Showing posts with label దేహము. Show all posts
Showing posts with label దేహము. Show all posts

Thursday, May 25, 2017

ఆలోచన ఒక భావమై మేధస్సునే కదిలించేను

ఆలోచన ఒక భావమై మేధస్సునే కదిలించేను
భావమే ఒక కార్యమై మేధస్సునే నడిపించేను

మనలో ఎన్ని కార్య భావాల ఆలోచనలు సాగినా
మేధస్సులో అంతరంగ స్వత భావాలు దాగేను
 
విజ్ఞానము మేధస్సులో ఆలోచనగా లేకున్నను
భావనగా దేహములో అంతర్భావమే కొనసాగేను   || ఆలోచన ||

ఏనాడు నా శ్వాసపై స్వధ్యాస ఉంచకున్నను 
నా మేధస్సే హృదయ క్రియలను సాగించేను

ఏనాడు నా స్వభావాలపై సమయాలోచన చేయకున్నను
నా మేధస్సే ఆలోచనలతో ఎన్నో కార్యాలను జరిపించేను  || ఆలోచన ||

ఏనాడు నా అంతర్భావాలను గమనించకున్నను
నా మేధస్సే అంతర్లీనమై దేహాన్ని సమకూర్చేను

ఏనాడు నా దేహాన్ని స్వతహాగ ఓదార్చకున్నను
నా మేధస్సే నన్ను మహా గొప్పగా మైమరిపించేను  || ఆలోచన ||

Wednesday, January 18, 2017

జీవ మంత్రమో దైవ తంత్రమో దేహమే మహా మర్మ యంత్రమో

జీవ మంత్రమో దైవ తంత్రమో దేహమే మహా మర్మ యంత్రమో
వేద జ్ఞానమో నాద భావమో స్వరమే సర్వ లోకాల విశ్వ విజ్ఞానమో
జీవ జన్మత్వమో వేద మేధస్సత్వమో మనస్సే మహా మార్గత్వమో  || జీవ మంత్రమో ||

దైవ లోకమిదే వేద జ్ఞానమిదే మర్మ రహస్యాల జీవమిదే దేవా
నాద భావమిదే దేహ రూపమిదే స్వర తంత్ర మంత్రమిదే దేవా

జీవ రూపములే జన్మ జన్మల పర రూప బంధాలు దేవా
దైవ దేహములే ఆత్మ పరమాత్మల పర తత్వాలు దేవా   || జీవ మంత్రమో ||

పరంపరల పరరూప దేహాలు పరతంత్ర విజ్ఞాన యంత్రమే దేవా
తరతరాల పరభావ బంధాలు పరజీవ మేధస్సు మంత్రమే దేవా

సర్వ వేదాల అన్వేషణ సారాంశం జ్ఞాన విజ్ఞాన మర్మమే దేవా
దైవ రూపముల పర దేహ తత్వాలు ఆత్మ పరమాత్మమే దేవా  || జీవ మంత్రమో || 

Monday, December 5, 2016

కవి రాజుకే అందని తోచని భావానివో

కవి రాజుకే అందని తోచని భావానివో
కవి ధాతకే కలగని తెలియని వేదానివో
కవి వర్మకే వినిపించని కనిపించని తత్వానివో   || కవి రాజుకే ||

ఏ కవికి తెలియని భావాల మధుర పుష్పాల కవితలే నా మేధస్సులో మాధుర్యమూ
ఏ కవికి కలగని వేదాల మధుర మాణిక్యములే నా ఆలోచనలలో మహా మనోహరమూ
ఏ కవికి వినిపించని మందార మకరందాలే నా మనస్సులో మహా మహా మోహనమూ
ఏ కవికి కనిపించని సుందర సుగంధాల సువర్ణములే నా దేహములో మహా తేజమూ
ఏ కవికి స్పర్శించని రూపాల ఆకార స్వరూపములే నా యదలో మహా స్వప్నమూ     || కవి రాజుకే ||

ఏ కవి శర్మకు తోచని నవ భావాల సోయగాల వంపులే నాలోని పద్మముల పదజాలమూ
ఏ కవి చంద్రకు అందని వేదాల నవ కాంతుల వయ్యారములే నాలోని రాగాల పదకీర్తనమూ
ఏ కవి తేజకు ఎదురవ్వని తత్వాల సుగంధ సువర్ణములే నాలోని పుష్పాల పదభూషణమూ
ఏ కవి నేత్రకు స్పర్శించని స్వభావాల సుందర సుమధురాలే నాలోని పూల పదపాండిత్యమూ
ఏ కవి గాత్రకు అనిపించని ఆనంద సంతోష గానములే నాలోని గీతముల పదసంభాషణమూ
ఏ కవి జంటకు అన్వేషించని రూప స్వరూపముల ఆకారాలే నాలోని గానాల పదస్వరూపమూ  || కవి రాజుకే ||

Monday, July 25, 2016

నా హృదయం మరణించేనే నాలో భావన నిలిచిపోయేనే

నా హృదయం మరణించేనే నాలో భావన నిలిచిపోయేనే
నా ఆలోచన ఆగిపోయేనే నాలో ధ్యాస విశ్వమై కలిసిపోయేనే  || నా హృదయం ||

మరణంతో మౌనమై మేధస్సులో భావాలే శూన్యమై
హృదయంతో లీనమై జగతిలో బంధాలే నిర్జీవమై

గగనాన్ని తాకే నా ఆలోచన ప్రకృతిలో ఒదిగిన నా భావన
నేలను తాకే నా దేహము విశ్వంలో ఆత్మగా సాగే ఆవేదన || నా హృదయం ||

జగమంతా ఓ జ్ఞాపకమై మేధస్సులో సు చరితగా నిలిచిపోయేనే
లోకమంతా ఓ మహా కార్యమై మనస్సులో గుర్తుగా ఉండిపోయేనే

వేదాంతపు విజ్ఞానం మేధస్సులో దాగిన మహా కావ్య గ్రంథమే
వేదనల అనుభవం హృదయంలో నిండిన మహా కార్య ధీక్షయే  || నా హృదయం || 

Thursday, June 16, 2016

నీవే లేవని నేనే లేనని

నీవే లేవని నేనే లేనని
నీవే లేవని నాతోనే వచ్చింది నీ భావన
నేనే లేనని నాలోనే నిలిచింది నా ఆలోచన  || నీవే లేవని ||

నీవే లేని నాకు ఏదీ తోచని భావనగా నిలిచింది
నీవే లేవని నాలో శూన్యమే అంతరించి పోయింది

నీవే లేని నాలో ఏదో సందేహమే కలుగుతున్నది
నీవే లేవని నాలో శ్వాసే కర్పూరమై కరుగుతున్నది  || నీవే లేవని ||

నీవే లేని నాలో ఎన్నో చిత్రములు కనిపిస్తూ ఉన్నాయి
నీవే లేవని నాలో దిక్కులు అన్నీ ఒకటిగానే నిలిచాయి

నీవే లేని నా దేహములో కాంతి లేని మేఘ వర్ణాలు కమ్ముకున్నాయి
నీవే లేవని నా యదలో స్వప్త స్వరములన్నీ మౌనామై పోతున్నాయి  || నీవే లేవని ||