Showing posts with label దీపిక. Show all posts
Showing posts with label దీపిక. Show all posts

Tuesday, July 19, 2016

సూర్యుడే భగవంతుడై జగమంతా ఉదయించేను

సూర్యుడే భగవంతుడై జగమంతా ఉదయించేను
ఆకాశమే పరమాత్మగా విశ్వమంతా అవతరించేను
ప్రకృతియే మహాత్మగా భువిలోనే పరవశించేను    || సూర్యుడే ||

ఉదయించుటలోనే భగవంతుడు ప్రజ్వలమై అవతరించేను
ఆకాశం ఒదిగిన లక్షణములోనే పరమాత్మ నిలిచిపోయేను
ప్రకృతి ఎదిగే విధానంలోనే మహాత్మ తత్వం వికసించేను

ఉదయిస్తూనే కిరణాల తేజస్సుతో ప్రపంచాన్ని మేలుకొలిపేను
ఆకాశమంతా వెలుగుతూ మేఘ వర్ణంతో ఉత్తేజాన్ని కలిగించేను
ప్రకృతిలో జీవిస్తూనే ఆరోగ్యమైన వాతావరణాన్ని ప్రసాదించేను

సూర్యుని మహోదయమే సృష్టికి జీవులకు మహా తత్వ విచక్షణ విజ్ఞానము
ఆకాశ వర్ణ భావమే జీవుల మేధస్సులకు మహా ధ్యేయ లక్షణ కార్య కర్తవ్యము  
ప్రకృతి సహజత్వమే జీవుల భావ తత్వాలకు జీవన కార్య విజ్ఞాన గమనము    || సూర్యుడే ||

ఉదయం ఏనాటికి మారని దిన చర్యగా భగవంతుని కార్యం సాగేను
ఆకాశం చెదరని పొరగా మేఘాలతో పర తత్వమై నిలయమయ్యేను
ప్రకృతి ఒదిగిపోతూనే తన్మయంతో ఎదుగుతూ విశ్వ తత్వమయ్యేను

ఉదయంతో సాగే జీవుల కార్యాలు విశ్వ విజ్ఞానానికే మహోజ్వల ప్రతిభ
ఆకాశం తెలిపే మేఘ వర్ణాల భావ రూపాలకు ఊహా చిత్రమే నవ జ్ఞాపిక
సృష్టిలో ఉన్న సహజ వనరుల రూపాలే అవసరాలకు నిలయమైన దీపిక

ఉదయించుట జగతికి గ్రహ స్థితికి మహోదయ భ్రమణ గమన చలనము
ఆకాశం మేఘాలకు నిలయమైన మహా గుణమైన తేలికతో కూడిన పొరయే
ప్రకృతి జీవించే జీవులకై ఎదిగే హరితమైన ప్రాణాహార వనరుల కుటీరత్వము || సూర్యుడే ||