Showing posts with label పితృదేవోభవ. Show all posts
Showing posts with label పితృదేవోభవ. Show all posts

Friday, September 2, 2016

మాతృదేవోభవ

మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్యదేవోభవ
అతిథిదేవోభవ
మహాత్మదేవోభవ   || మాతృదేవోభవ ||

కల్యాణంతో జీవితం శుభోదయం జీవనమే నవోదయం
ముహూర్తమే శోభనం కలసిన వేళయే మహా శుభ దినం
శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు
ఆశీర్వాదాలతో తలంబ్రాలు కురిపించే మహోదయం
సర్వం మంగళం శాంతం ప్రశాంతం శాంతి శాంతి శాంతిః   || మాతృదేవోభవ ||

జత కలిసే ఇరు బంధాల జీవితమే ఉదయించే శుభోదయం
మనస్సులు కలిసే ప్రాణుల జీవనమే చిగురించే నవోదయం
జగమంతా ఎన్నో బంధాలతో సాగే అనురాగాల మమకారం
విశ్వమంతా ఎన్నెన్నో మహా జీవితాలతో సాగే మమతానురాగం
మనమంతా కలిసి మెలసి సాగిపోవడమే కాలం తెలిపిన వైనం   || మాతృదేవోభవ ||