలు నా మేధస్సులో అనేకమై సాగుతున్నాయిగా