Showing posts with label వయ్యారం. Show all posts
Showing posts with label వయ్యారం. Show all posts

Tuesday, July 4, 2017

ఏమని నన్ను మెప్పించావు

ఏమని నన్ను మెప్పించావు
ఏమని నన్ను ఒప్పించావు
ఏమని నన్ను రప్పించావు

తెలియకనే తెలియని కాలంతో మెప్పించి ఒప్పించి రప్పించావు  || ఏమని ||

మెచ్చిన రూపం ఒప్పిన అందం జతకై రప్పించేనా
తలచిన భావం తపించిన తత్వం మనకై ఒప్పించేనా
కలసిన స్నేహం చేరిన ప్రేమం మదికై మెప్పించేనా   || ఏమని ||

చూసిన సమయం ఆగని తరుణం కాలంతో రప్పించిన తపనం
కోరిన శృంగారం మీరిన వయ్యారం దేహంతో ఒప్పించిన సోయగం
మెరిసిన తేజం విరిసిన కాంతం వర్ణంతో మెప్పించిన కమనీయం   || ఏమని ||