Tuesday, December 20, 2011

విశ్వ జీవిగా జీవించు దేవా

విశ్వ జీవిగా జీవించు దేవా
నీవు జీవిస్తే ప్రతి జీవి జీవించేను దేవా
సూర్య తేజముగా లోకాన్ని మేల్కొలిపెదవు దేవా
నీ కిరణాన్నే మహా శక్తిగా ప్రతి జీవికి అందించెదవు...!
నీ వెలుగునే లోకానికి విజ్ఞానంగా ప్రసాదించేవు...!

Monday, December 19, 2011

బంధం ఉన్నవారికి నన్ను కలవాలనే

బంధం ఉన్నవారికి నన్ను కలవాలనే ఆలోచన నేడు లేకపోతే
ఇక నన్నెప్పుడు కలవలేనట్లు విశ్వానికి దూరమై జీవిస్తాను
ఏ బంధం దూరమైనా నా మనస్సు మీ మేధస్సుకై జీవిస్తుంది
మీ జీవితాలను సాగించేందుకే ప్రతి క్షణం మీలోనే ఉంటాను
నన్ను కలవాలని ఏనాడైనా అనుకున్నా కానరాని దూరంలో పలకరిస్తాను
ఎవరు ఎక్కడున్నా నా భావన మీ జీవితంలో ప్రయాణిస్తూనే ఉంటుంది

Monday, December 12, 2011

విఘ్నమే ముఖ బింభమై రూపమే

విఘ్నమే ముఖ బింభమై రూపమే ఆది స్థానమై ఈశ్వరునికే విఘ్నేశ్వరుడై
లోకమే పూజించగా విశ్వానికే గజ ముఖమై మహా గుణ విజ్ఞాన రూపమై
ఏక దంతపు నిత్య పవిత్రుడై మహా కార్యాలకు మూల కేంద్ర శుభ కారకుడై
కర్త కర్మ క్రియలు తన నుండే మొదలై జగతికే మహానందుడై నిలిచాడు

ఏ జీవి ఎక్కడికి చలనమవుతుందో

ఏ జీవి ఎక్కడికి చలనమవుతుందో ఏనాడు ఎక్కడ జీవిస్తుందో
తోడుగా జీవిస్తున్నా ఒంటరిగా జీవిస్తున్నా జీవితం సాగేందుకే
ఎక్కడ జీవిస్తున్నా ప్రతి జీవం ఆర్భాటం చెందుతూనే ఉంటుంది
ఆర్భాటంతోనే కాల ప్రయాణం సాగిపోతూ ప్రతి జీవి జీవిస్తుంది

మంత్రాన్ని మరిచాను మర్మ ధ్యాసలో

మంత్రాన్ని మరిచాను మర్మ ధ్యాసలో మరణాన్ని తలిచాను నేటి ధ్యాసతో
మరల రాని జన్మనే వదులుకున్నాను మరోసారి ఆలోచించలేక పోయాను
విధి కాల భావాలకు ఒదిగిపోయి అనారోగ్యపు బంధాలతో సాగుతున్నాను
నేను నేనుగా శిక్ష వేసుకున్నానేమోనని జీవితమే ఎటో వెళ్ళిపోతున్నది

Monday, December 5, 2011

విశ్వమున ప్రతి కార్యాన్ని చేయగలిగేలా

విశ్వమున ప్రతి కార్యాన్ని చేయగలిగేలా సూర్య భావ శక్తి మేధస్సులోనే ఉన్నది