Showing posts with label లాభం. Show all posts
Showing posts with label లాభం. Show all posts

Friday, July 1, 2016

జగమంతా ఒకటే భావన - మంచిగా ఉండాలని మంచే జరగాలని

జగమంతా ఒకటే భావన - మంచిగా ఉండాలని మంచే జరగాలని
ఎవరికి వారు అనుకుంటుంటారు మనం ఎప్పటికీ బాగా ఉండాలని
ప్రతి విషయంలో మనకే మంచి జరగాలి మనకే లాభం కలగాలి
ఎదుటివారు ఎలా ఉన్నా మనం కాస్త మెరుగుపడాలని అనుకుంటాం
విజ్ఞానంలో ఐశ్వర్యంలో బంధుత్వంలో స్నేహితులలో సమాజంలో
ఎక్కడైనా ఎలాగైనా మనమే మనవారే బాగా మంచిగా ఉండాలని

అంతా మంచినే కోరుకుంటాం కానీ కాస్త పొరపాట్లు జరుగుతుంటాయి
కొన్ని సంధర్భాలలో మనం ఎదుటి వారికి కాస్త ఇబ్బంది కలిగిస్తుంటాము
కొందరి  ద్వారా మోసం ద్రోహం మరణం ఇలా ఎన్నో జరుగుతుంటాయి
మనలో మనకు అదుపు లేకపోతే ఆవేశం మన మేధస్సుకు అర్థం కాదు
ఆవేశంలో ఎన్నో పొరపాట్లు ఇబ్బందులు జరుగుతూ కలుగుతుంటాయి
ఎన్ని యుగాలు గడిచినా స్వార్థంతోనే మన జీవితాలు సాగుతూ వస్తున్నాయి
మన సమస్యలే మన కోపా ద్వేషాలు మన అజ్ఞాన భావాలు ఆలోచనలు
మనలో ఎన్నో మహా అద్భుత లక్షణ గుణాలు ఉన్నా సహాయం వెనుకడుగే
సహాయం సలహా ఆదుకోవడం పలకరించడం తెలుసుకోలేక పోవడం ఎన్నో
మనకు కాస్త ఇబ్బంది కలిగినా మన నిర్ణయాలను మనం మార్చుకుంటాం
ఇంట్లో సమాజంలో ఎక్కడైనా పరిష్కారాన్ని చర్చించే నాయకులు ఉండాలి
నాయకులు ప్రతి విషయాన్ని సమాజంలో గమనించాలి తెలుసుకోవాలి
అనుభవం గల నాయకులు సమాజానికి సమస్యల పరిస్కారణకై అవసరం
ప్రతి సమస్యను అంతిమ తీర్పుగా అందరికి నచ్చేలా పరిష్కారించాలి
ఒక సారి ఒక సమస్యను పరిస్కారిస్తే యుగాలు గడిచినా సమాధానమే కావాలి
- మరో ప్రశ్నగా మారకూడదు ఎవరూ దానిని మార్చకూడదు మరోలా అనుకోరాదు
ప్రతి సమస్యకు  పరిష్కారం చివరిదై ఉండాలి తాత్కాలికంగా ఉండకూడదు
తాత్కాలిక నిర్ణయ పరిస్కారాలే కోట్ల సమస్యలుగా విధిగా ఏర్పడుతూ సాగుతాయి

నాలో ఎన్నో అంతిమ పరిస్కారాలు కార్య చరణ ప్రణాళికలు ఉన్నాయి
ప్రతి సమస్యకు అనుభవమైన పరిస్కారం సమస్యల నిర్ధారణ ఉన్నాయి
ఎలా ఎప్పుడు సమాజాన్ని మార్చగలుగుతానోనని మరణంతో పోరాడుతున్నాను