Wednesday, June 29, 2011

మహా దివ్య నక్షత్రమే నా మేధస్సును

మహా దివ్య నక్షత్రమే నా మేధస్సును విశ్వ భావాలతో ఆలోచించేలా నడిపిస్తున్నది

ఆత్మతోనే నేను నాలోనే నేనై

ఆత్మతోనే నేను నాలోనే నేనై ఆలోచిస్తూ జీవిస్తున్నాను
నా యందు ఎవరున్నా నాలో ఆత్మ యోగ ధ్యాసపు ఆలోచనలే

Tuesday, June 28, 2011

మరో జన్మలో కలగని నేటి నా భావాలు

మరో జన్మలో కలగని నేటి నా భావాలు నాలోనే అంతరించిపోతాయేమో
నా భావాలు ఎప్పటికి నిలిచేలా ఆకాశానికే విశ్వ ధ్యాసతో అంకితం చేస్తున్నా

విశ్వానికి దూరమై పోతున్నా

విశ్వానికి దూరమై పోతున్నా విశ్వమంతా శూన్యమై పోతున్నా
విశ్వాన్ని వదిలి వెళ్ళిపోతున్నా విశ్వ రూపాలను వదిలి పోతున్నా
నాలోని భావాలకు నా జీవితం సరి లేదని మేధస్సు చింతిస్తున్నది
నా ఆలోచనలు నన్ను వేదిస్తున్ననందున విశ్వానికి దూరంగా వెళ్ళుతున్నా
నా రూపాన్ని ఆకారంగా వదిలేస్తూ పర ధ్యాసతో జీవించేలా ప్రాణమే వదిలేశా

Monday, June 27, 2011

జీవితాలు అర్థం కాకుండానే

జీవితాలు అర్థం కాకుండానే సాగుతాయని కాలమే నీకు తెలుపుతుంది
నీవు అనుకున్నవన్నీ నీకు తెలియకుండానే జరగకుండా వెళ్ళిపోతాయి
జరిగే సమయంలో ఇలా జరగాలనుకుంటే నీ వారు నిన్ను మార్చేస్తారు
నీవు కోరినవన్నీ జరగడానికి కొన్ని ఇబ్బందులను వివరిస్తూ వస్తారు
నీ కోరికల అంచనాలు పర ధ్యాసలోకి వెళ్లి పోయేలా నిన్నే మార్చేస్తారు
కార్యాలు సాగిన తర్వాత నీవేమి చేయలేక భాధతో జీవితాన్ని సాగించాలి
జరిగే అవకాశం నీలో ఉన్నా జరిపించే వారు నీకు అనుగుణంగా ఉండరు
కాలం విధి రాతయో జన్మ కర్మత్వమో నీ వారి సందిగ్ధమో అర్థం కాదు
విశ్వ విజ్ఞాన ఎరుక ఉన్నా నా అంచనాన్ని నా మేధస్సును అణచి వేశారు

Friday, June 24, 2011

విశ్వ కాలానికి దూరం ఏదీ లేదని

విశ్వ కాలానికి దూరం ఏదీ లేదని నా భావనకు తెలిసింది
విశ్వానికి కాలమే దూరమని క్షణ క్షణాలతో సాగిపోతున్నది

నీ మేధస్సులోనే విశ్వ విజ్ఞాన లక్ష్యం

నీ మేధస్సులోనే విశ్వ విజ్ఞాన లక్ష్యం ఉందని గ్రహించు
నీ ఆత్మ లక్ష్యం కోసమే జీవిస్తున్నావని నీవే తెలుసుకో
లక్ష్య సాధనకై విశ్వ విజ్ఞానాన్ని సర్వ విధానాలుగా అన్వేషించు
సర్వ భావాలతో నీ లక్ష్యాన్ని నీ జీవిత కాలంలోనే నెరవేర్చుకో
మరల రాని ఈ విజ్ఞాన అవకాశాన్ని నేడు గమనించి సాధించు

Thursday, June 23, 2011

కాలం ఎప్పుడూ ఒకేలా వెళ్ళిపోతున్నా

కాలం ఎప్పుడూ ఒకేలా వెళ్ళిపోతున్నా రోజులో తేడా లేదు
వాతావరణంలో ఉన్న తేడాయో జీవ సృష్టికి గొప్ప నిదర్శనం
కాలం వాతావరం మహా గొప్ప భావాలతో విశ్వాన్ని నడిపించును
వాతావరణ ప్రభావాలు సకల జీవులకు కాల విజ్ఞాన అనుభవాలు

విశ్వ విజ్ఞాన భావాలతో ఆత్మ

విశ్వ విజ్ఞాన భావాలతో ఆత్మ యోగత్వమైతే దేహం పరిశుద్ధమై మహా లోకాన్ని చేరును
ఆత్మ సహస్రార చక్రంతో పాద స్పర్శ నుండి శిరస్సు వరకు అజ్ఞాన పొరలను తొలగించును
మేధస్సులో విశ్వ భావ విచక్షణ కణాలు మహా దివ్య తేజస్సుతో నిత్య కాంతిని వరిస్తాయి
శరీరం మహా వేగంతో ప్రయాణిస్తూ సూక్ష్మ కణాలుగా విడిపోతూ శూన్యాన్ని చేరుతుంది
శూన్య స్థానమున ఆత్మ విశ్వ చైతన్యమై మహా విజ్ఞాన వేదత్వాన్ని సృష్టికి అందించును

Wednesday, June 22, 2011

దిక్కులు లేని దూర దర్శనమున

దిక్కులు లేని దూర దర్శనమున ఒక అణువుగా దిక్సూచివలె ఉన్నాను
మార్గం లేకున్నా గాలితో వెళ్లి ఓ మహా మర్మ గుహలో శూన్యమై చేరుకున్నా
విశ్వాన్ని తిలకించే ఆత్మ భావాలను విశ్వ తత్వాలచే శూన్యం చేసుకున్నాను
విశ్వానికి దూరంగా కనిపించని అణువుగా విశ్వ విజ్ఞానంతో ఎక్కడున్నానో

Thursday, June 16, 2011

విశ్వ ప్రపంచాన్ని స్వర్గంగా మార్చే

విశ్వ ప్రపంచాన్ని స్వర్గంగా మార్చే దివ్య ప్రణాళికలు నా మేధస్సులో ఎన్నో
విశ్వ కార్య క్రమ విధానాలు అనంతముగా తెలిసినా నిర్మాణం చేయలేను
ఆర్ధిక వ్యవస్థతో నేనేమి చేయలేక పోతున్నానని నేటికి దుఃఖించుట లేదు
నా జీవిత కాలం వృధా అవుతున్నదని విశ్వ నిర్మాణంకై ఇంకా వేచివున్నా
నేడు కలిగే ప్రతి సమస్యకు సమాజ సేవకు నా ప్రణాళికలు సమాధానమే
మీలో ఏ భాద లేదంటే ఎప్పటికి కలగదంటే మీలో సమాజ సేవ భావాలు లేవనే
సమాజ సేవ చేయాలంటే ఎప్పటికి నిలిచిపోవాలంటే ఏదీ వృధా కారాదంటే నేనే
నా ప్రణాళికలలో ఏ మార్పు ఉండని విధంగా మహా స్పష్టమైన స్వర్గపు చాయలే
స్వర్గమైన విశ్వ ప్రపంచంలో ప్రతి ఒక్కరు విజ్ఞానం కోసమే జీవించాలని నా భావన
ప్రతి ఒక్కరికి మహా విశ్వ విజ్ఞానాన్ని అందించే విశ్వ ప్రణాళికలు నాలో ఎన్నో ఎన్నెన్నో
ఆధ్యాత్మికమైనా సాంకేతికమైనా బహు చక్కని భవిష్య జీవన జీవిత విధానం నా ప్రణాళిక
ఏ ప్రమాదాలు ఏ మోసాలు ఏ అవస్థలు ఏ దురలవాట్లు ఏవేవి ఉండవు గమనించండి
మళ్ళీ రాని అవకాశం మహా విజ్ఞానంతో విశ్వ జనులకు ఎరుకతో తెలుపుతున్నా సుమా!

ఒక ఆలోచనతో మేధస్సులోనే ఆగి

ఒక ఆలోచనతో మేధస్సులోనే ఆగి పోయాను ఎందుకో తెలియని విధంగా
ఆలోచన పర ధ్యాసలో వెళ్ళిపోయి ఆత్మ భావంతో అలా నిలిచి పోయింది
మరో భావన కలిగే వరకు ఎరుక లేక మేధస్సులోనే ఎలా నిలిచి ఉన్నానో
ఏ దివ్య భావన నా మేధస్సును ఏ ఆలోచనతో ఏమని కొన సాగించిందో

Wednesday, June 15, 2011

విశ్వమే విజ్ఞానమై మేధస్సులో సాగే

విశ్వమే విజ్ఞానమై మేధస్సులో సాగే కాలమే అనుభవాన్ని తెలుపును

దేహమే వేదమై ఆత్మ యోగమై విశ్వ తత్వాలతో జీవితాన్ని సాగించును

మేధస్సు విశ్వంతో ఏకమై కాల

మేధస్సు విశ్వంతో ఏకమై కాల విజ్ఞానంతో ఆలోచిస్తున్నది
భవిష్య విజ్ఞానాన్ని ఆలోచన ఊహలతో అంచనా వేస్తున్నది
వేద భావాల ఆలోచనలను విశ్వ కార్యాలతో సాగిస్తున్నది
విశ్వ కాలంతో ఎన్నో విధాల అనుభవ విజ్ఞానంతో సాగుతున్నది

Tuesday, June 14, 2011

ప్రతి జీవి మేధస్సు ఒక మహా

ప్రతి జీవి మేధస్సు ఒక మహా యంత్రమని నా మేధస్సులో కలిగిన దివ్య భావన
శరీరం కదలికలో ఒక వాహాన యంత్ర విధానం ఉన్నదని మహా గొప్ప ఆలోచన
మానవుడే మేధస్సులో ఎన్నో జీవులను పరిశీలించి ఎన్నో యంత్రాలను సృష్టించాడు
కాలా తీత భావాలకు ప్రకృతి ప్రభావాలకు ఎన్నో యంత్రాలను సృష్టిస్తూనే ఉన్నాడు
మానవుని ఆలోచనలకు ఎన్నో మహా మాయా యంత్ర విధానాలు సృస్టించబడుతున్నాయి
మానవుని మేధస్సు మహా మాయా అనంత విధాన సూక్ష్మ సాంకేతిక యంత్రమని తెలుస్తున్నది
మానవుని మేధస్సులో కాల చక్రమే ఉన్నది నా విశ్వ విజ్ఞాన దివ్య కాల భావన యంత్ర స్వభావం

మేధస్సే ఒక మాయా విధానమని

మేధస్సే ఒక మాయా విధానమని ఆలోచనలే కాలంతో వివిధ కార్యాలతో సాగిపోతున్నాయి

Saturday, June 11, 2011

మేధస్సులో మహా వేద ఆలోచనలు

మేధస్సులో మహా వేద ఆలోచనలు విశ్వ లోకాలుగా జీవిస్తున్నాయి
వివిధ కార్యాలు వివిధ ఆలోచనలతో వివిధ లోకాలుగా సాగుతున్నాయి
మేధస్సు కార్యాలకు ఆలోచనలు వివిధ భావాల లోకాలుగా సాగుతాయి
ఆలోచనల లోకాలలో మేధస్సు వివిధ కార్యాలతో విశ్వ కాలంతో సాగుతుంది
విశ్వ జీవుల మేధస్సులు విశ్వ లోకాలుగా సమస్యలతో సాగుతూనే ఉన్నాయి
విశ్వ నిర్మాణం నుండే విశ్వ జీవుల విజ్ఞాన కార్యాలు వివిధ రకాలుగా సాగుతున్నాయి
అనేక జీవులలో ఉన్న భావాలలో ఎన్నో కార్యాలు సతమతమై అజ్ఞానమవుతున్నాయి
కావలసిన వాటిని పొందలేక విజ్ఞాన మార్గంలో అందుకోలేక అజ్ఞానం పెరుతుగుతున్నది
నాలోని విశ్వ ప్రణాళికలు విశ్వ విజ్ఞానంతో విశ్వ నిర్మాణాన్ని గొప్పగా మార్చగలుగును
అజ్ఞాన సమస్యలు లేకుండా బహు చక్కని విశ్వ నిర్మాణం తగిన సంఖ్యతో సాగుతుంది

Friday, June 10, 2011

విశ్వ విజ్ఞానంతో సాధారణంగా

విశ్వ విజ్ఞానంతో సాధారణంగా జీవించలేను మరణించలేను

Tuesday, June 7, 2011

ఈ విశ్వ భావన నా దేహానికి ఆత్మకు

ఈ విశ్వ భావన నా దేహానికి ఆత్మకు మాత్రమే తెలియును
విశ్వ భావాలతో జీవించే దేహం ఆత్మ యోగత్వ వేద జీవమే
భావాలే జీవమై మహా దైవత్వ స్వభావాలతో జీవిస్తున్నాయి
విశ్వ దేహానికి కాలమే తోడుగా దివ్యత్వంతో సాగిపోతున్నది

Monday, June 6, 2011

నేటి మధుర భావన మానవ

నేటి మధుర భావన మానవ మేధస్సుదేనని తెలుస్తున్నది
నేటి విశ్వ భావన మహాత్ముని జీవన వేదమేనని తెలుస్తున్నది
నేటి కాల భావన విశ్వపు ఆత్మ స్వభావమేనని తెలుస్తున్నది
నేటి దివ్య భావన మానవుని విచక్షణ విజ్ఞానమేనని తెలుస్తున్నది

Friday, June 3, 2011

ఆత్మ వేదన అడగ లేనిది ఆత్మ భావన

ఆత్మ వేదన అడగ లేనిది ఆత్మ భావన అర్థం కానిది
విశ్వ వేదన తెలియలేనిది విశ్వ భావన తెలుసుకోలేనిది

విశ్వానికే నీవు అంకితం విశ్వ బంధాలకే

విశ్వానికే నీవు అంకితం విశ్వ బంధాలకే నీవు దాసోహం
విశ్వాన్ని మరచినా విశ్వభూమి పైననే నీవు జీవించాలిలే
విశ్వాన్ని దేహంలో దహించి వేసినా పంచభూతాలు జీవిస్తాయిలే
విశ్వాన్ని దీవిగా భావించినా విశ్వ కర్మలు నిన్ను వేదిస్తాయిలే

నీ కోసమే నా విశ్వ భావన

నీ కోసమే నా విశ్వ భావన నీ ధ్యాసకై నా విశ్వ వేదన
పర ధ్యాసలో ధ్యాన భావన పర భాషలో ప్రాణ వేదన

శరీరం శూన్యమయ్యే వరకు

శరీరం శూన్యమయ్యే వరకు అస్థికములను మోశాను
మరణించినా పంచ భూతాలను మోసుకునే ఉన్నాను

Thursday, June 2, 2011

వినిపించు విశ్వానికే నీ విజ్ఞాన వేదాన్ని

వినిపించు విశ్వానికే నీ విజ్ఞాన వేదాన్ని ఆలపించు
నీలో రగిలే వేదావేదనల భావాలెన్నింటినో పలికించు
విశ్వం నీతో ఏకమై స్వర రాగాలెన్నింటినో జ్వలించు
మహా జీవుల మేధస్సులలో మలినాన్ని తరలించు

యోగానికే మహా యోగం మేధస్సులోనే

యోగానికే మహా యోగం మేధస్సులోనే మహా ఉజ్వలం
భావానికే మహా భావం విచక్షణ గుణాలకే మహా భోగం
వేదానికే మహా వేదం జ్ఞానేంద్రియాలకే మహా అద్వైత్వం
మోక్షానికే మహా మోక్షం జన్మేలేని మహా మరణమే అమోఘం

విశ్వాన్ని ఏ విధంగా ఏ రూపంతో ఎలా

విశ్వాన్ని ఏ విధంగా ఏ రూపంతో ఎలా తిలకించాలో జ్ఞాన నేత్రానికే తెలియాలి
ఇంద్రియాలలో మలినమే శూన్యమై విశ్వ తేజస్సుతో విచక్షణ విజ్ఞానం కలగాలి

విశ్వమయా! యోగమయా! మేధస్సులో

విశ్వమయా! యోగమయా! మేధస్సులో మహా జీవమయా!
జీవించే మేధస్సులలో మహా జ్ఞాన విజ్ఞాన ఆత్మ వేదమయా!
ప్రాణం బహు వేదం కాలంతో సాగే మహా జీవన ఋగ్వేదం!
భావం లోకం రూపం ఆలోచనతో సాగే మహా విజ్ఞాన సామ వేదం!
సత్యం ధర్మం హిత తత్వ సూర్య తేజంతో సాగే ఆత్మ అధర్వణ వేదం!
యజ్ఞం శ్లోకం సృష్టికే మహా గుణ కార్య విద్యానంద యజుర్వేదం!

Wednesday, June 1, 2011

కాలమే ఆలోచనలతో మేధస్సును

కాలమే ఆలోచనలతో మేధస్సును జ్ఞానేంద్రియాల ద్వారా నడిపించును
వివిధ భావాలతో స్వభావాలతో వివిధ కార్యాలతో జీవితాన్ని సాగించును

విశ్వమున నాకేది అద్భుతం లేదే

విశ్వమున నాకేది అద్భుతం లేదే
ఏ రూపమైనా నాలో ఉన్న సూక్ష్మ కణమే
మరణమే అద్భుతమని నా మేధస్సు ఇక ఆలోచించన లేనట్లే
ఆలోచిస్తున్నంతవరకు అద్భుతాలు మాయా మోస పూరితమే
విజ్ఞానాన్ని మరిపించే పరధ్యాస భావాలు అద్బుతం కావు

ఏకాగ్రత లాగే నేను ఏకాంతముగా

ఏకాగ్రత లాగే నేను ఏకాంతముగా ఏకాకినై జీవించాలనుకున్నాను
ఏకాగ్రతతో విజ్ఞానంగా ఏకాంతమున విశ్వ భావాలను అన్వేషిస్తున్నాను

మేధస్సు ఒక విషయాన్ని దీర్ఘ కాలంగా

మేధస్సు ఒక విషయాన్ని దీర్ఘ కాలంగా ఆలోచిస్తూ అజ్ఞానంతో నశిస్తున్నది

ప్రతి జీవిని ఎప్పుడు కర్మ కాలం

ప్రతి జీవిని ఎప్పుడు కర్మ కాలం వెంటాడుతూ ఉంటుంది
విజ్ఞాన కాలం చాలా అరుదుగా కొన్ని జీవులకే లభిస్తుంది