విశ్వ ప్రపంచాన్ని స్వర్గంగా మార్చే దివ్య ప్రణాళికలు నా మేధస్సులో ఎన్నో
విశ్వ కార్య క్రమ విధానాలు అనంతముగా తెలిసినా నిర్మాణం చేయలేను
ఆర్ధిక వ్యవస్థతో నేనేమి చేయలేక పోతున్నానని నేటికి దుఃఖించుట లేదు
నా జీవిత కాలం వృధా అవుతున్నదని విశ్వ నిర్మాణంకై ఇంకా వేచివున్నా
నేడు కలిగే ప్రతి సమస్యకు సమాజ సేవకు నా ప్రణాళికలు సమాధానమే
మీలో ఏ భాద లేదంటే ఎప్పటికి కలగదంటే మీలో సమాజ సేవ భావాలు లేవనే
సమాజ సేవ చేయాలంటే ఎప్పటికి నిలిచిపోవాలంటే ఏదీ వృధా కారాదంటే నేనే
నా ప్రణాళికలలో ఏ మార్పు ఉండని విధంగా మహా స్పష్టమైన స్వర్గపు చాయలే
స్వర్గమైన విశ్వ ప్రపంచంలో ప్రతి ఒక్కరు విజ్ఞానం కోసమే జీవించాలని నా భావన
ప్రతి ఒక్కరికి మహా విశ్వ విజ్ఞానాన్ని అందించే విశ్వ ప్రణాళికలు నాలో ఎన్నో ఎన్నెన్నో
ఆధ్యాత్మికమైనా సాంకేతికమైనా బహు చక్కని భవిష్య జీవన జీవిత విధానం నా ప్రణాళిక
ఏ ప్రమాదాలు ఏ మోసాలు ఏ అవస్థలు ఏ దురలవాట్లు ఏవేవి ఉండవు గమనించండి
మళ్ళీ రాని అవకాశం మహా విజ్ఞానంతో విశ్వ జనులకు ఎరుకతో తెలుపుతున్నా సుమా!
No comments:
Post a Comment