Showing posts with label ఉత్తేజం. Show all posts
Showing posts with label ఉత్తేజం. Show all posts

Monday, August 7, 2017

ఓ సూర్య దేవా! సర్వం నీవే విజ్ఞానం

ఓ సూర్య దేవా! సర్వం నీవే విజ్ఞానం
ఓ సూర్య దేవా! నిత్యం నీవే వైభోగం

ప్రతి జీవికి నీవే ఉత్తేజం
ప్రతి అణువుకు నీవే ఉత్కంఠం  || ఓ సూర్య దేవా! ||

ఉదయించే భావాలకు సూర్యోదయమే సువర్ణ సుప్రభాతం
అస్తమించే భావాలకు సూర్యాస్తమయమే సుదీర్ఘ ప్రయాణం

ఎదిగే ప్రతి వారికి నీవే మహా ఆదరణం
ఒదిగే ప్రతి వారికి నీవే మహా ఆభరణం   || ఓ సూర్య దేవా! ||

తేజముతోనే విజ్ఞానం ఉత్తేజముతోనే ప్రజ్ఞానం
భావంతోనే ప్రయాణం స్వభావంతోనే ప్రయాసం

ప్రజ్వలించుటలోనే అత్యంతమైన భావాలు ప్రకాశవంతమై వచ్చినదే సువర్ణ తేజం
ప్రజ్వలించుటలోనే ఆద్యంతమైన భావాలు ప్రభావంతమై మెచ్చినదే సువర్ణ కిరణం  || ఓ సూర్య దేవా! || 

Thursday, September 22, 2016

ఊరంతా జరిగేను సంభరమే

ఊరంతా జరిగేను సంభరమే
రోజంతా కలిగేను సంతోషమే
ప్రతి రోజు చేసేను కళ్యాణమే
ప్రతి రాత్రి ఒక మహోత్సవమే  || ఊరంతా ||

ఊరంతా ఊరేగింపుతో సాగేను కళ్యాణోత్సవం
ప్రతి రోజు మన కోసమే జరుపుకునేను ఉత్సవం
ఉల్లాసంగా ఉత్సాహంగా ఊరంతా ఎంతో సంభరం
బాధను మరచి భారమే తగ్గేందుకు కావాలి ఉత్తేజం  || ఊరంతా ||

మనలో మనమే అందరం కలిసేందుకు ఉత్సవం
మనలో మనకు స్నేహమే కలిగేందుకు పరిచయం
మనలో మనకు ఉండాలి ఏ సమస్యలకైనా పరిష్కారం
మనలో మనమే ఏదైనా చేసుకోవాలి సంభరమైన ఉత్సవం  || ఊరంతా || 

Tuesday, August 23, 2016

హృదయంలో ఆరంభం మనస్సులో అనంతం

హృదయంలో ఆరంభం మనస్సులో అనంతం
ఎదో సంతోషం ఎంతో ఉల్లాసం ఏమో ఉత్తేజం
ఆలోచనలలో ఆరాటం మేధస్సులో ఆర్భాటం
ఎప్పుడో ఆవేదం ఎన్నడో ఆవేశం ఎందుకో ఆధ్రతం  || హృదయంలో ||

పరుగులు తీసే వయస్సు పరిగెత్తించే మనస్సు ఏనాటిదో
ప్రేమించే భావం ఆలోచించే తత్వం అడుగులు వేసే స్వభావం

అదిగో మన ప్రేమ సూర్యోదయంలా ఉదయిస్తున్నది
ఇదిగో శుభోదయమై మన ప్రేమ జీవితం చిగురిస్తున్నది

ఎన్నడు లేని ఆనందం మనలోనే కొత్తగా జీవిస్తున్నది
ఎప్పుడు లేని ప్రశాంతం మనతోనే జత కలుస్తున్నది    || హృదయంలో ||

కలిగేనే మనలో అద్భుతం మెలిగేనే మనలో వసంతం
వెలిగేనే యదలో అనంతం కురిసేనే మదిలో ఆరాటం

సంతోషమే సంభరమై ఉల్లాసమే ఉత్తేజమై జలపాతమే పులకరించేనే
సమయమే సందర్భమై ఆలోచనలే వేదాంతమై విజ్ఞానమే వికసించేనే

ఆలయమే మన సన్నిధి హృదయమే మన జీవనది
మనస్సే మన అవధి వయస్సే మన పెన్నిధి మన గడవు  || హృదయంలో ||

Thursday, July 28, 2016

నా హృదయం ప్రతి క్షణం ఉదయిస్తూనే మేధస్సులో కిరణాలుగా స్పర్శను అందిస్తుంది

నా హృదయం ప్రతి క్షణం ఉదయిస్తూనే మేధస్సులో కిరణాలుగా స్పర్శలను అందిస్తుంది
కిరణాలతో ప్రతి కణం ఉత్తేజవంతమై మేధస్సులో విజ్ఞాన అన్వేషణను దివ్యంగా సాగిస్తుంది  || నా హృదయం ||

హృదయంలో ప్రతి స్పందన ప్రతిసారి పరిచయమై స్పర్శలనే కలిగిస్తుంది
ప్రతి క్షణం స్పందనలతో నా జీవానికి అంతర్భావ కార్యాలను నెరవేరుస్తుంది

మేధస్సులో విజ్ఞానాన్ని దేహంలో ఆరోగ్యాన్ని రూపంలో తేజాన్ని హృదయమే సరిచేస్తుంది
జీవంలో భావాన్ని ఆత్మలో తత్వాన్ని శ్వాసలో స్వభావాన్ని మేధస్సే లీనమై ఆలోచిస్తుంది   || నా హృదయం ||

ప్రతి సూర్యోదయం హృదయానికి మేధస్సుకు మహా దివ్యమైన ఆరోగ్య తత్వాన్నిస్తుంది
ప్రతి సూర్యాస్తమయం దేహానికి విశ్రాంతి మేధస్సుకు తాత్కాళిక నిద్రను సమర్పిస్తుంది

ప్రతి సూర్య కిరణం ప్రతి జీవికి ఉత్తేజం ఆరోగ్యంతో విజ్ఞాన కార్యాలపై గమనాన్ని కలిగిస్తుంది
ప్రతి సూర్య తేజం ప్రతి జీవికి భావ స్వభావాల తత్వాలతో మహా విచక్షణను తెలియజేస్తుంది  || నా హృదయం || 

Wednesday, June 15, 2016

ఆకాశం సృష్టికి నిలయం

ఆకాశం సృష్టికి నిలయం
ఆకాశం జగతికి సంపూర్ణం
ఆకాశం లోకానికి మందిరం
ఆకాశం మేధస్సుకే ఉత్తేజం
ఆకాశం విశ్వానికి సంయోగం
ఆకాశం మేఘానికి రూప వర్ణం
ఆకాశం సూర్యునికి మహా తేజం
ఆకాశం కిరణానికి దివ్య దర్శనం
ఆకాశం ఇంద్రధనస్సుకే పదిలం