Monday, July 27, 2015

పెళ్లి ఐతే చాలు మనుషులే మారిపోతారు

పెళ్లి ఐతే చాలు మనుషులే మారిపోతారు
జంటగా జీవించే వారిలో ఎన్నో మనస్పర్దాలు
ఎదుటి వారి మాటల్లో ఏదో భిన్నత్వం
అప్పటికప్పుడు పలికే మాటల్లో అసంతృప్తి
సరికాని మాటలతో కొత్త బంధాలు అప్పుడే దూరమయ్యేను
విడవలేని తత్వం పట్టింపుల భావం మనస్సులో నాటుకోవడం
కోప ద్వేషాలతో మాటలకు కూడా చాలా దూరమే
సందర్భాలు ఎందుకు వస్తాయో మంచి వాడికీ నరకమే
అర్థం చేసుకుని సర్దుకుపోయే అర్ధాంగి ఎవరుంటారో
జ్ఞానం ఉన్నా విజ్ఞానం లేనంతగా ఆలోచిస్తారు
అప్పటికప్పుడు మరచిపోయే భావాలు ఎందుకు ఉండవు
ఎంత కాలమైనా మనస్సులో మనస్పర్దాలే
కలుసుకోలేని బంధాలు మాటలు లేని సంబంధాలు
మరణం వరకు వీటితోనే జీవించాలనుకుంటారు
అనుభవం లేని మాటలు లేనిది కోరుకునే ఆశలు
ఎక్కువ తక్కువలతో ఆలోచిస్తూ మతిలేని మనస్పర్దాలు
వివేక విజ్ఞాన అనుభవాలతో ఆలోచించి చూడండి
అన్నింటిని మరచిపోయి అందరితో మంచిగా జీవించండి
ఇంకా అర్థం కాలేక పోతే ఆత్మ జ్ఞానాన్ని పొందండి 

No comments:

Post a Comment