Showing posts with label దైవాత్మ. Show all posts
Showing posts with label దైవాత్మ. Show all posts

Friday, August 5, 2016

అంతరాత్మ అంతర్యామి

అంతరాత్మ అంతర్యామి
అవధూత అంతర్భావం
అధిరోహించేను అద్వైత్వం  || అంతరాత్మ ||

పరమ తత్వం పరిశోధించగా తెలిసేనే పరమాత్మము
మహా తత్వం పర్యవేక్షించగా తెలిసేనే పరతత్వము
వేద తత్వం అన్వేషించగా తెలిసేనే అద్వైత్వము
దైవ తత్వం పరిశీలించగా తెలిసేనే దైవత్వము         || అంతరాత్మ ||

ఆత్మలోనే మహాత్మ పరమాత్మ
మహాత్మలోనే పరమాత్మ అంతరాత్మ
పరమాత్మలోనే అంతరాత్మ జీవాత్మ
అంతరాత్మలోనే జీవాత్మ మహా ఆత్మ
జీవాత్మలోనే మహా ఆత్మ దైవాత్మ
మహా ఆత్మలోనే దైవాత్మ దేవాత్మ  
దైవాత్మలోనే దేవాత్మ ఓ ఆత్మ            || అంతరాత్మ ||

దేవాత్మలోనే ఓ ఆత్మ
ఆత్మలోనే ఆత్మ అనంతమై అధిరోహించేను  || అంతరాత్మ || 

Tuesday, July 19, 2016

ఆత్మగా ఉదయించి మహాత్మగా అస్తమించవా దేవా

ఆత్మగా ఉదయించి మహాత్మగా అస్తమించవా దేవా
శ్వాసతో జన్మించి స్వధ్యాసతో అధిరోహించవా దైవా
మౌనంతో అధిగమిస్తూ జీవంతో మోక్షమించవా దేవా  || ఆత్మగా ||

దైవాధీనము జగత్సర్వము అద్వైత దైవత్వము ఒక్కటే
అభియోగము సర్వాంతము అభ్యుదయము అంతర్గతమే

నీలో నీవై దైవ ప్రవక్తగా ఉదయిస్తూ విశ్వానికే మహాత్మవై నిలిచావు
నీలో నీవే దైవ ధూతగా మేల్కొంటూ జగతికి పరమాత్మవై వెలిసావు   || ఆత్మగా ||

భగవంతుడే వచ్చి విజ్ఞానాన్ని తెలిపేనా మహాత్మయే నడిచి ధర్మాన్నే భోదించేనా
మహాత్వ పూర్ణమైన సేవలను అందించి మహా తత్వాన్ని సంపూర్ణగా సంభోదించేనా

విశ్వమే పర తత్వమై ఆత్మే మహా పర్వతమై మహాత్మగా ఉదయించేనా
జగమే పర భావమై పరమాత్మే మహా శిఖరమై దైవాత్మగా అవతరించేనా  || ఆత్మగా || 

Saturday, June 25, 2016

ఆత్మలో ఆత్మనై పరమాత్మగా ఒదిగాను ఓ దైవాత్మగా

ఆత్మలో ఆత్మనై పరమాత్మగా ఒదిగాను ఓ దైవాత్మగా
ఆత్మలో ఆత్మనై పరమాత్మనై ఉన్నాను ఓ లోకాత్మగా
ఆత్మలో ఆత్మనై పరమాత్మలో కలిసాను ఓ మహాత్మగా
ఆత్మలో ఆత్మనై పరమాత్మకై ఎదిగాను ఓ జగతాత్మగా
ఆత్మలో ఆత్మనై పరమాత్మతో నిలిచాను ఓ విశ్వాత్మగా
ఆత్మలో ఆత్మనై పరమాత్మనే కొలిచాను ఓ ధర్మాత్మగా
ఆత్మలో ఆత్మనై పరమాత్మచే జన్మించాను ఓ దేహాత్మగా
ఆత్మలో ఆత్మనై పరమాత్మకే స్తంభించాను ఓ నిత్యాత్మగా