Showing posts with label భావోదయం. Show all posts
Showing posts with label భావోదయం. Show all posts

Wednesday, August 23, 2017

ఏనాటిదో సూర్యోదయం జగతికే పూజ్యోదయం

ఏనాటిదో సూర్యోదయం జగతికే పూజ్యోదయం
ఎప్పటిదో సర్వోదయం విశ్వతికే పూర్ణోదయం
ఎంతటిదో స్వర్ణోదయం జనతికే పూర్వోదయం   || ఏనాటిదో ||

ఏనాటివరకో తెలియని ఉదయం అస్తమిస్తున్నా మరో సమయం ఉదయం
ఎప్పటివరకో తెలియని గమనం నిద్రిస్తున్నా మెళకువతో జ్ఞాపకాల గమనం
ఎంతవరకో తెలియని మననం మర్పిస్తున్నా కార్యాలతో ఆలోచనల మననం  || ఏనాటిదో ||

ఏనాటివరకో తేజోదయం ఏమని ప్రకాశించేనో మహోదయం
ఎప్పటివరకో నవోదయం ఎంతని ధ్వనించేనో భావోదయం
ఎంతటివరకో వర్ణోదయం ఏదని విస్తరించేనో సర్వోదయం   || ఏనాటిదో ||