అదిగదిగో ఆకాశం అదే మన దేశం
కనిపించే మేఘాలే మన లోకం అదే మన ప్రపంచం || అదిగదిగో ||
ఉదయించే సూర్యునితో మేల్కోవడం
మెరిసే కిరణంతో విజ్ఞానం పొందడం
కదిలే మేఘాలతో ప్రయాణం విశ్వమంతా చుట్టడం
భూగోళమే భౌతికం భూలోకమే భువనం
భూమి భ్రమణమే భూతాంశ నియమం || అదిగదిగో ||
ఆకాశంతో తిలకించడం మేఘాల భావాలతో వర్ణాలను దర్శించడం
అపురూపమైన ఆకార రూపాలను చూస్తూ మేఘాలతోనే సాగిపోవడం
కాలంతో ప్రయాణం అద్భుతమైన దృశ్య కావ్యం
స్థానికుల జీవన విధానం ఓ మహోత్తర విషయం
విజ్ఞానంతో సాగడం అనుభవానికి మహా దర్పణం
విశ్వాంతర విజ్ఞానం జీవితానికి నవోదయ కిరణం
నూతన సాహసం మరో అనుభావాన్ని చూసుకోవడం || అదిగదిగో ||

No comments:
Post a Comment