Showing posts with label దర్శనం. Show all posts
Showing posts with label దర్శనం. Show all posts

Wednesday, July 5, 2017

పురుషోత్తమా ...! పలకవా నీ పలుకులను వినిపించవా

పురుషోత్తమా ...!  పలకవా నీ పలుకులను వినిపించవా
ఏమని పిలిచినా ఎలా పలికినా మనస్సును తపించవా   || పురుషోత్తమా ||

నిత్యం ఉదయం సత్యం సమయం ఎదురుగా నిలిచే స్వరూపం నీదే
ధర్మం వేదం దైవం దేహం ఒకటిగా ఒక్కటై కలిగే భావం బంధం నీదే

రూపముతోనే కాలం సాగినా కార్యములో ఉత్తేజము నీవే కలిగించెదవు
భావంతోనే సమయం మీరినా సమస్యలో పరమార్థం నీవే తెలిపెదవు   || పురుషోత్తమా ||

భక్తులకు నీ పిలుపులతోనే మహానంద దివ్య దర్శనం కలిగించవా
సాధువులకు నీ పలుకులతోనే పరమానంద స్వరూపం చూపించవా

మహాత్ములకు నీలో వెలిగే తేజం నిత్యానందమని వర్ణించవా
మహర్షులకు నీలో కలిగే తత్వం ఆత్మానందమని వివరించవా   || పురుషోత్తమా || 

Tuesday, August 16, 2016

ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో తెలియని నీ రూపం నాలో చిత్రమై ఉన్నది

ఎక్కడ ఉన్నావో ఎలా ఉన్నావో తెలియని నీ రూపం నాలో చిత్రమై ఉన్నది
ఎప్పుడు వస్తావో ఎలా వస్తావో తెలుపని నీ సమయం నాలో అన్వేషణ ఐనది  || ఎక్కడ ||

ఎవరికి కనిపిస్తావో ఎవరికి వినిపిస్తావో నీలో నీవే ఉండిపోతావో తెలియుట లేదు
ఎవరిలో ఉన్నావో ఎందరిలో ఉన్నావో నీవే నిర్ణయించుకుంటావో తోచటం లేదు

మహా విజ్ఞానులు ఎందరున్నా నీవు ఉండే స్థానం మహా నిలయం
మహాత్ములు ఎక్కడ ఉన్నా నీవు తెలిపే వేదార్థం మహా విజ్ఞానం   || ఎక్కడ ||

కనిపించే నీ రూపం సూర్యోదయమై విశ్వానికి వెలుగునిస్తున్నది
వినిపించే నీ ప్రతి ధ్వని జీవోదయమై దేహానికి మహా ప్రాణమైనది

ఎవరిని తలిచినా నీ నామ ధ్యాన స్వరూపంలోనే మహత్యం దాగున్నది
ఎందరినో దర్శించినా నీ రూప దర్శనం కలగాలని నేత్రం తపిస్తున్నది || ఎక్కడ || 

Wednesday, June 15, 2016

ఆకాశం సృష్టికి నిలయం

ఆకాశం సృష్టికి నిలయం
ఆకాశం జగతికి సంపూర్ణం
ఆకాశం లోకానికి మందిరం
ఆకాశం మేధస్సుకే ఉత్తేజం
ఆకాశం విశ్వానికి సంయోగం
ఆకాశం మేఘానికి రూప వర్ణం
ఆకాశం సూర్యునికి మహా తేజం
ఆకాశం కిరణానికి దివ్య దర్శనం
ఆకాశం ఇంద్రధనస్సుకే పదిలం

Wednesday, September 9, 2015

దేవా.. దర్శనమియ్యవా! దేహాన్ని అర్పిస్తున్నా

దేవా.. దర్శనమియ్యవా!  దేహాన్ని అర్పిస్తున్నా
దయ చూపవా నీ దర్శన భావాన్ని కలిగించవా
కరుణామృతంతో నాకు మోక్షాన్ని ప్రసాదించవా
జీవితమంతా నీ సేవకై ధార పోసినను కరుణించవా
దేహమే చాలిస్తున్నను దైవత్వాన్ని చూపించవా
ఆత్మగా మిగిలిపోయినను పరమాత్మలో కలిపెదవా
ఆశగా లేకున్నను నా ఆశయాన్ని నెరవేర్చదవా
నేనుగా నా దేహాన్ని ఆకాశంగా మార్చేస్తున్నా చూసేదవా
పంచ భూతములయందు నేనే విశ్వమైనానని తెలిపెదవా
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!