Showing posts with label దేశం. Show all posts
Showing posts with label దేశం. Show all posts

Wednesday, May 3, 2017

ఏది నీ దేశం ఏది మన దేశం

ఏది నీ దేశం ఏది మన దేశం
ఏది మన భావం ఏది మన తత్వం
మనలోనే విశ్వ గీతం మనలోనే జగతి పతాకం
మనమే చైతన్యం మనమే ఐక్యత చిహ్నం ఓ మానవా!  || ఏది నీ దేశం ||

మనిషిగా జీవించు మనస్సుతో జగతినే నడిపించు
మహర్షిగా దీవించు మనస్సుతో విశ్వాన్నే సాగించు

మనలోనే మాధవుడు మనలోనే మహాత్ముడు ఉదయిస్తున్నాడు
మనలోనే పరమాత్మ మనలోనే పరంధామ ఎదుగుతున్నాడు ఓ మానవా!  || ఏది నీ దేశం ||

దేశ దేశాలు తిరిగినా ప్రపంచమంతా విజ్ఞాన అన్వేషణయే
ఎన్ని రోజులు గడిచినా విశ్వమంతా విజ్ఞాన పరిశోధనయే

మనిషిలోనే సద్భావం మనలోనే మానవత్వం
మనిషిలోనే విజ్ఞానం మనలోనే పరిశుద్ధాత్మం ఓ మానవా!  || ఏది నీ దేశం ||

Friday, January 6, 2017

ఏ దేశం నీ దేశం ప్రతి దేశం ఓ ప్రదేశం

ఏ దేశం నీ దేశం ప్రతి దేశం ఓ ప్రదేశం
ప్రదేశమంతా మన ప్రపంచం అదంతా ఓ లోకం
లోకమంతా మన ప్రదేశం అదే మన దేశాల ప్రపంచం   || ఏ దేశం ||

దేశమే స్నేహితం ప్రదేశమే సన్నిహితం
లోకమే సత్యాంశం ప్రపంచమే సందేశం
దేశ విదేశమే ధర్మాంశం విజ్ఞానమే సంభోదితం
విశ్వ జగతియే మహా పవిత్ర ప్రదేశ విదేశ దేశం   || ఏ దేశం ||

దేశాలు ఐక్యమై విదేశాలు ఒక్కటై ప్రదేశమయ్యేను ఒక ప్రపంచం
ప్రదేశమంతా ప్రపంచ దేశాల ప్రాంతాల భూగోళ భూభాగాల లోకం
దేశాల ప్రదేశాలే వివిధ ఖండాల ప్రాంతాల ప్రపంచ దేశాల విశ్వం
ప్రకృతిలో ఒదిగిన అడవులు వనరులు సముద్రాలు భూస్థల ప్రదేశం  || ఏ దేశం ||

ఏ దేశమైన ఏ ప్రాంతమైన ఏ ప్రదేశమైన ఒకే రకమైన గాలి నీరు సూర్యోదయం
ఎక్కడైనా ఎవరైనా ఏ జీవమైనా జీవించే విధానం ఆహార నిద్రల కాల కార్యాక్రమం
ఎవరికైనా భావాలు తత్వాలు వేదాల విజ్ఞానం ఒకటిగా కలిగి సాగే శ్రమే పరమార్థం
జీవించే ప్రతి జీవి మరణించునని ఏ ప్రదేశమైన తెలిపే సామాన్య జీవన విధానం   || ఏ దేశం ||

Wednesday, December 14, 2016

మహాత్మవై ఎదగాలి మహర్షివై ఒదగాలి

మహాత్మవై ఎదగాలి మహర్షివై ఒదగాలి
పరమాత్మవై నిలవాలి పరంధామగా ఉండాలి
చిరంజీవివై జీవించాలి పరంజ్యోతిగా వెలగాలి  || మహాత్మవై ||

మహాత్మగా అవతరించి అవధూతగా నీవే మా లోకంలో ఎదగాలి
మహర్షిగా అధిరోహించి అవధానిగా నీవే మా విశ్వంలో ఒదగాలి
పరమాత్మగా ఉదయించి పరధ్యానంతో నీవే మా జగతిలో నిలవాలి

ఏ విశ్వ జగతి లోకంలో చూసినా నీవే మా మాధవ స్వరూపం   || మహాత్మవై ||

పరంధామగా నడిపించి పరజ్ఞానంతో నీవే మా మేధస్సులో ఉండాలి
చిరంజీవిగా అభ్యసించి చైతన్యంతో నీవే మా దేశంలో జీవించాలి
పరంజ్యోతిగా సాగించి పరతత్వంతో నీవే మా ప్రకృతిలో వెలగాలి

ఏ ప్రకృతి దేశంలో వెతికినా నీవే మా మేధస్సుకు విజ్ఞాన వేదం  || మహాత్మవై ||

Wednesday, November 30, 2016

ఓ దేశమా నీ ఎదుట నిలిచింది ప్రపంచమే

ఓ దేశమా నీ ఎదుట నిలిచింది ప్రపంచమే
విశ్వమే నీ దేశాన్ని చూపిస్తున్నది ఆకాశమై
సూర్యోదయంతో నీ లోకాన్ని వెలిగిస్తున్నది జగమే  || ఓ దేశమా ||

ప్రతి దేశం ఓ రూపం ప్రతి రూపం ఓ మహా భావం
ప్రతి భావం ఓ జీవం ప్రతి జీవం ఓ మహా దైవత్వం

దేశమే లోకమై ప్రపంచమే విదేశాల మహా సమూహమై జగమైపోయేను
పరదేశిగా ప్రవేశమై విదేశమే స్వదేశమై జనులతో నీవు స్థిరపడిపోయేను  || ఓ దేశమా ||

ప్రతి విశ్వం ఓ లోకం ప్రతి లోకం ఓ మహా నగర దేశం
ప్రతి దేశం ఓ ప్రదేశం ప్రతి ప్రదేశం ఓ మహా ప్రపంచం

దేశమే మహా జనులకు జీవమై లోకమే దేశానికి మహోదయమయ్యేను
విదేశమే ప్రజలకు స్నేహమై విశ్వమే ప్రపంచానికి నవోదయమయ్యేను  || ఓ దేశమా ||

Tuesday, November 8, 2016

ఎవరే నీవు ఎవరే అని అంటున్నది నా హృదయం

ఎవరే నీవు ఎవరే అని అంటున్నది నా హృదయం
ఎవరే నీవు ఎవరే అని అడుగుతున్నది నా మౌనం

మనస్సులో కలిగే భావాలకు నీవే ప్రతి రూపం
వయస్సులో తోచే భావాలకు నీవే ప్రతి నాదం   || ఎవరే నీవు ||

ప్రతి మాటలో నీ ప్రేమే పిలుస్తున్నది
ప్రతి బాటలో నీ భావమే కనిపిస్తున్నది

ఏ చోట ఉన్నా నీ ధ్యాసే ఏ క్షణమైనా నీ శ్వాసే నాలో
ఏనాటికైనా నీ వైపు నేనే ఏ చెంతనైనా నీ తోడు నేనే  

ఏ లోకమైన కనిపించేది నీవే పరలోకమైన వినిపించేది నీవే
ఏ విశ్వమైన చూపులకు నీవే ఏ జగమైన అలజడులకు నీవే  || ఎవరే నీవు ||

ఏ దేశమైన ప్రతి దేశం నా ప్రపంచంలోనే ప్రేమగా ఉంటుంది నీ దేహం
ఏ ప్రాంతమైన ప్రతి ప్రాంతం నా ప్రదేశంలోనే స్థిరమై పోతుంది నీ రూపం

సముద్రాల కెరటాలలో దాగిన అలల ప్రవాహం నీ కోసమే ఉప్పొంగేనే
నదుల ప్రవాహాలలో దాగిన నీటి ఊటలే నీ కోసమే ఉరకలు సాగించేనే  || ఎవరే నీవు ||

Thursday, September 15, 2016

అదిగదిగో ఆకాశం అదే మన దేశం

అదిగదిగో ఆకాశం అదే మన దేశం
కనిపించే మేఘాలే మన లోకం అదే మన ప్రపంచం || అదిగదిగో ||

ఉదయించే సూర్యునితో మేల్కోవడం
మెరిసే కిరణంతో విజ్ఞానం పొందడం
కదిలే మేఘాలతో ప్రయాణం విశ్వమంతా చుట్టడం
భూగోళమే భౌతికం భూలోకమే భువనం
భూమి భ్రమణమే భూతాంశ నియమం   || అదిగదిగో ||

ఆకాశంతో తిలకించడం మేఘాల భావాలతో వర్ణాలను దర్శించడం
అపురూపమైన ఆకార రూపాలను చూస్తూ మేఘాలతోనే సాగిపోవడం

కాలంతో ప్రయాణం అద్భుతమైన దృశ్య కావ్యం
స్థానికుల జీవన విధానం ఓ మహోత్తర విషయం
విజ్ఞానంతో సాగడం అనుభవానికి మహా దర్పణం
విశ్వాంతర విజ్ఞానం జీవితానికి నవోదయ కిరణం
నూతన సాహసం మరో అనుభావాన్ని చూసుకోవడం  || అదిగదిగో || 

Wednesday, September 14, 2016

స్వాతంత్య్రం వచ్చిందా స్వరాజ్యం ఇచ్చిందా

స్వాతంత్య్రం వచ్చిందా స్వరాజ్యం ఇచ్చిందా
సామ్రాజ్యం ఏర్పడిందా సంతోషం కలిగిందా
సమరం ఆగిందా సత్యం ధర్మం నడిచిందా
శతాబ్దాల పరిపాలన ప్రభుత్వం మారిపోయిందా  || స్వాతంత్య్రం ||

జయమే మనదై దేశమే సగర్వమై నిలిచిందా
ధైర్యమే గర్వించేలా మన దేహమే పోరాడిందా
రణ రంగం ముగిసేలా ఆక్రమణ ఆగిపోయిందా
శత్రుత్వం నశించేలా మిత్ర భావం కలిసిందా

హితమేదో తెలిసిందా స్థానిక బలమెంతో గుర్తించిందా || స్వాతంత్య్రం ||

ఎవరికి వారు స్వేఛ్ఛా జీవితాన్ని ఆరంభించారా
ఎవరికి ఎవరో మనకు బంధాన్ని కలిగించారా
ఎవరున్నా లేకున్నా మన జీవనాన్ని సాగించారా
ఎవరో వచ్చి పోయినా మన కుటుంబాన్నే మిగిలించారా

మనదే దేశం మనదే లోకం మనమే ముందుకు సాగేదం
మనలో చైతన్యం మనమే సమూహం మనతోనే సాహసం || స్వాతంత్య్రం || 

Monday, August 15, 2016

దేశం అంటే మన దేశమే ధైర్యాన్ని ఇచ్చేను మన కోసమే

దేశం అంటే మన దేశమే ధైర్యాన్ని ఇచ్చేను మన కోసమే
దేశంలో ప్రతి జీవికి ప్రశాంతమైన స్వేచ్ఛను కలిగించేను
దేశానికి ప్రతి దేశం గౌరవంతమైన గుర్తింపులెన్నో ఇచ్చేను
దేశంతో ప్రతి దేశం స్నేహాన్ని సమకూర్చేను ఎందరికోసమో
దేశానికి శాంతియుత భావాలు అవసరమయ్యేను ఎప్పటికైనా
దేశం విదేశానికి విశ్వమే రక్షణ ఇచ్చేను శాంతంగా ఉన్నప్పుడే
దేశం ఒక విజ్ఞాన ప్రగతిగా మార్గదర్శకమయ్యేను ఎన్నో దేశాలకు

Wednesday, May 25, 2016

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మంచి మనుషులోయ్

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మంచి మనుషులోయ్
దేశమంతా మంచి ఉందోయ్ ప్రపంచమంతా సాగిపోవునోయ్
దేశమంటే స్నేహమోయ్ విదేశమంటే గౌరవమోయ్
దేశాన్ని ప్రేమించవోయ్ ప్రపంచాని తిలకించవోయ్
దేశమంటే విజ్ఞానమోయ్ ప్రపంచమంటే అనుభవమోయ్
దేశమంటే యుద్ధం కాదోయ్ విదేశమంటే విధ్వంసం కాదోయ్
దేశమంటే చరిత్రయేనని ప్రపంచమంటే మహా గ్రంథమోయ్

దేశాన్ని దత్తత తీసుకోనా ప్రపంచాన్ని దత్తత తీసుకోనా

దేశాన్ని దత్తత తీసుకోనా ప్రపంచాన్ని దత్తత తీసుకోనా
దేశాన్ని దత్తత తీసుకొని ప్రపంచాన్ని నేను మార్చుకోనా
ఒక ఊరిని దత్తత తీసుకుంటే పక్క ఊరితో చెద పట్టేనా
ఒక ఊరు మారిపోతే పక్క ఊరిలో సమస్యలు పెరిగేనా
ఒకరికి ఒకరు సరికాకపోతే ఏ ఊరు చక్కగా మారిపోదు
అందరు మారిపోతేనే మన దేశంతో అన్ని దేశాలు మారేను
అన్ని కార్య క్రమాలు మంచి భావంతో సాగిపోతేనే చైతన్యం
ఈర్షా అసూయ ద్వేషం ఉన్నంతవరకు ఏది సరికాదు
మంచి గుణాలతో జీవిస్తేనే దేశమంతా మంచి ప్రాకుతుంది
దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మంచి మనుషులోయ్
దేశమంతా మంచి ఉందోయ్ ప్రపంచమంతా సాగిపోవునోయ్
దేశమంటే స్నేహమోయ్ విదేశమంటే గౌరవమోయ్
దేశాన్ని ప్రేమించవోయ్ ప్రపంచాని తిలకించవోయ్
దేశమంటే విజ్ఞానమోయ్ ప్రపంచమంటే అనుభవమోయ్
దేశమంటే యుద్ధం కాదోయ్ విదేశమంటే విధ్వంసం కాదోయ్
దేశమంటే చరిత్రయేనని ప్రపంచమంటే మహా గ్రంథమోయ్ 

Monday, August 31, 2015

దేశ భాషలందు తెలుగు భళా!

దేశ భాషలందు తెలుగు భళా!
విశ్వ భాషలందు తెలుగు కళా!
వివిధ భాషలందు తెలుగు మేళా!
భావ భాషలందు తెలుగు తేటలా!
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

Friday, August 28, 2015

ఓ...! విశ్వ భారతి ఇది భారతీయుల సంస్కృతి

ఓ...! విశ్వ భారతి ఇది భారతీయుల సంస్కృతి
నేటి ప్రగతి మన భారత దేశ పరిస్థితుల ఉన్నతి
మన విజ్ఞాన కీర్తి శాస్త్రజ్ఞుల పరిశోధనల ఉచ్చస్థితి
మన దేశ ఖ్యాతి విదేశాలలో మెచ్చే గౌరవ పరిపూర్ణతి
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

Monday, August 24, 2015

మన దేశ చరిత్రయే విశ్వ భారతం

మన దేశ చరిత్రయే విశ్వ భారతం
మన దేశ పురాణాలే విశ్వ మాతరం
మన దేశ ఇతిహాసాలే విశ్వ తరంగం
మన దేశ శతకాలే విశ్వ గీతరం
మన దేశ యువకులే విశ్వ చైతన్యం
మన దేశ జనులే విశ్వ జీవితం
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

దేశం మన దేశం భారత ప్రపంచం

దేశం మన దేశం భారత ప్రపంచం
దేశం విదేశం భారతీయుల స్నేహం
దేశానికి మనమే భారత పౌరులం
దేశ విదేశాలే శాంతి యుత స్నేహ సంబంధం
భారత దేశమే దేశ విదేశాలకు విజ్ఞాన ఖనిజం
తర తరాలకు యువ తరమే వందే మాతరం
దేశ విదేశాల భారతీయులకు మన వందనం
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

దేశాన్ని ప్రేమించు విదేశాన్ని మెప్పించు

దేశాన్ని ప్రేమించు విదేశాన్ని మెప్పించు
మన దేశమంటే ప్రపంచం విదేశమంటే స్నేహం
మన దేశ విజ్ఞానాన్ని విదేశాలకు అందించు
మన దేశ కీర్తి వివిధ దేశాలకు స్పూర్తి ఖ్యాతి
మన దేశం విశ్వ జగతికే విజ్ఞాన దాయకం
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!  

Saturday, December 26, 2009

ప్రేమే దేశం ప్రాణమే త్యాగం

ప్రేమే దేశం ప్రాణమే త్యాగం అమర జీవులు సాధించినదే కీర్తి ఖ్యాతి స్వాతంత్య్రం
మనదే దేశం మనదే రాజ్యం మనం చాటుకున్నమానవ రూప భావమే మానవత్వం
మనదే దేశం మనలో స్నేహం మనం గౌరవించుకున్నదే మహా జన్మ భూమి భావం
మనదే జగతి మనలో ప్రగతి మనలోని విశ్వ విజ్ఞానమే ప్రపంచానికి ప్రశాంతి స్తూపం