Showing posts with label పాఠం. Show all posts
Showing posts with label పాఠం. Show all posts

Thursday, August 31, 2017

ప్రియం శుభం పాఠం

ప్రియం శుభం పాఠం
ప్రియం దైవం పత్రం
ప్రియం కాలం పాదం
ప్రియం గీతం ప్రేమం
ప్రియం దేహం పూర్ణం
ప్రియం భావం ప్రాణం
ప్రియం జీవం పూజ్యం
ప్రియం మౌనం ప్రశ్నం
ప్రియం మోహం ప్రియం
ప్రియం స్నేహం పుష్పం
ప్రియం తత్వం ప్రాయం

Tuesday, March 21, 2017

ప్రేమ తెలిసేనా మనస్సు తెలిపేనా

ప్రేమ తెలిసేనా మనస్సు తెలిపేనా
వయస్సుకే తోచేనా మేధస్సుకే కలిగేనా
ఆలోచనల అర్థాన్ని అనుభవం నేర్పేనా
కాలంతో సాగే ప్రేమ ప్రయాణం జీవితమేనా
ప్రియతమా ... మధురిమా ... నీవే నాలో మౌనమా ... !   || ప్రేమ ||

జరిగిన అనుభవం కాలమే తెలిపిన గుణ పాఠం
జరిగే వేడుక మనకు లేదని తెలిసిన గుణ భావం

ప్రేమయే పెళ్లిగా సాగిన కథనం మనకే తెలియని విషయం
మరోకరితో నడిచిన కాలం మనకు తెలిసిన నూతన జీవితం

ప్రేమ భావం స్నేహంతో సాగే జీవితం
పెళ్లి బంధం మనస్సుతో కలిసే జీవనం   || ప్రేమ ||

పెళ్లితో సాగే బంధం మనకు కలగని అనుబంధం
పెళ్లితో స్నేహం దూరమై మనం కలవని సంబంధం

స్నేహమే ప్రేమగా మారినా పెళ్లిగా మారని అనురాగం
స్నేహమే బంధమై ప్రేమగా పెళ్లితో లేనిదే అనుభవం

ప్రేమకు అర్థం పెళ్లితో పరమార్థం
స్నేహానికి అర్థం బంధంతో సౌఖ్యం   || ప్రేమ || 

Wednesday, May 25, 2016

అక్షరాన్ని వదులుకోను

అక్షరాన్ని వదులుకోను
పదాన్ని మరచిపోను
వాక్యాన్ని విడిచిపోను
వాక్య సముదాయాన్ని తప్పుకోను
పాఠాన్ని  మార్చుకోను
పుస్తకాన్ని అమ్ముకోను
గ్రంథాన్ని ఇచ్చుకోను