Showing posts with label సంతోషం. Show all posts
Showing posts with label సంతోషం. Show all posts

Monday, March 27, 2017

కాలమా భావమా తెలియని గమనమా

కాలమా భావమా తెలియని గమనమా
వేదమా జ్ఞానమా తెలియని తరుణమా

మానవ జీవితానికే తెలియని బంధమా
మేధస్సున ఆలోచనకే తెలియని స్వభావమా!   || కాలమా ||

గాలి ఏ వైపు వీచినా కాలం ప్రతి దేశాన సాగెనే
నీరు ఏ వైపు ప్రవహించినా సముద్రాన్ని చేరెనే

సత్యం ఎక్కడ ఉన్నా ధర్మం అక్కడే రక్షింపబడేనని
విజ్ఞానం ఎక్కడ ఉన్నా అభివృద్ధి అక్కడే సాధ్యమని  || కాలమా ||

స్నేహం సంతోషం ఎక్కడ ఉంటే అక్కడే ప్రేమ బంధాలు చిగురించేనని
భావన ఆలోచన స్వభావాలు ఉంటే వేద విజ్ఞాన తత్వాలు ఉదయించేనని

కాలం ఎలా సాగిపోతున్నా తెలియని స్వభావాలు కొత్తగా పరిచయమయ్యేనులే
విజ్ఞానం ఎలా తెలుసుకున్నా తెలియని వేదాల అనుభవాలు వింతగా తోచేనులే  || కాలమా || 

Wednesday, October 19, 2016

ప్రేమం ప్రియం సంగీతం సంతోషం

ప్రేమం ప్రియం సంగీతం సంతోషం
ప్రాణం ప్రయాణం జీవితం ఉల్లాసం
ప్రాయం వసంతం జీవనం ఉత్తేజం  || ప్రేమం ||

ప్రేమతో సాగే ప్రయాణమే మన లోకం
ప్రాణంతో కలిగే శ్వాసే మన గమనం
ప్రాయంతో వెలిగే మన ధ్యాసే జీవితం
కాలంతో సాగే మన సంతోషమే ఆనందం

భావం ఓ జీవిత గీతం
తత్వం ఓ జీవన రాగం
వేదం ఓ శరీర స్వరం
గుణం ఓ ఆకార నాదం  || ప్రేమం ||

ప్రేమించే ప్రాణమే ప్రయాణిస్తూ చేరుతున్నది
ప్రాణంతో ప్రాయమే చిగురిస్తూ సాగిపోతున్నది
ప్రాయంతో పద్మమే వికసిస్తూ ఎదుగుతున్నది

భావంతో బంధాలెన్నో ప్రేమంగా సాగుతున్నాయి
వేదంతో గుణాలెన్నో ప్రాణంగా వచ్చేస్తున్నాయి
స్నేహంతో పరిచయాలెన్నో శాంతంగా కలుస్తున్నాయి  || ప్రేమం ||   

Thursday, September 29, 2016

తల్లిగా ప్రేమించే అమ్మవు నీవే

తల్లిగా ప్రేమించే అమ్మవు నీవే
మాతగా లాలించే మహా దేవి నీవే
మానవత్వం కలిపించే కల్పవల్లి నీవే     || తల్లిగా ||

మీలోనే ఒదిగిపోయి ఎదిగాము మహా గొప్పగా
మీతోనే ఉండిపోయి నేర్చాము మహా క్షేత్రంగా

మీయందు ఉంటాము ఎల్లప్పుడు సంతోషంగా
మీ ముందే ఉంటాము ఎప్పటికి ఆనందముగా  || తల్లిగా ||

మా కష్టాలనే ఓదార్చెదవు హాయిగా
మా నష్టాలనే భరించేవు సులువుగా

మా జీవితాలకు రూపమిచ్చేవు మహాత్మగా
మా జీవనాన్నే ఆదుకునేవు మహా తల్లిగా  || తల్లిగా || 

Tuesday, August 23, 2016

హృదయంలో ఆరంభం మనస్సులో అనంతం

హృదయంలో ఆరంభం మనస్సులో అనంతం
ఎదో సంతోషం ఎంతో ఉల్లాసం ఏమో ఉత్తేజం
ఆలోచనలలో ఆరాటం మేధస్సులో ఆర్భాటం
ఎప్పుడో ఆవేదం ఎన్నడో ఆవేశం ఎందుకో ఆధ్రతం  || హృదయంలో ||

పరుగులు తీసే వయస్సు పరిగెత్తించే మనస్సు ఏనాటిదో
ప్రేమించే భావం ఆలోచించే తత్వం అడుగులు వేసే స్వభావం

అదిగో మన ప్రేమ సూర్యోదయంలా ఉదయిస్తున్నది
ఇదిగో శుభోదయమై మన ప్రేమ జీవితం చిగురిస్తున్నది

ఎన్నడు లేని ఆనందం మనలోనే కొత్తగా జీవిస్తున్నది
ఎప్పుడు లేని ప్రశాంతం మనతోనే జత కలుస్తున్నది    || హృదయంలో ||

కలిగేనే మనలో అద్భుతం మెలిగేనే మనలో వసంతం
వెలిగేనే యదలో అనంతం కురిసేనే మదిలో ఆరాటం

సంతోషమే సంభరమై ఉల్లాసమే ఉత్తేజమై జలపాతమే పులకరించేనే
సమయమే సందర్భమై ఆలోచనలే వేదాంతమై విజ్ఞానమే వికసించేనే

ఆలయమే మన సన్నిధి హృదయమే మన జీవనది
మనస్సే మన అవధి వయస్సే మన పెన్నిధి మన గడవు  || హృదయంలో ||

Monday, August 22, 2016

నీవు లేని జీవితం ఎవరి కోసమో తెలియని మోహం

నీవు లేని జీవితం ఎవరి కోసమో తెలియని మోహం
నీవు లేని జీవనం ఎందు కోసమో తెలియని మౌనం  || నీవు లేని ||

నీవు లేక నేను లేనని తెలిపేనే నా ప్రేమ హృదయం
నీవు లేక నేను లేని హృదయం మరణంతో సమభావం

నీవు నేను ఒకటైతేనే నీకు నాకు కలిగేను సంతోషం
నీవు నేను ఒకరికి ఒకరైతేనే ఇద్దరికి కలిగేను ఆనందం

నీవుగా జీవించే నేను నీతోనే ప్రతి క్షణం ఉండిపోతాను
నీవుగా సాగించే నా జీవితం నీకోసమేనని అనుకుంటాను  || నీవు లేని ||

నీలోనే నా భావం బంధమై సాగుతున్నది
నీలోనే నా జీవం అనుబంధమై జీవిస్తున్నది
నీతోనే నా హృదయం తేజమై వెలుగుతున్నది
నీతోనే నా సమయం కాలమై ప్రయాణిస్తున్నది  

నీవు నేను ఒకరికి ఒకరై నిలిచిపోవాలి
నీవు నేను ఒకరికి ఒకరై ఉండిపోవాలి
నీవు నేను ఒకే బాటలో నడిచిపోవాలి
నీవు నేను ఒకే మాటతో సాగిపోవాలి       || నీవు లేని ||

Tuesday, July 5, 2016

మరణంతో దుఃఖం లేదు జన్మతో సంతోషం లేదు

మరణంతో దుఃఖం లేదు జన్మతో సంతోషం లేదు
జీవించుటలో ఏది కలిగినా తాత్కాళిక సంభోగమే
అధిక సంతోషంలో అతిశయోక్తి ఎంతని చెప్పలేవు
అల్ప దుఃఖంలో అసంతృప్తి ఏమని వివరించలేవు
మనస్సులోనే విజ్ఞాన పరిశోధనతో ముందుకు సాగేవు
అనుభవమే మరణ జన్మల జీవన జీవిత భావ బంధాలు 

Monday, May 30, 2016

ఏదో సంతోషం ఎంతో ఉల్లాసం ఏమో విశేషం నీలో

ఏదో సంతోషం ఎంతో ఉల్లాసం ఏమో విశేషం నీలో
ఏదో సందేహం ఎంతో ఆరాటం ఏమో సందిగ్దం నాలో
తీరని అనుభవం వీడని అనుబంధం మనలో సాగే అనురాగం ఎందుకో ఈ వేళ || ఏదో సంతోషం ||

మనస్సులో ఆనందం హృదయంలో కలిగే సంతోషం
యదలో అనురాగం మేధస్సులో కలిగే అనుబంధం

మాటలతో సాగే ప్రయాణం మమతై కోరినది మమకారం
భావాలతో సాగే కాలం మధురమై వచ్చినది మకరందం

ఏనాటి భావాలో నేడు నీ కోసమే వస్తున్న మధురిమలు
ఏనాటి స్వప్నాలో నీ చెంతకే చేరుతున్న పదనిసలు    || ఏదో సంతోషం ||

జీవనమే హాయిగా నీతో సాగే జీవితమే మన ప్రేమ
జీవమే స్వేచ్ఛగా నీతో కలిసే మదియే మన జన్మ

పుష్పాలు వికసించే పరిమళాలు నాలోనే దాగున్నాయి
తేనీయం కవ్వించే సుమ గంధాలు నీతోనే వస్తున్నాయి

తెలియనిది ఏదైనా ఉంటే సందేహమే
తెలుసుకోవాలని ఎంతైనా ఉంటే ఆరాటమే
తెలుసుకున్నా తోచకపోతే సందిగ్ధమే

భావాలతో జీవిస్తే జీవితం ఎంతో సంతోషం
బంధాలతో జీవిస్తే జీవనమే ఎంతో ఉల్లాసం  || ఏదో సంతోషం ||