Showing posts with label బహుజన. Show all posts
Showing posts with label బహుజన. Show all posts

Friday, June 30, 2017

బహుజన వీరా మహాజన సేనా

బహుజన వీరా మహాజన సేనా
జనగణన ధీరా జనజనన శూర ...  

జగానికే అధిపతి యుగానికే ప్రజాపతి
విశ్వానికే ఛత్రపతి లోకానికే మహాపతి   || బహుజన ||

దేశానికే వీరుడివై సమాజానికే విజేయుడవై
లోకానికే అభయమై మహా ధర్మ రక్షకుడివై

విశ్వ విఖ్యాత ప్రతాపము నీ రూపమై  విజయ విజేత పతాకము నీ చిహ్నమై
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ధీరముతో ప్రపంచ ప్రఖ్యాత గావించిన స్థైర్యముతో

కీర్తి ఖ్యాతి గాంచిన మహా ధర్మ రక్షకుడిగా ప్రజాసేన ధైర్యాన్ని గెలిపించావు
శాంతి ప్రశాంతి వెలసిన మహా సాధువుడిగా ప్రజాదరణతో లోకాన్ని శాసించావు  || బహుజన ||

సాహసమే సహనంగా సమయమే సమర్థతగా
ఆయువే ఆయుధముగా ఆలోచనే ఆశ్రయముగా    

రణరంగం మాటలతో శాంతమై వివరణతో పరిశోధనమై
ప్రజల క్షేమమే పరమావధిగా మౌనంతో ఉచ్ఛలనమై

విశ్వ శాంతి భద్రతగా దేశ రక్షణ బాధ్యతగా ప్రజలనే గెలిపించావు
జన కాంతి జ్ఞానంగా జగతినే రక్షణ కవచంగా ధర్మాన్నే మెప్పించావు  || బహుజన || 

Thursday, May 4, 2017

బహుజన రూపం బహుజన భావం

బహుజన రూపం బహుజన భావం
బహుజన సైన్యం బహుజన తత్వం
బహుజన గమనం బహుజన వచనం
భళారే భళా బహువీర సంగ్రామ దళం  || బహుజన ||

బహుజన జీవం బహుజన ప్రాణం
బహుజన దేహం బహుజన కార్యం
బహుజన లోకం బహుజన విశ్వం
భళారే భళా బహుధీర రణ రంగం  || బహుజన ||

బహుజన బంధం బహుజన సంఘం
బహుజన నేత్రం బహుజన దర్పణం
బహుజన చిత్రం బహుజన ప్రదేశం
భళారే భళా బహుకర భోగమే భాగ్యం  || బహుజన ||

బహుజన స్నేహం బహుజన స్థైర్యం
బహుజన రాజ్యం బహుజన శిఖరం
బహుజన శాంతం బహుజన కుశలం
భళారే భళా బహుపరా మనదే విజయం  || బహుజన ||