Tuesday, May 31, 2016

ఏనాటి దేవకన్యవో నీవు శిలగా మిగిలిపోయినావు ఈ జగతికి

ఏనాటి దేవకన్యవో నీవు శిలగా మిగిలిపోయినావు ఈ జగతికి
ఏనాటి శిల్పానివో నీవు అపురూపమై నిలిచావు ఈ లోకానికి

సృష్టిలోని అందాలలో నీవే అతి మధురమైనావు ఈ విశ్వానికి
ఆకార రూపాలలో నీవు శృంగార సౌందర్యమైనావు ఈ ద్వీపానికి  || ఏనాటి ||

నీలోని భావాలు నీలోనే మౌనమై శిలగా మారిపోయినాయి
నీలోని పదాలు నీలోనే లీనమై శిల్పంలో దాగి ఉన్నాయి

ఏనాటి సుందర సౌందర్యవతివో నీ చూపులే తెలుపుతున్నాయి
ఏనాటి సుగంధ సరసానివో నీ వయ్యారములే చూపుతున్నాయి

ఎవరికి నీవు బంధానివో అనుబంధమే కలిసిపోవాలి
ఎవరికి నీవు చిత్రానివో అభినయ వర్ణమే మెరిసిపోవాలి  || ఏనాటి ||

ఎంతటి గుణ సుందరివో సువర్ణ సౌందర్యమే దాగినది
ఎంతటి రాగ తరంగిణివో సప్తస్వర సంగీతమే ఒదిగినది

ఎంతటి దివ్య మోహానివో ముఖ బింభమే ఆకాశాన్ని చూస్తున్నది
ఎంతటి వర్ణ తేజస్వినివో సూర్య ప్రకాషమే నిన్ను కాంక్షిస్తున్నది  

ఎక్కడ నీవు ఉదయించావో అమరావతిలో శిలై ఉన్నావు
ఎక్కడ నీవు అస్తమించావో ఇక్కడే నీవు కొలువై ఉన్నావు   || ఏనాటి || 

No comments:

Post a Comment