Showing posts with label అలివేణి. Show all posts
Showing posts with label అలివేణి. Show all posts

Wednesday, August 17, 2016

అలనాటి ఆణి ముత్యమా ఇలనాటి జీవ ముత్యమా

అలనాటి ఆణి ముత్యమా ఇలనాటి జీవ ముత్యమా
ఆనాటి స్వాతి ముత్యమా ఈనాటి ప్రేమ ముత్యమా
ముత్యములలో ఒదిగిన నవ జీవపు స్వర్ణ ముత్యమా  || అలనాటి ||

స్వర్ణములలో సువర్ణమై సుగంధములలో గంధమై వెలిసిన అలివేణి ముత్యమా
వర్ణములలో మహా వరమై గంధములలో శ్రీగంధమై నిలిచిన ఇలవేణి ముత్యమా

వేదాలలో వేదాంతమై జ్ఞానంలో విజ్ఞానమై విశ్వమంతా వ్యాపించిన నవ ముత్యమా
భావాలలో స్వభావమై తత్వాలలో మహాతత్వమై జగమంతా విరిసిన మహా ముత్యమా  || అలనాటి ||

ముత్యములలో మురిసిపోయే పరిమళాల పారిజాత ముత్యమా
ముత్యములలో ఇమిడిపోయే వర్ణ ఛాయపు వయ్యార ముత్యమా

అలంకార శృంగారంలో ఒదిగిపోయిన అలనాటి ఆణి ముత్యమా
అందాల నవరత్నాలలో పొందికవైన ఇలనాటి స్వర్ణ ముత్యమా  || అలనాటి ||