Showing posts with label ఓర్పు. Show all posts
Showing posts with label ఓర్పు. Show all posts

Wednesday, August 31, 2016

కలే కన్నానని మెలకువ తెలిపేనే

కలే కన్నానని మెలకువ తెలిపేనే
నిజమే కాదని ఉదయంతో తోచేనే
ఎన్నెన్నో కలలు కంటూనే నిద్రిస్తున్నానులే
కలలన్నీ కలలుగానే మిగిలి పోతున్నాయిలే  || కలే కన్నానని ||

కలే నిజమౌతున్నదని మరో ఊహ కలగా సాగుతున్నదిలే
కలే జీవితమని ఊహలతోనే కాలం మరుపుతో సాగేనులే

కల నిజం కాదని తెలిసినా ఊహతో ప్రయత్నమే మొదలాయనే
కల సాధ్యం కాదని తెలిసినా ఓర్పుతో సాధన ఆరంభమయ్యేనే

కలను అందుకోవాలని మనస్సులో కోరిక పుట్టేనే
కలను జయించాలని మేధస్సులో ఆలోచన తట్టేనే  || కలే కన్నానని ||

కలే నిజమౌతున్న వేళ మదిలో సంతోషమే కలిగేనే
కలే నిజమౌతున్న వేళ యదలో ఆనందమే ఉప్పొంగేనే

అన్నీ కలలు తీరవు అన్నీ కలలు మనకు గుర్తుగా ఉండవు
అన్నీ కలలు మంచివి కావు అన్నీ కలలు ఒకటిగా ఉండవు

ఆలోచిస్తేనే భావంతో కల ఎటువంటిదో తెలిసేను  
ఊహతో నెమరువేస్తేనే కల ఏమని అర్థమయ్యేను  || కలే కన్నానని || 

Thursday, July 21, 2016

ప్రతిరోజు నేర్పుతో నేర్చుకో విజ్ఞానమే తెలుసుకో

ప్రతిరోజు నేర్పుతో నేర్చుకో విజ్ఞానమే తెలుసుకో
ప్రతిరోజు ఓర్పుతో చూసుకో అనుభవమే తెలుపుకో   || ప్రతిరోజు ||

ప్రతి క్షణం ఒక ఆలోచన గమనమే
ప్రతి నిమిషం ఒక విజ్ఞాన భరితమే
ప్రతి గడియ ఒక అనుభవ చరితమే
ప్రతి సమయం ఒక వేదాంత వచనమే  

కాలమే కలిగించేను సమస్యలను ఎన్నో విధాల ఎన్నో వైపులా
అనుభవమే సాగించును పరిస్కార మార్గాలను నలు దిక్కులా   || ప్రతిరోజు ||

ప్రతి క్షణం ఆలోచించుటలోనే ముఖ్యాంశం
ప్రతి నిమిషం స్మరించుటలోనే మహా జ్ఞాపకం
ప్రతి గడియ అన్వేషించుటలోనే వేదాంతం
ప్రతి సమయం చదువుటలోనే పరమార్థం

కాలంతో సాగే విజ్ఞానంతోనే మనలో సమస్యలు పరిష్కారమవుతుంటాయి
సమయంతో సమన్వయ సమయోచితమైతే పరిష్కారాలు సకాలమవుతాయి  || ప్రతిరోజు || 

Monday, May 23, 2016

ఎంత ఎదిగినా సామర్థ్యం అవసరం

ఎంత ఎదిగినా సామర్థ్యం అవసరం
ఎంత ఒదిగినా ఓర్పుగా ఉండడం
ఎంత నేర్చినా వినయంతో అడగడం
ఎంత తెలిసినా నిలకడగా చెప్పడం