Monday, September 19, 2016

శ్రీ చక్రాధరా నీ ఆభరణములే మా అలంకారములు

శ్రీ చక్రాధరా నీ ఆభరణములే మా అలంకారములు
శ్రీ శంఖాధరా నీ స్వరములే మా సంగీత కావ్యములు

నీవు వెలిసిన సప్త గిరులే మహా క్షేత్ర పుణ్య తీర్థములు
నీవు నిలిచిన స్థానములే మహా దైవ పూజ్య పునస్కారాలు

నిత్యం నీ దేహానికి పూజార్చనములు పుష్పములు పాద స్పర్శములు
నిరంతరం నీకు సేవ సన్నిధములు నూతన వస్త్ర భావ కళ్యాణములు  || శ్రీ చక్రాధరా ||

నీకై విరిసిన పారిజాతములచే పుష్పాభిషేకములు
నీకై పండిన ధాన్య ఫలములచే ఫలాభిషేకములు

మెలకువతో ఉంటావని నీకు నిత్య సుప్రభాతములు
సమూహముతో కదిలి వచ్చే జనానికి నీ వర భాగ్యములు   || శ్రీ చక్రాధరా ||

నీ ఐశ్వర్యములు ఏడు కొండలుగా దాగిన మహా గోపుర రాసులు
నీ అన్నదానములు ఎన్ని తరములైనను నిత్యం ప్రసాదములు

నీ దర్శనముకై వచ్చే కాలి నడకల భక్తులు అలసిన బంధములు
నీ రూప ఛాయముచే భక్తులలో కలిగేను మహా మహా ఆనందములు

తరతరాలుగా వచ్చి చేరేను నీకై భక్తుల ముడుపులు కానుకలు
తరతరాలుగా కొన సాగేను నీ మహిమల మహా భావ చరిత్రములు  || శ్రీ చక్రాధరా ||

No comments:

Post a Comment