Friday, July 31, 2015

మరణించిన క్షణమున నీలో కలిగే భవిష్య ఆలోచనలు

మరణించిన క్షణమున నీలో కలిగే భవిష్య ఆలోచనలు ఆగిపోయేనులే
నీలో దాగిన భూత కాల జ్ఞాపకాలన్నీ శూన్యమై నిలిచి పోయేనులే
శ్వాస ధ్యాస లేక మేధస్సు శూన్యమై ఆలోచన రహిత మయ్యేనులే
శరీరములోని భాగాల కదలికల పని తీరు స్తంభించి ఆగి పోయేనులే
శరీరం క్షణ క్షణమున నశిస్తూ ఆకార రూపాలతో మారి పోయేనులే
క్షణమైనా జ్ఞాపకంగా మరణిస్తున్నానని తెలియకుండా పోయేనులే
జన్మించిన నాడు నా మేధస్సుకు ఎరుక లేక నేడు ఎరుక లేక పోయేనే
భావమైనా నిలవదు బంధమైనా ఆగదు నా జ్ఞానమైనా మీలో నిలిచేనులే
నిలిచిపోయే విజ్ఞాన జ్ఞాపకాల కోసమే మన జనన మరణ జీవితాలు 

Thursday, July 30, 2015

రణ ధీరా! బహు వీరా!

రణ ధీరా!  బహు వీరా!
రణ రంగం మహా రాజ్య సంగ్రామం
ఘన యుద్ధం మహా వీరుల పోరాటం
రాజుల మహారాజుల యువరాజుల సమూహా పోరాటమే మహా సంగ్రామం
పోరాటానికి రధికులైన పదాతి సైనిక దళాల కాల్బలమైనా కరాచలనమే
బహు సేనుల పోరాటం దేహా ధైర్యాల సహాసమే
ఆది నుండి అంతిమం వరకు అడుగడుగుల పోరాటమే
సైనికుల రక్త పాతమే మహా వీరుల శూరుల రణ రంగ చిహ్నం
మహా జనుల సైనికుల పోరాట భీభత్సం యుద్ధానికే విజయ లక్ష్యం
బహు గజ అశ్వ సింహ ఒంటెల సమూహం యుద్ధానికే మహా సంకేతం
చతురంగ బలాల చదరంగమే వీర శక్తుల సహవాసం
గజ బల పోరాటం మహా ధైర్యపు వీరత్వం
అశ్వ(తురగ) యోధుల స్వారి దూసుకెళ్ళే వీర చైతన్యం
సింహ గర్జనలు దశ దిక్కులా దద్దరిల్లే ధైర్యం
ఒంటెలు ధీటుగా నిలిచే స్ఫూర్తి దళ బలగం
రథాలు రణ రంగ ప్రాంగణపు మహా వీరుల స్థానం
యుద్ధపు సూర్యోదయం ఆకాశాన మహా భీకర మేఘ వర్ణ కిరణాల కళంకం
చతురంగ బలాల అరుపుల కేరింతల శబ్ధాలకు సముద్రాలలో మహా అలజడులే
సూర్యాస్త సమయ రక్తపాత పృథ్వికి మేఘాల అలికిడి పిడుగుల మెరుపుల కుండపోత వర్షాలు
పోరాటం సమస్తం రక్తపాత జల ప్రళయాల ప్రవాహం
రణ రంగం రక్త కలేభరాల మహా జీవుల ప్రస్థానం
ఉద్యమాలు యుద్ధాలుగా సాగుతూ సాగిపోయే కాలం కళ్ళల్లో విషాదమే
జయ విజయ రాజ్యోత్సవాలు పతాకమై ఎగిరే రాజుల కీర్తి ఖ్యాతి ప్రతిష్ట చిహ్నాలు !!!!!

Wednesday, July 29, 2015

కాలమే చెదిరింది గానమే కదిలింది

కాలమే చెదిరింది గానమే కదిలింది
స్వరమే పలికింది రాగమే వణికింది
ప్రేమే వెలిసింది రూపమే నిలిచింది
ప్రాణమే అలిగింది హృదయమే రగిలింది

Tuesday, July 28, 2015

యుద్ధానికి యుద్ధమే పోరాటం

యుద్ధానికి యుద్ధమే పోరాటం
పోరాటమే మహా జనుల సంగ్రామం
సంగ్రామమే మహా నాయకుల ఆవేశం
ఆవేశమే యుద్ధానికి ఆయుధం
ఆయుధమే పోరాటానికి ధైర్యం
ధైర్యమే సమరానికి ఆరంభం 

Monday, July 27, 2015

పెళ్లి ఐతే చాలు మనుషులే మారిపోతారు

పెళ్లి ఐతే చాలు మనుషులే మారిపోతారు
జంటగా జీవించే వారిలో ఎన్నో మనస్పర్దాలు
ఎదుటి వారి మాటల్లో ఏదో భిన్నత్వం
అప్పటికప్పుడు పలికే మాటల్లో అసంతృప్తి
సరికాని మాటలతో కొత్త బంధాలు అప్పుడే దూరమయ్యేను
విడవలేని తత్వం పట్టింపుల భావం మనస్సులో నాటుకోవడం
కోప ద్వేషాలతో మాటలకు కూడా చాలా దూరమే
సందర్భాలు ఎందుకు వస్తాయో మంచి వాడికీ నరకమే
అర్థం చేసుకుని సర్దుకుపోయే అర్ధాంగి ఎవరుంటారో
జ్ఞానం ఉన్నా విజ్ఞానం లేనంతగా ఆలోచిస్తారు
అప్పటికప్పుడు మరచిపోయే భావాలు ఎందుకు ఉండవు
ఎంత కాలమైనా మనస్సులో మనస్పర్దాలే
కలుసుకోలేని బంధాలు మాటలు లేని సంబంధాలు
మరణం వరకు వీటితోనే జీవించాలనుకుంటారు
అనుభవం లేని మాటలు లేనిది కోరుకునే ఆశలు
ఎక్కువ తక్కువలతో ఆలోచిస్తూ మతిలేని మనస్పర్దాలు
వివేక విజ్ఞాన అనుభవాలతో ఆలోచించి చూడండి
అన్నింటిని మరచిపోయి అందరితో మంచిగా జీవించండి
ఇంకా అర్థం కాలేక పోతే ఆత్మ జ్ఞానాన్ని పొందండి 

Friday, July 24, 2015

సూర్యుడు నా మేధస్సులో ఉదయించిన తర్వాతే

సూర్యుడు నా మేధస్సులో ఉదయించిన తర్వాతే విశ్వమున కనిపించును
ప్రతి సూర్య కిరణము నా మేధస్సులోని కణాలను తాకిన తర్వాతే విశ్వానికి
ప్రతి కిరణ తేజస్సు నా నేత్రము నుండే విశ్వానికి దివ్య దర్శన కాంతి తత్వము
నా మేధస్సులోని ప్రతి కిరణ భావన ఓ అద్భుత విశ్వ తేజ స్పందనము
నా మేధస్సు విశ్వానికి బ్రంహాండమై ఉక్కు కవచంగా ఆలోచిస్తున్నది  

విశ్వాన్ని చూసేందుకే జన్మించావంటా

విశ్వాన్ని చూసేందుకే జన్మించావంటా
విశ్వ భావాల కోసమే మేధస్సంటా
విశ్వాన్ని తిలకించేందుకే మనిషంటా
విశ్వాన్ని కాపాడుకోవడానికే నీవంటా 

Thursday, July 23, 2015

You can create your own Breath

You can create your own Breath

You can create your own Breath by Yoga and Meditation

YOGA -

Yoga is doing with different postures to develop your own body structure
Every posture having different frequencies of taking breath
In every posture you need to concentrate on how the breath is moving
Posture of the body little tightening the breath while taking the normal breath
Whenever tightening the body, automatically the breath movement is going slow and connecting mind with observation
You have listening wave of breath with concentration up to sometime either seconds or minutes
While practicing you have to increase observation of time from seconds to minutes in a single posture
Each posture it will help body either increase or a decrease of structure like reduces the fat and increases the healthy body
Every day while practicing 'Yoga' your body coming to perfect structure and help to perfect posture
Perfect posture gives relief to the mind and also breath is moving with right frequency
The right frequency of breath with right duration of posture gives relief and it will helps to health
Whenever health is improving by 'Yoga' you breath is having its own kind of frequency with resistance of the body
The resistance of the body having your own breath and it will gives you piece of mind
The resistance of the body is suitable for all seasons to keep healthy
Whenever, you sustain the health with Yoga, you have your own breath in your body with exact frequencies

This is by Yoga - you have to create your own breath...!

MEDITATION -

Meditation is doing either a posture of sitting as usual normal otherwise Lotus posture
While sitting a posture you have to observe in your body, how the breath you have to take and release
Observation is going with concentration on breath, how to inhale and how to release (exhale)
While concentrating breath so many thoughts are coming in to your mind
So alternatively change the thought and mean while reducing the thoughts
While practicing daily, the thoughts are reducing day by day
Whenever you reducing the thoughts you concentration is only observing on breath frequency
Your concentration and observation only on breath, you are getting restless mind
In your mind there is no thought’s (it means you don't know what thoughts are coming into in your mind), the breath is moving with absolute frequencies of inhale and exhale
Absolute frequency of breath reaching some natural power, it means your body gets curing from pain and normal diseases
Natural power is a resistance of the body to get something relaxation and avoid pain and unnecessary thoughts
You mind gets piece and body gets relaxation then your breath able to control health and increases the resistance of your body parts
Whenever you control your health by Meditation, you have your own breath with resistance

This is by Meditation - you have to create your own breath...!

Daily you have to spend time for doing Yoga or Meditation you have to create your own breath
Yoga and Meditations are helping to health and increase your life span

Note: You have to spend daily 30 minutes to one hour then it shows progress otherwise no result.



Thursday, July 16, 2015

విశ్వానికి తెలుసా ఏమి కావాలో


విశ్వానికి  తెలుసా ఏమి కావాలో
విశ్వానికి ఎరుకనా ఎప్పుడు ఏది జరగాలో
విశ్వానికి గుర్తుందా ఎక్కడ ఏది జరిగిందో
విశ్వానికి తెలియునా ఎక్కడ ఏముందో
విశ్వమందు అణువులు విశ్వాణులై విశ్వ కాలంతో సాగి పోయేను
విశ్వాణుల జీవన స్థితి భావాలు విశ్వ కాలానికే ఎరుక
విశ్వాణుల స్థాన భ్రంశాలు విశ్వ కాలపు నిఘంటువులు
విశ్వాణుల జీవ రాశులు విశ్వ కాల జనన మరణాలు
విశ్వాణుల చరిత్ర విశ్వ కాలంతో సాగే అనంతపు భావాలు

విశ్వమందు నీవు ఒక విశ్వాణ మేధావిగా విశ్వ కాల భావాలతో సాగుతూ నిలిచిపో ~ ~ ~ ~ ~ !

విశ్వమే అంతరించేలా ప్రళయాలు సంభవించేనా

విశ్వమే అంతరించేలా ప్రళయాలు సంభవించేనా
విశ్వమే అవతరించేలా ప్రళయాలు ముగిసేనా
విశ్వమే ఆనందించేలా ప్రళయాలు సాగేనా
విశ్వమే ఆలోచించేలా ప్రళయాలు నిలిచేనా

Oh! my god - think something

Oh! my god - think something, your getting great thoughts and ideas in you life
Oh! my friend - do something, you are growing great in your life
Time is a chance and thought is a attempt, hard work is success of experience in every life
You can motivate your self and you can learn your self and think success for destination
Failure is a step to leave and get one more step to live for success to achieve a great goal

Where is the sun shine
Where is the sun rays
Where is the sun light
Where is the sun power

Think once where is all there

You know the sky, it shows all the things there

Sky shows all the shine rays and also power of lighting

Sky is always showing some colors with clouds and also some shapes even though rainy in a season

Sky is a open door for getting thoughts and nice to watch sun shine and sun rays when ever you wake up early in the morning
Every day sky is always lighting and dark in half of together

Life is understanding both of light and dark of the events in every life

Where is the sun shine
Where is the sun rays
Where is the sun light
Where is the sun power

Think once where is all there - those are all in your mind

Oh! my god, Oh! my friend think something and also do some thing, you are grown up very bright and great

Take my guide as a nature for your success to learn and experience---!

విశ్వమందు ఎవరున్నా విశ్వాసమై ఉండు

విశ్వమందు ఎవరున్నా విశ్వాసమై ఉండు
జగతియందు ఎవరున్నా జాగృతిగా ఉండు
బ్రంహాండమందు ఎవరున్నా బ్రంహామై ఉండు
సృష్టియందు ఎవరున్నా స్పష్టతగా ఉండు

Wednesday, July 15, 2015

భూమిపై ఉదయిస్తూనే ఆకాశాన అస్తమిస్తున్నా

భూమిపై ఉదయిస్తూనే ఆకాశాన అస్తమిస్తున్నా
భూగోళమంతా క్షణాలుగా ప్రయాణిస్తూ జీవిస్తున్నా
పగలు రాత్రి కాలంతో సాగిపోతూనే ఆలోచిస్తున్నా
ప్రతి అణువునా ప్రకృతి భావాలతోనే దాగివున్నా 

నీవు కాదని నేను కాదని పరిచయాలు

నీవు కాదని నేను కాదని పరిచయాలు ఎందుకో
నీవు లేవని నేను లేనని జ్ఞాపకాలు ఎందుకో
నీవు ఉన్నా నేను ఉన్నా జీవితాలు ఎవరికో
నీవు లేక నేను లేక అద్భుతాలు ఎవరికో 

Thursday, July 2, 2015

జీవితమే ఒక శ్వాస

జీవితమే ఒక శ్వాస
శ్వాసే ఒక ధ్యాస
ధ్యాసే జీవన ప్రయాణం
ప్రయాణమే అనుభవాల జీవితం