Showing posts with label పర్యవేక్షణ. Show all posts
Showing posts with label పర్యవేక్షణ. Show all posts

Thursday, September 8, 2016

విశ్వంలో ఏమున్నదో జగమంతా ఏమి దాగున్నదో

విశ్వంలో ఏమున్నదో జగమంతా ఏమి దాగున్నదో
అన్వేషణతో సాగే మేధస్సుకు ఏదో రహస్యం తెలియాలి
ఆలోచనలలో విజ్ఞానం అనుభవమై కాలంతో సాగిపోవాలి  || విశ్వంలో ||

తెలిసే వరకు ప్రయోగం చేయాలి అర్థం అయ్యేవరకు పరిశోధన సాగాలి
ఏది ఏమిటో ఎందుకో గ్రహించాకే పర్యవేక్షణతో తీర్పు ఏదో ఇచ్చేయాలి

అద్భుతాలను తిలకిస్తూనే ఆశ్చర్యాన్ని అవగాహనతో పసిగట్టాలి
నిర్మాణాల విధానాలనే గమనిస్తూ మహా మూలాన్ని గ్రహించాలి   || విశ్వంలో ||

ప్రకృతియే మన వైద్యశాల పరిశోధన చేస్తే రహస్యం మన చెంత
విశ్వమే మన వేద కళాశాల పరిశీలిస్తే మహా పరమార్థం మన వెంట

ప్రయాణిస్తూనే అన్నింటిని గ్రహించాలి అనంతమైన  ఆలోచనలతో ఎన్నో తెలుసుకోవాలి
కాలంతో సాగుతూనే ఆరోగ్యం చూసుకోవాలి ఆయుస్సుతోనే మన విజ్ఞానానికి పదును పెట్టాలి  || విశ్వంలో ||

Wednesday, June 8, 2016

ఓ బాటసారి .....

ఓ బాటసారి .....
నీవు సాగే ప్రయాణంలోనే ప్రతి ఒక్కరు ప్రయాణాన్ని సాగించెదరు
నీవు జన్మించిన రహదారిలోనే మరణించే మార్గం ఉందని తెలిపారు
మరణమే గమ్యమని తెలిసినా నీ దారిలోనే ఎందరో శ్రమించెదరు     || ఓ బాటసారి ..... ||

ప్రయాణంతో సాగే శ్వాసకు అలసట లేదా హృదయానికి విశ్రాంతి లేదా
మేధస్సుకే లేని నిలకడతో సాగే ప్రయాణం మన జీవన జీవిత మార్గమే

నిలిచిపోయే మార్గ స్థానమే మరణమని మౌనం తెలిపిందా నీలో
అలసిపోయే దారి జాడయే నిలకడ లేని ప్రయాణమని తోచిందా నీలో

నీలో కలిగే భావాలన్నీ మార్గాన్ని చూపే అడుగు జాడలే
నీలో సాగే ఆలోచనలు ప్రయాణాన్ని సాగించే మార్గములే   || ఓ బాటసారి ..... ||

ఎంత కాలం శ్రమించినా మన జీవితం ఓ మరణ గమ్యమే
ఎందరో ఉన్నా మన జీవనం కొంత కాలానికి అంతమే

ఎవరు ఏ మార్గాన జీవిస్తారో ఎంత కాలం ఉంటారో తెలియదే
ఎవరికి ఏది తోచినా ఏమని తెలిసినా మన సమయం కొంతే

ఇది మరణమో ప్రయాణమో సాగిపోయే కాల జ్ఞాన అనుభవమో
విజ్ఞానమే తెలుపని పరిశోధన మరణాన్ని చేరుకునే పర్యవేక్షణా || ఓ బాటసారి ..... ||