Showing posts with label శిల్పం. Show all posts
Showing posts with label శిల్పం. Show all posts

Monday, August 21, 2017

భావమా అపురూపమా బంధమా అనురాగమా

భావమా అపురూపమా బంధమా అనురాగమా
రూపమా అనుబంధమా వర్ణమా అతిశయమా

జీవులకే స్వభావమా మేధస్సులకే మోహమా
వేదాలకే సువర్ణమా బంధాలకే స్వరూపమా   || భావమా ||

ఎవరో మలచిన శిల్పం ఎవరో తిలకించిన వర్ణం
ఎందరో దాల్చిన వర్ణం ఎందరో వర్ణించిన శిల్పం

ఎవరికో కలిగిన స్వప్నం ఎవరో మలచిన రూపం
ఎవరికో తెలిసిన భావం ఎవరో వహించిన దేహం  || భావమా ||

ఏమని కలిగిన భావం ఎవరికో తోచిన స్వరూపం
ఏమని తెలిసిన రూపం ఎవరికో కోరిన సుందరం  

ఎంతని వర్ణించిన దేహం ఏదని తపించిన భావం
ఎంతని వహించిన రూపం ఏదని ధరించిన వర్ణం  || భావమా || 

Monday, December 12, 2016

ఏ దివిలో విరిసిన నవ పారిజాతమో ఈ భువిపై వెలిసిన దివ్య సుందరివి నీవే

ఏ దివిలో విరిసిన నవ పారిజాతమో ఈ భువిపై వెలిసిన దివ్య సుందరివి నీవే
నీ దేహంలో వెదజల్లిన సుందరమే నాలో సువర్ణమై సిరి కాంతులే విరజిమ్మేను  || ఏ దివిలో ||

సుగంధ పుష్పంలో మకరందమై తేనీయమే పంచుకోనా
సువర్ణ శిల్పంలో సుందరమై సంతోషాన్నే తిలకించుకోనా

అమృత వర్షిణిలో లీనమై హృదయాన్నే ఇచ్చుకోనా
అదర దరహాసంతో అఖిలమై చందనమే తెలుపుకోనా  || ఏ దివిలో ||

తారల తీరములలో నవరత్నమై నిన్ను దాచుకోనా
అలల తీరములలో అడుగులనై నీతో నడుచుకోనా

మువ్వల సందడిలో ముత్యమునై మురిపించుకోనా
భావాల స్వభావాలతో దేహ బంధానై నిన్నే హత్తుకోనా  || ఏ దివిలో || 

Tuesday, May 31, 2016

ఏనాటి దేవకన్యవో నీవు శిలగా మిగిలిపోయినావు ఈ జగతికి

ఏనాటి దేవకన్యవో నీవు శిలగా మిగిలిపోయినావు ఈ జగతికి
ఏనాటి శిల్పానివో నీవు అపురూపమై నిలిచావు ఈ లోకానికి

సృష్టిలోని అందాలలో నీవే అతి మధురమైనావు ఈ విశ్వానికి
ఆకార రూపాలలో నీవు శృంగార సౌందర్యమైనావు ఈ ద్వీపానికి  || ఏనాటి ||

నీలోని భావాలు నీలోనే మౌనమై శిలగా మారిపోయినాయి
నీలోని పదాలు నీలోనే లీనమై శిల్పంలో దాగి ఉన్నాయి

ఏనాటి సుందర సౌందర్యవతివో నీ చూపులే తెలుపుతున్నాయి
ఏనాటి సుగంధ సరసానివో నీ వయ్యారములే చూపుతున్నాయి

ఎవరికి నీవు బంధానివో అనుబంధమే కలిసిపోవాలి
ఎవరికి నీవు చిత్రానివో అభినయ వర్ణమే మెరిసిపోవాలి  || ఏనాటి ||

ఎంతటి గుణ సుందరివో సువర్ణ సౌందర్యమే దాగినది
ఎంతటి రాగ తరంగిణివో సప్తస్వర సంగీతమే ఒదిగినది

ఎంతటి దివ్య మోహానివో ముఖ బింభమే ఆకాశాన్ని చూస్తున్నది
ఎంతటి వర్ణ తేజస్వినివో సూర్య ప్రకాషమే నిన్ను కాంక్షిస్తున్నది  

ఎక్కడ నీవు ఉదయించావో అమరావతిలో శిలై ఉన్నావు
ఎక్కడ నీవు అస్తమించావో ఇక్కడే నీవు కొలువై ఉన్నావు   || ఏనాటి ||