Friday, July 31, 2015

మరణించిన క్షణమున నీలో కలిగే భవిష్య ఆలోచనలు

మరణించిన క్షణమున నీలో కలిగే భవిష్య ఆలోచనలు ఆగిపోయేనులే
నీలో దాగిన భూత కాల జ్ఞాపకాలన్నీ శూన్యమై నిలిచి పోయేనులే
శ్వాస ధ్యాస లేక మేధస్సు శూన్యమై ఆలోచన రహిత మయ్యేనులే
శరీరములోని భాగాల కదలికల పని తీరు స్తంభించి ఆగి పోయేనులే
శరీరం క్షణ క్షణమున నశిస్తూ ఆకార రూపాలతో మారి పోయేనులే
క్షణమైనా జ్ఞాపకంగా మరణిస్తున్నానని తెలియకుండా పోయేనులే
జన్మించిన నాడు నా మేధస్సుకు ఎరుక లేక నేడు ఎరుక లేక పోయేనే
భావమైనా నిలవదు బంధమైనా ఆగదు నా జ్ఞానమైనా మీలో నిలిచేనులే
నిలిచిపోయే విజ్ఞాన జ్ఞాపకాల కోసమే మన జనన మరణ జీవితాలు 

No comments:

Post a Comment