Showing posts with label మకరందం. Show all posts
Showing posts with label మకరందం. Show all posts

Tuesday, June 14, 2016

మరణమా మరో హృదయమా

మరణమా మరో హృదయమా
మధురమా మహా మరణమా

మరణంతోనే హృదయం మధురమా
హృదయంలోనే మరణం మధురమా  || మరణమా ||

మధురం లేని జీవితం మోహం లేని హృదయం
స్వప్నం లేని జీవనం మౌనం లేని హృదయం

హృదయంలోనే జీవితం అతి మధురం మకరందం
మరణంతోనే జీవితం అతి సుందరం సుమధురం

మధురం మధురం మనస్సే మధురమైన హృదయం
మరణం మరణం వయస్సే మనోహరమైన మధురం   || మరణమా ||

హృదయమే సుగంధాల సువర్ణ తేజం
మరణమే సుభాస్పాల సుదీర్ఘ ప్రయాణం

హృదయంతో సాగే జీవితం విశాలమైన జీవన మరణం
మరణంతో సాగే లోకం విచ్చిన్నమైన జీవిత చదరంగం

మరణం హృదయం జన్మకు తెలియని మహా భావం
హృదయం మరణం జీవికే తెలియని గొప్ప స్వభావం  || మరణమా ||