Showing posts with label భోగం. Show all posts
Showing posts with label భోగం. Show all posts

Tuesday, December 6, 2016

దేహం లేని దైవం ఎందుకో

దేహం లేని దైవం ఎందుకో
వేషం లేని ఆవేశం ఎందుకో
దేశం లేని ప్రదేశం ఎందుకో
జీవం లేని సజీవం ఎందుకో
వర్ణం లేని సువర్ణం ఎందుకో
శుభం లేని శోభనం ఎందుకో
జనం లేని భజనం ఎందుకో
జ్ఞానం లేని విజ్ఞానం ఎందుకో
రాగం లేని స్వరాగం ఎందుకో
గీతం లేని సంగీతం ఎందుకో
భోగం లేని సంభోగం ఎందుకో
దానం లేని ప్రదానం ఎందుకో
దాహం లేని దహనం ఎందుకో
చిత్రం లేని విచిత్రం ఎందుకో
భావం లేని స్వభావం ఎందుకో
వేదం లేని వేదాంతం ఎందుకో
భాగ్యం లేని సౌభాగ్యం ఎందుకో
వ్రతం లేని అమృతం ఎందుకో
పూర్ణం లేని సంపూర్ణం ఎందుకో
గంధం లేని సుగంధం ఎందుకో
తంత్రం లేని మంత్రం ఎందుకో
శాస్త్రం లేని శాస్త్రీయం ఎందుకో
ఖండం లేని అఖండం ఎందుకో
మోహం లేని మోహనం ఎందుకో
అందం లేని చందనం ఎందుకో
యోగం లేని సంయోగం ఎందుకో
రాజ్యం లేని సామ్రాజ్యం ఎందుకో
నందనం లేని ఆనందం ఎందుకో
యుగం లేని యుగాంతం ఎందుకో
ఆత్మ లేని పరమాత్మ ఎందుకో ఎవరికో 

Thursday, November 17, 2016

సర్వానంద యోగం సర్వేశ్వరా భోగం

సర్వానంద యోగం సర్వేశ్వరా భోగం
సత్యానంద యోగం సత్యాంతర భోగం
నిత్యానంద యోగం నిత్యాంతర భోగం
పరమానంద యోగం పరంధామ భోగం
ఆత్మానంద యోగం అంతర్యామి భోగం
సదానంద యోగం సదాశివానంద భోగం
పరమాత్మానంద యోగం పరతత్వ భోగం
మహాత్మానంద యోగం మహోత్తర భోగం
శాంతానంద యోగం శాంతిస్వరూప భోగం
సచ్చిదానంద యోగం సర్వాంతరంగ భోగం
వైకుంఠానంద యోగం వైభోగ భోగ భాగ్యం 

Tuesday, September 20, 2016

సుఖమో జీవితమో

సుఖమో జీవితమో
సుఖమే సంయోగ సంభోగమో
జీవితమే సుఖమైన సంతోషమో  || సుఖమో ||

సాగే కాలంతో సుఖ జీవిత ప్రయాణమో
కదిలే సమయంతో మహా సంభోగ భావమో

మోహమే మహా వేదమో వేదమే మహా మోహనమో
మనస్సే మహా మంత్రమో వయస్సే మహా చిత్రమో  || సుఖమో ||

ఎదిగే వయస్సుతో సాగే కాలంతో జీవితం ఏ ప్రయాణమో
ఒదిగే మనస్సుతో కదిలే సమయంతో నవ జీవన మార్గమో

ఒడిదుడుకులు ఎన్నున్నా సుఖ భోగం ఎవరికి శాంతమో
అలజడులు ఎన్నున్నా సంతోష యోగం ఎవరికి మోక్షమో  || సుఖమో ||