Showing posts with label ఉద్భవోత్సవం. Show all posts
Showing posts with label ఉద్భవోత్సవం. Show all posts

Wednesday, January 11, 2017

ఎవరో రావాలి ఎందరో చూడాలి తిరుమల గిరి శ్రీనివాసుని బ్రంహోత్సవం

ఎవరో రావాలి ఎందరో చూడాలి తిరుమల గిరి శ్రీనివాసుని బ్రంహోత్సవం
ఎవరో రావాలి ఎందరో లాగాలి బ్రంహాండ నాయకుని మహోత్తర రథోత్సవం
ఎవరో రావాలి ఎందరో నడవాలి మహా దేవుని పల్లకితో సాగే శుభ దేవోత్సవం  || ఎవరో రావాలి ||

తరతరాలుగా యుగయుగాలుగా ఆచారంతో వస్తున్నదే ఆనాటి మహా నాయకుని ఉత్సవం
వసంతాలుగా ఋతువులుగా ఎన్నో సంవత్సరాలతో వస్తున్నదే మహా దేవుని వసంతోత్సవం

వేదాల శ్లోకాలతో వేదాంత పండితులతో అవధాన విజ్ఞానులతో సాగే దేవ దేవుని మహోత్సవం
సుప్రభాతాల సంగీతాలతో సప్త స్వరాలతో ఓంకార నాదంతో సాగే విశ్వ నాయకుని స్వరోత్సవం

బ్రంహ విష్ణు మహేశ్వరుల స్వహస్తాలతో సాగే అరుదైన కనివిని ఎరుగని ఆనంద భరితమైన రథోత్సవం
మహా భక్తుల ప్రజలతో నిత్యం సత్యాన్ని పాటించే పవిత్రతలతో దైవ భక్తి శ్రద్దలతో సాగే మనోహరోత్సవం  || ఎవరో రావాలి ||

జగమంతా మహా భక్తులతో జన సమూహంతో కలిసే తిరుమల గిరి ప్రాంగణంలో జరిగే విశిష్టమైన వైభవోత్సవం
విశ్వమంతా మహా ధ్వనులతో మోహన శృంగార పుష్పాల అలంకారాలతో ఇరువైపులా దర్శించే పల్లకీతోత్సవం

సప్తగిరిపై వెలసిన శ్రీనివాసుని ఉజ్వల ప్రజ్వల దివ్య కాంతుల విగ్రహ దర్శనంతో సాగే మహోజ్వలోత్సవం
పరిశుద్ధ పరిపూర్ణ పవిత్రతలతో పర బ్రంహ స్వరూపుని ప్రత్యక్ష దైవంతో సాగే మహానాథుని పరిపూర్ణోత్సవం

పరంధామగా అవతరించిన అనంత మూర్తి ఆది స్వయంభువ పురుషోత్తముని మహా దివ్య దర్శనోత్సవం
పరమాత్మగా అంతర్భవించిన ఆత్మ పరంజ్యోతి అద్వైత్వ పూర్వ పర బ్రంహుని మహాజన ఉద్భవోత్సవం   || ఎవరో రావాలి ||