Showing posts with label అంతం. Show all posts
Showing posts with label అంతం. Show all posts

Monday, March 20, 2017

ఏనాటిదో శూన్యం ఏనాటిదో ఆద్యంతం

ఏనాటిదో శూన్యం ఏనాటిదో ఆద్యంతం
ఆది నుండి తుది వరకు అంతం అనంతం
క్షణము నుండి సమయం కాలంతో ప్రయాణం  || ఏనాటిదో ||

శూన్యము నుండే ఉద్భవించినది మహా రూప నిర్మాణం
శూన్యము నుండే ప్రబలించినది అసంఖ్యాక వర్ణ రూపం
శూన్యము నుండే అంతర్భవించినది రూపాంతరం మర్మం

కాలంతో ఆకారాలు ప్రభావితమౌతూ ఎన్నో అనంతమైన రూపాలుగా వెలిసేను
కాలంతో రూపాలు పరిశోధనమౌతూ ఎన్నో అసంఖ్యాక వర్ణాలుగా ప్రజ్వలించేను
కాలంతో పరిసరాలు ప్రాముఖ్యతమౌతూ ఎన్నో అనేక స్వభావాలుగా ఉదయించేను  || ఏనాటిదో ||

శూన్యమే సామర్థ్యమై స్థానమే మూలమై
ఊష్ణమే రూపాంతర బీజమై ప్రభావమే ఆకార నిర్మాణమై
ఆత్మయే జీవమై కాలమే ఎదిగే మహా కార్యమై ఆరంభమైనదే మన బ్రంహాండం

శూన్యము మహా సామర్థంతో మహా నిర్దిష్టమైన కాల ప్రణాళికతో అనేక వివిధ కార్యాలతో
ఎన్నో రూపాలుగా ఆకారాలుగా భావ స్వభావాలుగా తత్వాలుగా ప్రభావితమౌతున్నది

ఆది శూన్యము నుండి నేటి అనంతము వరకు కాల జ్ఞాన వేద విశ్వ విజ్ఞానము తుది లేని భవిష్యత్ కు సాగుతున్నది  || ఏనాటిదో || 

Tuesday, August 9, 2016

నిజమే లేని హృదయం కరిగిపోయే జీవం

నిజమే లేని హృదయం కరిగిపోయే జీవం
సత్యమే లేని తరుణం మరచిపోయే యోగం  || నిజమే ||

శ్వాసే లేని జీవం మరణించిన రూపం
ధ్యాసే లేని ఆకారం ఆగిపోయిన మౌనం

మనస్సే లేని మర్మం మతిలేని జ్ఞాపకం
వయస్సే తెలియని సమయం ఓ లోపం

ధ్యేయం లేని కర్తవ్యం సాహసం లేని అంతం
ధర్మం లేని సత్యం హంసత్వం లేని హితం   || నిజమే ||

విషాదంతో సాగే బంధం విలవిలలాడే తపనం
ఔషధంతో సాగే రోగం కలుషితమైన దేహ కర్మం

బంధాలతో సాగే జీవితం ఎటు వెళ్లినా పరవశం
వేదాలతో సాగే జీవనం ఎటు మారినా వేదాంతం

కాలంతో సాగే సమయం క్షణాలకు చరితం
భావంతో సాగే కార్యం అభివృద్ధికి పరిచయం  || నిజమే || 

Thursday, July 28, 2016

అమ్మా నీ జన్మకు ఏదీ సాటి రాదు నీ ప్రేమకు అంతం లేదు

అమ్మా నీ జన్మకు ఏదీ సాటి రాదు నీ ప్రేమకు అంతం లేదు
అమ్మగా నీవు జన్మించే భావం మరో జన్మనే సృష్టించే తత్వం  || అమ్మా ||

జన్మలనే ఇచ్చే దేవతగా అవతరించావు భూలోక భవ విశ్వంలో
జన్మించి జన్మనిస్తూ ఎన్నో జన్మలనే నీ జీవంతో సృష్టిస్తున్నావు

జగతికే మరో జన్మంటు ఉంటే నీవే మరో జగతిని నీవుగా సృష్టించెదవు
నీలోని స్వభావ తత్వాలే నవ జీవికి ఉదయించే భావాలను కలిపించెదవు

అమ్మగా నీవు పంచే మమకారం కాలంతో ఎదిగే నీ ప్రతి రూప జీవం
అమ్మగా నీవు ఇచ్చే బంధం అభినయమై జీవితాన్ని సాగించే ధర్మం  || అమ్మా ||

జన్మించే జీవులకు కాలంతో విజ్ఞానాన్ని అందిస్తూ అనుభవాన్నే నేర్పుతున్నావు
జన్మతో మరో జీవికి జన్మను ప్రసాదిస్తూ సోదర తత్వాల స్నేహ బంధాన్ని ఇచ్చేవు

మానవులలోనే కాక ప్రతి జీవిలో నీవు అమ్మగా ఎన్నెన్నో జన్మలనే సృష్టిస్తున్నావు
ప్రతి జీవికి అమ్మగా ప్రతి రోజు ఎదుగుదలను ఇస్తూ విశ్వానికి పరిచయిస్తున్నావు

అమ్మంటేనే మహా తత్వం అపురూపమైన భావాలతో లోకాన్ని నడిపించే మహోత్తరం
అమ్మంటేనే మహా జీవం అద్భుతమైన వేద విజ్ఞానాన్ని పరిశోధించే కాల జ్ఞాన నవోత్తరం || అమ్మా ||