Showing posts with label ఏకాంతం. Show all posts
Showing posts with label ఏకాంతం. Show all posts

Monday, October 17, 2016

శాంతం ప్రశాంతం మనస్సే ఏకాంతం

శాంతం ప్రశాంతం మనస్సే ఏకాంతం
భావం ప్రభావం వయస్సే సుఖాంతం
లోకం పర లోకం మనిషికే వేదాంతం  || శాంతం ||

ఏనాటికో మనకు ఏకాంతము ఎవరితో మనకు సుఖాంతము
ఎప్పటికో మనకు సర్వాంతము ఎందుకో మనకు వేదాంతము

ఏకాంతమే ఏకాగ్రతమై విజ్ఞానమే ప్రజ్ఞానమయ్యేను
భావాంతమే స్వభావమై ఊహత్వమే వేదాంతమయ్యేను
సుఖాంతమే సంపూర్ణమై సర్వత్వమే సమాప్తమయ్యేను   || శాంతం ||

కాలమే మనకు కార్య గమనమై సమయమే సాగిపోవును
నాదమే మనకు వేద వచనమై విజ్ఞానమే వెలిగిపోవును

విశ్వాంతమే జీవత్వమై దేహమే ఉదయించేను
ప్రశాంతమే ఏకత్వమై దైవమే ప్రజ్వలించేను
సర్వాంతమే సమాప్తమై ధర్మమే అస్తమించేను  || శాంతం ||