Showing posts with label ధర్మము. Show all posts
Showing posts with label ధర్మము. Show all posts

Tuesday, April 18, 2017

జీవించవా నా శ్వాసతో ధ్యానించవా నా ధ్యాసతో

జీవించవా నా శ్వాసతో ధ్యానించవా నా ధ్యాసతో
గమనించవా నా భావాలతో తపించవా నా తత్వాలతో
ప్రతి క్షణం ప్రతి సమయం నా విశ్వ రూప విజ్ఞానంతో  || జీవించవా ||

శ్వాసలో నీవే ధ్యాసలో నీవే గమనమై మరో జీవమై ధ్యానించెదవో
రూపమే నీవై దేహమే నీవై వేద స్వభావ తత్వంతో తపించెదవో

స్వరములో నీవై ఉచ్చ్వాసలో నీవై మహా గుణముతో నీవు స్పందించెదవో
జీవములో నీవై ప్రాణములో నీవై మహా లక్ష్యముతో నీవు పరవశించెదవో   || జీవించవా ||

వినయము నీవే విధేయత నీవే విశ్వ బంధము నీవే తెలిపెదవో
మౌనము నీవే మమతవు నీవే మధుర తత్వము నీవే గ్రహించెదవో

జ్ఞానము నీవే గమకము నీవే గాత్రము నీవే నడిపించెదవో
దైవము నీవే ధీరము నీవే కాల ధర్మము నీవే సాగించెదవో       || జీవించవా ||

Monday, March 6, 2017

దైవము మనుష్య రూపమై ధర్మము విజ్ఞాన కార్యమై అవతరించును

దైవము మనుష్య రూపమై ధర్మము విజ్ఞాన కార్యమై అవతరించును మన లోకంలో
వేదము మనుష్య జ్ఞానమై తత్వము జీవ స్వభావమై ఉదయించును మన విశ్వంలో 

Wednesday, July 6, 2016

దశ గురువులు దశ దిక్కులలో దశాబ్దాలుగా బోధించేను

దశ గురువులు దశ దిక్కులలో దశాబ్దాలుగా బోధించేను
దశాబ్దాలుగా సాగిన విజ్ఞానం మహా విజ్ఞాన నిత్య సత్యము
భావ స్వభావాల తత్వాలు విశ్వ విజ్ఞాన సూక్ష్మ వేదాంతము
దైవ ధర్మములు జీవుల ఆత్మ సంభాషణల సంభోగము