Showing posts with label తంత్రము. Show all posts
Showing posts with label తంత్రము. Show all posts

Wednesday, April 6, 2016

తంత్రము తెలిసినదా మంత్రము తెలిసినదా

తంత్రము తెలిసినదా మంత్రము తెలిసినదా
యంత్రములోని మర్మ రహస్యము తెలిసినదా
సాంకేతిక విజ్ఞానములోని తాంత్రిక పరి జ్ఞానము తెలిసినదా
మేధస్సులో దాగిన అన్వేషణ మహా విజ్ఞానాన్ని గ్రహించినదా
దీర్ఘ కాల కృషి నూతన విజ్ఞానం ఆలోచనలో అనుభవం
ఒకటితో మొదలై అనంతముతో సాగే ప్రయత్నం విజయమే
కలిగే కష్టాలు వదలని నష్టాలు మారని లోపాలు మనలోనే
విజయంలో మాయ ఉన్నది అందులోనే మంత్రమున్నది
మంత్రములో తంత్రమున్నది తంత్రము యంత్రములోనే దాగున్నది
యంత్రములో మానవ మేధస్సు ఉన్నది అందులో కృషి నిక్షిప్తమైనది