Showing posts with label అలసట. Show all posts
Showing posts with label అలసట. Show all posts

Monday, November 21, 2016

ఎందరో ప్రయాణం ఎక్కడికో ప్రయాణం

ఎందరో ప్రయాణం ఎక్కడికో ఆగలేని ప్రయాణం
ఎప్పటి నుండి ఎప్పటి వరకో తెలియని ప్రయాణం
ఎవరు ఎవరిని కలిసెదరో ఎవరు ఎవరిని చూసెదరో
ఎవరికి ఎవరు తెలియనివారు ప్రయాణంలో ఎందరో
ఎంతో అలసట ఎంతో ప్రయాస ప్రతిరోజు ప్రయాణం
ప్రతి క్షణం ఏదో చేయాలని కాలంతో ఎంతో ప్రయాణం  || ఎందరో ||

ప్రయాణంతో సాగే ప్రతి జీవి చలనం ఆహారం కోసమే
ప్రయాణంతో సాగే ప్రతి మనిషి జ్ఞానం విజ్ఞానం కోసమే

ప్రయాణంతో పరిచయాలు బంధాలు ఎన్నో కలిసేనే
ప్రయాణంతో ఎన్నో దేశ విదేశాలు ఒకటై పోవునేమో

ప్రయాణమే జీవితం ప్రయాణంతోనే జీవనం
ప్రయాణమే జ్ఞానం ప్రయాణంతోనే విజ్ఞానం   || ఎందరో ||

ప్రయాణం తెలిపే అనుభవాలే భవిష్యత్ కు ఎన్నో మార్గాలు
ప్రయాణం చూపే ఎన్నో విధానాలే రేపటికి ఎన్నో మార్పులు

ప్రయాణంలో సరికొత్త భాష సరికొత్త జీవితాల సాంప్రదాయం
ప్రయాణంలో సరికొత్త ధ్యాస సరికొత్త పదాల జీవన నిర్వచనం

ప్రయాణమే ప్రయత్నమైతే ప్రతిఫలమే విజయం
ప్రయాణమే పరిశోధనైతే అభివృద్ధే మహా విజయం  || ఎందరో ||