Showing posts with label భావము. Show all posts
Showing posts with label భావము. Show all posts

Monday, December 5, 2016

భావానికే బంధమై తత్వానికే రూపమై

భావానికే బంధమై తత్వానికే రూపమై
విశ్వానికే జీవమై జగతికే ధ్యానమై
సూర్యుని తేజముతో దేహమై ఆకాశ వర్ణముతో జీవిస్తున్నానులే  || భావానికే ||

నా ప్రతి రూపము ప్రతి బింభము సముద్రమై కనిపిస్తున్నదే
నా ప్రతి భావము ప్రతి తత్వము సరస్సుగా ప్రవహిస్తున్నదే
నా ప్రతి జీవము ప్రతి దేహము సెలయేరులా ధ్వనిస్తున్నదే
నా ప్రతి తేజము ప్రతి వర్ణము సెలధారజలగా జ్వలిస్తున్నదే  || భావానికే ||

నాలోని భావానికే నాలోని తత్వానికే ప్రతి అణువు జీవిస్తున్నదే
నాలోని జీవానికే నాలోని శ్వాసకే ప్రతి అణువు స్పందిస్తున్నదే
నాలోని దేహానికే నాలోని తేజానికే ప్రతి అణువు కనిపిస్తున్నదే
నాలోని సుగంధానికే నాలోని సువర్ణానికే ప్రతి అణువు మెరుస్తున్నదే  || భావానికే ||