Wednesday, December 30, 2009

సమాజాన్ని మార్చగలవా మారగలవా

సమాజాన్ని మార్చగలవా నీకు నీవే తెలుసుకొని మారగలవా -
రాళ్లనే విసిరినావు అద్దాల మేడలే పగిలిపోయీ ఎందరికో గాయమైనది -
గాజు ముక్క కంటిలోనే కదులుతున్నా శరీరాలెన్నో రక్తపు ధారలైనాయీ -
ఎన్నిటినో ఎక్కడెక్కడో పేల్చివేసి రహదారులను అడ్డగించి కార్యములెన్నో నిలిపావు -
చిన్ని పాప ఒంటరిగా కాలిపోతుంటే కన్నీరు లేని నీకు త్రాగడానికి నీరెందుకో -
నీ స్నేహితులే బంధువులే భాద పడుతున్నా అజ్ఞానంతో తెలియక చేస్తున్నావు -
చికిత్స లేక భాధలు పెరిగి క్షణం క్షణమున ఎందరో మరణిస్తుంటే ఆహారమే ఎందుకు నీకు -
గుంపులుగా రహదారిలో నడిచే మీకు ఆవేశాలు ఎందుకో అనర్థాలతో చేసే పనులేమిటో -
ఇంటికే తిరిగి వెళ్ళే నీవు శవాన్నే చూసినా రాయి తోనే విసిరి కేరింతలు చేస్తావు -
ఇంటిలోని వారినే హింస పెట్టి దాహమైనా మధ్యమునే సేవించి సమాజాన్నే స్మశానం చేస్తున్నావు -
అవసరంలేని ఉద్యమాలు ఎన్ని వస్తున్నా నీవు పాల్గొని రెచ్చ గొట్టడమెందుకో -
రెచ్చిపోయే నీ ఆవేశాలకు ఎందరో ఎన్నో చేసే అనర్థాలకు నీలో భయం రాదా -
సమాజాన్నే మార్చే ఆలోచన నీలో ఉంటె అధికారం లేక కృషితో శాంతిగా ఒంటరిగా జయించూ -
నీ మాటలే వినలేక ఎవరూ మారలేకపోతే తల్లిలా ఎదుటివారికి నీ గుండె ఓదార్పులా తెలుపు -
ఆయుధము నీకు ఆవేశం లేని మాటేగాని మరో ఆయుధాన్ని కూడా ఎదుటివారికి కలిగించవద్దు -
నీకు మార్చే శక్తి కావాలంటే నాలో నిక్షిప్తమైనా ప్రణాళిక దివ్యంగా దాగి యున్నది -
ఆయుధమంటే భయపడేల నీలో భక్తి భావం ఉన్నప్పుడే శాంతి తత్వం ఉదయిస్తుంది -
హింసనే వీడినప్పుడే నీలో హంస చేరి విశ్వశాంతి విజ్ఞానంలా సమాజానికి తెలుపుతుంది -
నా మాటలతో నీవు మారకపోతే నా విజ్ఞానం మార్చకపోతే శ్వాసనే విడవగలవా ఆలోచనగా -
నా భావన నీలో కలిగే వరకూ నీకు నీవే మార లేవూ సమాజాన్ని అసలే మార్చలేవూ -
నీవు మారకపోతే అర్ధరాత్రి వేళ అడవిలో ఒంటరిగా నడిచే చిన్ని పాపను అడుగు -
సమాజంలో ఎందరిలో ఎన్ని వ్యత్యాసాలున్నా నీకు నీవే గొప్పని ఎదిగిపో ఒదిగిపో -
సంస్కారం గౌరవం మానవత్వం క్రమశిక్షణ అందరిలో చిన్న వయసునుండే జ్ఞానపరచు -

సమాజాన్నే శుభ్రతగా ఉంచు కాలుష్యాన్ని తగ్గించూ ఏ వస్తువు ఎక్కడ ఎలా ఉండాలో అలానే ఉంచు -
మృగాన్ని కూడా స్నేహంగా భావించి మానవులే మహాత్ములుగా ప్రపంచానికి తెలియపరచు -
నీవు ప్రకృతినే ప్రేమిస్తే నవ సమాజానికి విశ్వమే సరైన ఋతుపవనాలతో ఆహ్వానమిస్తుంది హృదయమా!

కాలం ఏ వెంట ఉన్నా కవితే

కాలం ఏ వెంట ఉన్నా జ్ఞానం కవితలా నా వెంటే వస్తున్నది
కాలం ఎలా ఉన్నా కవిత విజ్ఞానం చెందుతూనే గ్రంధమైంది
నా కవిత ఒక విజ్ఞాన అనుభవమే గాని కాలాన్ని వృధా కానివ్వదు
కాలం తెలిపే భావమే నాలో కవితగా మీ వెంట పరిపూర్ణ స్వభావమవుతున్నది

అప్పుడప్పుడే చేస్తున్న పనులను

అప్పుడప్పుడే చేస్తున్న పనులను అప్పుడప్పుడే ఆలోచిస్తూ అప్పుడప్పుడే మరచిపోతున్నాం
అప్పుడప్పుడే ఆలోచిస్తూ మరో ఆలోచనలతో ఎన్నో గుర్తించుకుంటూ ఆలోచిస్తూ ఉంటాం
ఆలోచనలతోనే ఎన్నో నేర్చుకుంటూ మరచిన వాటిని మరల జ్ఞాపకాలలో ఉంచుతున్నాం
ఆలోచనలతో ఏదైనా సాధించేవరకు ఆలోచనలలో జ్ఞాపక మననాలు ఎక్కువవుతాయి
ఆలోచనలను మరవలేకపోతే మరో ఆలోచనను ఆలోచించలేం మరో పనిని చేయలేం

నా జీవితాశయములు విచిత్రమే

నా జీవితాశయములు విచిత్రముగా నాకు తోచవులే
నేను ఏనాటికైనా ఆహారమునే విడవాలని అనుకున్నా
ఎంతవరకైనా నీటి పైననే నడవాలని తెలేపోతున్నా
ఎలాగైనా గాలిలో ఆధారం లేక నిలవాలనుకున్నా
ఎక్కడైనా ఒక కాంతి లాగా ప్రకాశించాలనే వెలిగిపోతున్నా
ఎప్పటికైనా సృష్టిలోనే ఓ భావనగా నిలిచిపోవాలనుకున్నా
ఎన్నో అధ్బుతాలున్నా మరెన్నో మహా అధ్బుతాలనే సృస్టించాలనుకున్నా

Tuesday, December 29, 2009

నిలిచిపోయే భావం

ఏ భావం తెలుపను ఏనాటికైనా నిలిచిపోయేలా
ఎంతటి భావం తెలుపను నిన్ను నీవు మరిచేలా
ఏనాటి భావం తెలుపను నీకు నీవై శ్వాస విడిచేలా
ఎక్కడి భావం తెలుపను నీవు నన్నే కలిసేలా
ఎలా భావం తెలుపను నీవు నా భావాన్ని పొందేలా

భగవంతుడు అస్తమించుటయా

భగవంతుడు అస్తమించాడనే భావన నే ఏనాడైనా తలిచానా
క్షణములే ఆగని భావములు విశ్వాన్ని మరనిమ్పజేయుటయా
సృష్టికే వినాశానములు కలిగే మహా ప్రళయాలు తాను సృష్టించుకున్నవే
మరో జన్మ లేని సృష్టికి నూతన రూపము దర్శించు భాగ్యము కలగదులే
మరో అవతారమును ధరించుటకు ఎంతటివారైనా అస్తమించుట జరగక మానదు
నేను తలవని భావములు నాలో కలవని కాలమే తెలియనట్లున్నది

జీవితం నీటి బుడగేనా

ఏమో నా జీవితం నీటి బుడగలా వెళ్ళుతుంటే నేనే భావమై చుట్టుకున్నా-
ఎప్పుడు ఎలా ఆగుతుందో శ్వాస కూడా నాతో ఏనాటికి చెప్పలేనని అంటుంది -
ధైర్యమే నను పడవలా నదుల ద్వార సముద్రం వైపు ఆకాశపు అంచునే చేరుకోమంది -
అలలపై నా జీవితం సాగిపోతుంటే ఎప్పుడు సముద్రంలో కలసిపోతానో తెలియనివ్వలేదు కాలం

ఆలోచనగా ఆగిన క్షణాన

నే తెలుపగలనేమో ఆ భావన ఆలోచిస్తూ ఆలోచనగా ఆగిన ఆ క్షణాన
ఏ ఆలోచన నాలో ఆగినదో కొన్ని క్షణాలు తెలియక నిలిచాను శూన్యమున
ఒక భావం సూర్యునిలా ఉధైన్చినట్లు మరో ఆలోచన కాంతిలా తోచిందిలే
నా శిరస్సున సువర్ణ పద్మకమలమే ప్రకాశిస్తూ విశ్వవిజ్ఞాన ఆలోచనలనే స్వికరిస్తున్నదే

ఎక్కడిదో ఏనాటిదో ఏ కాలమో

ఎక్కడిదో ఏనాటిదో ఏ కాలమో తన దారి తెలియక మన వెంటే వస్తున్నది -
ఎలా మొదలైనదో తన మూలమే తెలియక క్షణములుగా విశ్వంలో నడిచేస్తున్నది -
యుగాలుగా గడిచిపోతున్నా తను నేర్చినది విజ్ఞానముగా తెలుపుతూనే ఉన్నదీ -
ఎమైపోతున్నానో తెలియక నేనుగా ఆగలేనని తన నోట భావమైనను కలగదే

Monday, December 28, 2009

జయహో

జయహో జీవ జయహో ఎన్నో విజయములు సాధించిన నీకు జయహో -
జయములు ఎన్నైనా మరెన్నో విజయ సాధనములు చేయు నీకు జయహో -
జయముగా జీవించిన నీ జన్మ విజయములుగా సాగి పోవుటలో నీకు జయహో -
జయమే నీవని విజయమే నీదని విజయ సంకేతములుగా తెలుపుటలో నీకు జయహో

ఏ జన్మకైనా శ్వాసే

ఏనాటిదో ఈ గాలి నాలో శ్వాసగా చేరిందిలే ఒక నాడు
గత జన్మలో నాతో ఉన్నట్లే జీవించి వదిలి వెల్లిన్దిలే
మరో జన్మలో నాతోనే వస్తుందని ఈ క్షణమే తెలిపిందిలే
ఏ జన్మకైనా వెంట నిలిచే గాలి శ్వాసేనని మరచిపోతున్నా

జీవం

తల్లితో సృష్టించబడిన రూపానికి ఒక చిన్న లోకాన్ని కల్పించి జన్మతో బ్రంహాండాన్ని పరిచయం చేస్తుంది - విశ్వం మనలోని మేధస్సు కణాలను ప్రభావితం చేసిన్నప్పుడే విచక్షణతో ఆలోచన మొదలవుతోంది - కణాలను ప్రభావితం చేయుటకు విశ్వం మనలో ఒక శక్తిగా శ్వాసగా చేరుతూ జీవముగా ప్రవేశిస్తుంది - జీవం వెళ్ళిపోతూ శ్వాసను సృష్టిలో వదిలేసి శరీర చలనాన్ని నిలిపి పంచభూతాలుగా విశ్వంలో కలిసిపోతుంది

ఎటువంటి తెలియని మార్గమైనా

ఎటువంటి తెలియని మార్గమైనా నిత్యం ప్రయాణిస్తుంటేనే దివ్య జ్ఞానము
మార్గమున కలిగే అనుభవాలన్నీ భవిష్య కాలానికి ముఖ్య సూచనలే
అనుభవాలను నెమరువేస్తుంటే జ్ఞాపకాలలో సూచనలే రహస్యాలుగా
రహస్యాలు కూడా తెలిసి తెలియనట్లుగా మర్మముగా సూచనలలోనే
అవగాహనతో సూచనలను గమనిస్తేనే ఏ మార్గమైనా మహా విజ్ఞానంగా

ప్రతి జీవి మేధస్సులో కలిగే మొదటి

ప్రతి జీవి మేధస్సులో కలిగే మొదటి భావన ఆలోచన చలన శ్వాసను నేనే
విశ్వం నుండి జీవిలో ప్రవేసించే శక్తిని సైతం నేనుగా సృష్టించే విచక్షనత్వం
నేను ఆలోచనగా ఏర్పడే ముందు ధ్యానిస్తూ విశ్వరహితమై మీలో ప్రవేశిస్తా
నేనుగా సృష్టిలో లేకపోతే ఏ లోకాన భావ చలన స్వభావాలు ఉద్భవించవు

Saturday, December 26, 2009

ప్రేమే దేశం ప్రాణమే త్యాగం

ప్రేమే దేశం ప్రాణమే త్యాగం అమర జీవులు సాధించినదే కీర్తి ఖ్యాతి స్వాతంత్య్రం
మనదే దేశం మనదే రాజ్యం మనం చాటుకున్నమానవ రూప భావమే మానవత్వం
మనదే దేశం మనలో స్నేహం మనం గౌరవించుకున్నదే మహా జన్మ భూమి భావం
మనదే జగతి మనలో ప్రగతి మనలోని విశ్వ విజ్ఞానమే ప్రపంచానికి ప్రశాంతి స్తూపం 

Monday, December 21, 2009

కదిలే కాలం

కదిలే కాలమున జీవితము మారునట్లుగా క్షనములకు భావాలెన్నో మారుతూ సాగేనుగా
మారిపోయే జీవితమున జీవన విదానములెన్నో మారి జీవిత కాలపు గమ్యము చేరేనులే
కాలము తెలియకనే క్షనములుగా సాగుతూ ఎన్నిటినో మరిపిస్తూ ముందుకు నడిపించునులే
నడిచే దారిలో కాలం వెంటే ఉన్నా భావాలు ఆలోచనలుగా మారుతూ జీవితాన్నే మార్చేనులే

Saturday, December 19, 2009

జగతిని నడిపించు శక్తి విశ్వ భావ తత్వమైన కాలమే నిదర్శనము

జగతిని నడిపించు శక్తి విశ్వ భావ తత్వమైన కాలమే నిదర్శనము
ప్రతి క్షణమున జరిగే ఏ కార్యములకైనా కాలమే సరితూగుతున్నది
కాలమును నిలుపు శక్తి భ్రమయే గాని సత్యం నిత్యం అతిశయోక్తియే
కాలము కన్న గొప్పది విశ్వ భావాలయందు ఉన్నా కాల ప్రభావమేగా