Monday, August 31, 2015

ఆకాశమంతా ఇంద్రధనస్సు వర్ణాల మాయా జాలమే ఓ మేఘమా!

ఆకాశమంతా ఇంద్రధనస్సు వర్ణాల మాయా జాలమే ఓ మేఘమా!
నీవు లేని ఆకాశం నీలి వర్ణమైనను సూర్య కిరణము మహా తేజము 
మేఘముల యందు సూర్య బింభముల వర్ణాలు మహా చిత్రము 
కిరణాలతో కూడిన నీ మేఘములు బహు రూప అతిషయోక్తము 
ఓ వైపు సూర్య తేజము మరో వైపు ఇంద్రధనస్సు ఇంకో వైపు మేఘపు జల్లులు 
అద్భుతాలకు అతిశయోక్తి ఐనా ఆకాశానికి మానవ నేత్ర దృష్టి అనిర్వచనియము 
వర్ణాలు ఆకాశానికి తోరణమై విశ్వానికి స్వాగతం పలుకుతున్నాయి 
సువర్ణాలు ఆకాశానికి బంధాలై మేఘాలతో సన్నాయిని మ్రోగిస్తున్నాయి 
జల జల కురిసే వర్షానికి గల గల మ్రోగే మేఘాలకు విశ్వం సైతం ఒకటైనది 
వర్ణాలన్నీ చీకటిగా మారినా మెరిసే మెరుపులు తల తలమని మెరుస్తున్నాయి 
వర్ణ భావాలు ఎలా ఉంటాయో శబ్ధ తత్వాలు కూడా వివిధ రకాలుగా ఉంటాయి 
విశ్వమున ఏదైనా ఎన్నో రకాలుగా వివిధ భావ తత్వాలతో ఇమిడి ఉంటాయి 
వర్ణ భావాలలో కూడా ఉత్తేజమైన మేధస్సు విజ్ఞానం విరివిగా నిక్షిప్తమై ఉంటుంది 
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!  

విశ్వ భావాలతో మహానుభావుల మహా మేధస్సులను కదిలిస్తాను

విశ్వ భావాలతో మహానుభావుల మహా మేధస్సులను కదిలిస్తాను
విశ్వ తత్వాలతో మహాత్ముల మానవ హృదయాలను కరిగిస్తాను
విశ్వ బంధాలతో మహర్షుల ఆలోచన విధానాన్ని మార్చేస్తాను
విశ్వ గుణాలతో మహా ఋషుల  జీవన కార్యాలను వివరిస్తాను
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

ఆకాశ దేశంలో సూర్యుడే ఉదయించేను ఓ... మేఘమా!

ఆకాశ దేశంలో సూర్యుడే ఉదయించేను ఓ... మేఘమా!
ప్రతి రోజు ఉదయిస్తూ ప్రతి జీవికి మెలకువ కలిగిస్తూ
విశ్వానికే తేజమై మేధస్సులకే ఉత్తేజమై సాయంత్రపు సంధ్య వేళ అస్తమించేను ఓ... మేఘమా! ॥

జగతికే ఆది కేంద్రంలా ఉదయిస్తూ మేధస్సులకే ఆలోచన భావనను కలిగించేను
సూర్య కిరణాలతో వెలుగును ప్రసారిస్తూ మేధస్సులకే విజ్ఞానాన్ని అందించేను
తన వెలుగులోనే ప్రతి జీవి చలనం సాగిస్తూ జీవనాన్ని కార్యాలతో సాగించేను
చీకటి అయ్యేలోగా ఇంటిని చేరుతూ విశ్రాంతితో సేద తీరి జీవులు నిద్రించేను ఓ... మేఘమా! ॥

సూర్య దేశం ఓ విజ్ఞాన క్షేత్రమై ప్రతి జీవి సూర్య తేజస్సుతో విజ్ఞానంగా ఎదుగుతుంది
సూర్యుని కిరణాల తేజస్సు మేధస్సులో కలిగే ఉత్తేజమైన ఆలోచనలకు స్పూర్తినిస్తుంది
సూర్యుని శక్తితోనే మన సామర్థ్యం పట్టుదల ధృడమై వివిధ కార్యాలకు చేయూతనిస్తుంది
సూర్య ప్రపంచం ఓ విజ్ఞాన స్థావరమై విశ్వానికి పరిపూర్ణమైన సంపూర్ణ భావాన్ని కలిగిస్తుంది ఓ... మేఘమా! ॥ 

దేశ భాషలందు తెలుగు భళా!

దేశ భాషలందు తెలుగు భళా!
విశ్వ భాషలందు తెలుగు కళా!
వివిధ భాషలందు తెలుగు మేళా!
భావ భాషలందు తెలుగు తేటలా!
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

ఏనాటిదో ఈ రూపం విశ్వాన్ని చూస్తున్నది

ఏనాటిదో ఈ రూపం విశ్వాన్ని చూస్తున్నది
విశ్వాన్నే తిలకిస్తూ కాలంతో సాగుతున్నది
విశ్వమే జీవమై ఆత్మతో బంధమై జీవిస్తున్నది
విశ్వమే శ్వాసగా ఆత్మలో భావమై వీక్షిస్తున్నది
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

నా రూపం విశ్వానికే అంకితం

నా రూపం విశ్వానికే అంకితం
నా రూప భావాలు విశ్వానికే సొంతం
నా భావ తత్వాలు విశ్వానికే నిలయం
నా ఆలోచన తత్వాలు విశ్వానికే సోపానం
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

భావాన్ని గ్రహిస్తూ ఉంటే తత్వం ఎంతో ఉంది

భావాన్ని గ్రహిస్తూ ఉంటే తత్వం ఎంతో ఉంది
ఆలోచిస్తే తెలియనిది ఎంతో ఉంది
చదువుతూ ఉంటే విజ్ఞానం ఎంతో ఉంది
అర్థం చేసుకో గలిగితే పరమార్థం ఎంతో ఉంది
శ్రమిస్తూ ఉంటే అనుభవం ఎంతో ఉంది
ప్రయాణిస్తూ ఉంటే చూడనిది ఎంతో ఉంది  
జీవిస్తూ ఉంటే తెలుసుకోవలసినది ఎంతో ఉంది
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

Friday, August 28, 2015

ఓ...! విశ్వ భారతి ఇది భారతీయుల సంస్కృతి

ఓ...! విశ్వ భారతి ఇది భారతీయుల సంస్కృతి
నేటి ప్రగతి మన భారత దేశ పరిస్థితుల ఉన్నతి
మన విజ్ఞాన కీర్తి శాస్త్రజ్ఞుల పరిశోధనల ఉచ్చస్థితి
మన దేశ ఖ్యాతి విదేశాలలో మెచ్చే గౌరవ పరిపూర్ణతి
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

తెలియని వయసులో చేసే పనులు ఏవో

తెలియని వయసులో చేసే పనులు ఏవో తెలిసేదాక చేసెదరు
తెలిసిన నాటి నుండి మానుకోలేక అలవాటుగా సాగించెదరు
ఎరుక లేని ధ్యాసలో ఎవరు చూడలేనంతగా ఆలోచించెదరు
ఆలోచనలలో ఏ లోపమో ఇష్టానికి ఏది సరియో తెలుసుకోలేరు
సంఘానికి సూచనగా ఎదిగే ఆలోచన మీలో లేకపోతే ఎవరూ తెలుపలేరు
తరతరాలకు సాగే జీవన విధానాలలో సరి కొత్త పరిస్థితులను ఎవరూ ఆపలేరు
మీకు మీరే నవ సమాజానికి మార్గ దర్శకులు కాలేకపోతే మీకెవరూ చెప్పలేరు
ఎక్కడ ఎలా ఉండాలో విజ్ఞానంగా ఆలోచిస్తే మార్గ దర్శకమైన నడవడికను సాగించెదరు
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

Thursday, August 27, 2015

వెంటబడి పోయే రూపం

వెంటబడి పోయే రూపం
వర్ణాల అంద చందమైన సుందర ఆకారం
చూపులో స్వచ్ఛమైన ప్రేమ భావం
కనిపించగానే నిలిచిపోయే హృదయానందం
కంటి రెప్పను వేయలేనట్లు చేసే తేజం
విడిపోలేని కదలికతో మేధస్సులో సంచలనం
దారిలో కనిపించే రూపాన్ని క్షణాలుగానే చూసే ప్రయాణం
చూడాలన్నా వెనుక తిరగలేని కార్య క్రమాల సమన్వయత్వం
మరో సమయానికి ఎదురు చూసే బంధం
జ్ఞాపకాలలో గుర్తించుకునేలా ఆలోచింప జేసే మోహం
కాలం సాగుతూనే అన్నీ మరచిపోయే మన జీవనాల జీవితం
ఏది ఆశ్చర్యం లేదు ఏది అద్భుతం కాదు అన్నీ క్షణ కాలమే
విజ్ఞానంతో సాగిపోయే జీవితాన్ని అందుకోవడమే మన లక్ష్యం
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

విశ్వమందు కవులు ఎందరున్నను అందులో ఒకరిగా గుర్తింపు

విశ్వమందు కవులు ఎందరున్నను అందులో ఒకరిగా గుర్తింపు పొందగలనా
నేనుగా గుర్తింపు నాకు ఉన్నా తరతరాలకు నేను ఒకరిలో గుర్తు ఉండగలనా
నా భావాలు సాగిపోయేలా నేనుగా నేను ఎంతో ఎదగాలనే ఏనాటికైనా తెలియునా
నాలోని విజ్ఞాన ఆలోచనల పదజాల పోషణ సంపూర్ణంగా ఉండేలా మీకు తెలిసేనా
ఎందెందు ఏమి నేర్చినను నేను సమకూర్చే పద జాలాన్ని మీకు నేనైనా తెలిపేనా
గుర్తింపుకై ఎన్ని యుగాలు గడిచినను నా భావాలు మీ మేధస్సులలో ప్రవహించేనా
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

Tuesday, August 25, 2015

సూర్యుడే మన ఆలోచన సూర్యుడే మన భావన

సూర్యుడే మన ఆలోచన సూర్యుడే మన భావన
సూర్యుడే మన ఉత్తేజం సూర్యుడే మన విజ్ఞానం
సూర్యుడే మన ఓపిక సూర్యుడే మన పట్టుదల
సూర్యుడే మన చైతన్యం సూర్యుడే మన సామర్థ్యం
సూర్యుడే మన స్నేహం సూర్యుడే మన బంధం
సూర్యుడే మన గురువు సూర్యుడే మన మార్గదర్శి
సూర్యుడే మన కాలం సూర్యుడే మన కార్యం
సూర్యుడే మన జీవనం సూర్యుడే మన జీవితం
సూర్యుడే మన ఆరోగ్యం సూర్యుడే మన ఆనందం
సూర్యుడే మన దైవం సూర్యుడే మన లోకం
సూర్యుడే జగతికి అధిపతి సూర్యుడే విశ్వానికి దిక్సూచి
విశ్వ కార్యాలను నడిపించేది సూర్యుడే
మెలకువతో కార్యాలను ఆరంభింపజేసేది సూర్యుడే
సూర్యుడు లేని మేధస్సు ఉత్తేజం లేని సోమరితనమే
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

విశ్వ కిరణంలా సూర్యుడు అన్ని దిక్కులా ప్రకాశించేను

విశ్వ కిరణంలా సూర్యుడు అన్ని దిక్కులా ప్రకాశించేను
ఆకాశమే స్థాన భ్రమశంగా కనిపించేలా ఉదయించేను
కిరణాల ఉష్ణోగ్రతకు దూరమై ఆకాశమందే ప్రయాణించేను
దివి నుండి భువిని తాకే తన కిరణం ప్రతి జీవికి ఎంతో సామర్థ్యాన్ని అందించేను
సూర్యుని నుండే ప్రకృతిలో ఎన్నో సూక్ష్మ గుణ కార్యాలు జరిగేలా అవతరించేను
విశ్వ జీవులకు తోడుగా నిలిచేలా సృష్టికే తన వెలుగును ప్రతి రోజు కొనసాగించేను
సూర్య ప్రకాశమే మేధస్సులో ఆలోచనను ఉత్తేజపరుస్తూ ధనాత్మక భావాన్ని కలిగించేను
సూర్యుడు ప్రకాశించే కొద్ది మనలో ఎన్నో కార్య క్రమాలు మొదలవుతాయి
సూర్య ప్రకాశం లేకపోతే మనలో విజ్ఞానం సంపూర్ణంగా ఉండదు
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

విధిగా జీవించు విధినే వైభవంగా అనుభవించు

విధిగా జీవించు విధినే వైభవంగా అనుభవించు
విధిలో వేద భావాలను మేధస్సున నెమరించు
విధితో విశ్వ తత్వాల కర్మను నెమ్మదిగా వదిలించు
విధి విముక్తితో విశ్వమంతట నీవే అవతరించు
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

శృతి మించరా శివ సన్నిధిని చేర్చరా

శృతి మించరా శివ సన్నిధిని చేర్చరా
నా స్వర గాన సంగీతాన్ని వినిపించరా
నాలోని వేద గీతాన్ని నీవే ఆలకించరా
నీకై నా శ్వాస భావాన్ని అర్పించెదనురా ॥

నీ ధ్యాన శ్వాసలో ఉచ్చ్వాస నిచ్చ్వాసనై శృతిని కలిపెదనురా
నీ విశ్వ భావాలలో నవ నాడుల జీవ తత్వాలను గమనించెదనురా
నీ దేహ ఆకారాలలో విభూదినై మహా రూపాన్ని అవతరించెదనురా
నీ యోగ ధ్యాసలో విశ్వ భావాన్నై స్వప్త స్వరాలతో శృతించెదనురా

శంకరా శంఖంతో శంకించకురా నాపై కక్ష ఉన్నను నీ కక్ష్యలోనే జీవించెదనురా
విష నాగులతో భయ పెట్టినను నీ డమరుకాన్ని ఏనాటికి నేను విడవలేనురా
త్రిలోకాలలో త్రినేత్రుడవై త్రినేత్రంతో నన్ను భస్మం చేసినను నీ త్రిశూలాన్ని వదలనురా
ఎన్ని ప్రళయాలు సంభవించినను నీకై యుగాలుగా జీవిస్తూ గంగా జలమై నివసించెదనురా ॥

శంకరా నీకై శృతి మించెదనురా నటరాజ కళా నాట్యంతో నిన్నే మెప్పించెదనురా
విశ్వమంతా నీ నామ శృతినే వివిధ స్వర భావ జీవ తత్వాలతో స్మరించెదనురా
నీకై పుష్పమైనను పత్రమైనను జలమైనను సమర్పిస్తూ పాద సేవ చేసెదనురా
నీ మెడలో రుద్రాక్షమై కర్త కర్మ క్రియల బంధాన్ని నేనుగా అనుభవించెదనురా

విశ్వమందు నిన్ను ఎక్కడ వెతికినను అక్కడే నా శ్వాసలో నీవే జీవించెదవురా
జగతిలో నీవు ఎక్కడ ఉన్నను ప్రతి జీవి శ్వాసలో నీవే జీవమైనావని తెలిసెనురా
సృష్టిలో ఏ స్వరమైనను నీ ఓంకార శృతియే ఆది రాగమై విశ్వ భాషగా పలికెదమురా
భువిలో నీ విశిష్టత విశ్వాంతరమై కాలమంతా వ్యాపిస్తూ నలు దిక్కులు దాగెనురా ॥ 

ఉదయించుటచే తొలి సూర్య కిరణం

ఉదయించుటచే తొలి సూర్య కిరణం సముద్రాన్ని తాకుతూ ప్రవహిస్తున్నది
సూర్య కిరణాల ప్రవాహం తీరాన్ని చేరుతూ ఆకాశమంతట ఆవరిస్తున్నది
విశ్వమంతా పగటి వెలుగుతో ప్రతి జీవికి మెలకువ భావన కలుగుతున్నది
వెలుగుతో జీవనోపాదికి కావలసిన వివిధ కార్యక్రమాలను విశ్వమే సాగిస్తున్నది  
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

Monday, August 24, 2015

విశ్వమున నీవు నీ మేధస్సుకు భావాన్ని కలిగించు

విశ్వమున నీవు నీ మేధస్సుకు భావాన్ని కలిగించు
భావాన్ని తిలకించుటలో ఆలోచనగా అర్థాన్ని వర్ణించు
విజ్ఞాన ఆలోచనలలో విశ్వ భాషల పరమార్థాన్ని గ్రహించు
జీవన విధానాల జీవుల జీవితాల బంధాలను అనుభవించు
భావాల స్వభావాల వివిధ బంధాల తత్వాలను పరిశోధించు
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

మన దేశ చరిత్రయే విశ్వ భారతం

మన దేశ చరిత్రయే విశ్వ భారతం
మన దేశ పురాణాలే విశ్వ మాతరం
మన దేశ ఇతిహాసాలే విశ్వ తరంగం
మన దేశ శతకాలే విశ్వ గీతరం
మన దేశ యువకులే విశ్వ చైతన్యం
మన దేశ జనులే విశ్వ జీవితం
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

దేశం మన దేశం భారత ప్రపంచం

దేశం మన దేశం భారత ప్రపంచం
దేశం విదేశం భారతీయుల స్నేహం
దేశానికి మనమే భారత పౌరులం
దేశ విదేశాలే శాంతి యుత స్నేహ సంబంధం
భారత దేశమే దేశ విదేశాలకు విజ్ఞాన ఖనిజం
తర తరాలకు యువ తరమే వందే మాతరం
దేశ విదేశాల భారతీయులకు మన వందనం
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

దేశాన్ని ప్రేమించు విదేశాన్ని మెప్పించు

దేశాన్ని ప్రేమించు విదేశాన్ని మెప్పించు
మన దేశమంటే ప్రపంచం విదేశమంటే స్నేహం
మన దేశ విజ్ఞానాన్ని విదేశాలకు అందించు
మన దేశ కీర్తి వివిధ దేశాలకు స్పూర్తి ఖ్యాతి
మన దేశం విశ్వ జగతికే విజ్ఞాన దాయకం
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!  

నేను సైతం విశ్వ కవిగా పోటిపడ్డాను

నేను సైతం విశ్వ కవిగా పోటిపడ్డాను
నేను సైతం విశ్వ జనులకు అంకితమయ్యాను
నేను సైతం విశ్వ దేశాలకు భావమయ్యాను
నేను సైతం విశ్వ భాషలకు స్పూర్తినయ్యాను
నేను సైతం విశ్వ ఖ్యాతిగా నిలిచిపోయాను
నేను సైతం విశ్వమంతా తెలుగుతో ఆదరించాను
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

మరణమందు నీవు శిలవైనావు

మరణమందు నీవు శిలవైనావు
మరణించగా నీవు శిథిలమైనావు
మరణిస్తూనే నీవు క్షీణిస్తున్నావు
మరణించుటచే నీవు పతనమైనావు
మరణంతో నీవు మారిపోయావు
మరణానికే నీవు మృదంగమైనావు
మరణంలో నీవు మరచిపోయావు
మరణానికై నీవు అన్వేషించావు
మరణమై నీవు మందగించావు
మరణంచే నీవు మరిపించావు
మరణంలా నీవు మరణించావు
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

కలిపే జంటలే జీవితమా

కలిపే జంటలే జీవితమా
కలిసే జంటలే జీవనమా
జీవిస్తూ సాగే జీవనమే జీవిత కాలమా
జీవించే కాలంలో కలిసే జంట ఏదో కలిపే జత ఏదో
సరిలేని జంట సరిపోయే జత ఏదైనా జీవన జీవితమే
ఏ జంటకైనా మనో భావాలు వేరైనప్పుడు విభేధమే
ఏ జతకైన అభి రుచులు వేరైన వేళ అభి వాదమే
ఎక్కడ కలిసామో ఎక్కడ కలిపారో ఒక్కటయ్యాము
కలసి ఉంటే కలదు సుఖం అర్థమైతే కలదు సంతోషం
ఎప్పటికైనా నెమ్మదిగా ఆలోచిస్తూ చర్చిస్తే ఒకటే అర్థం - పరమార్థం
ఎక్కువ తక్కువలు ఈనాటివి కావు - ఏనాటి లక్షణాలో
అన్ని విధాలా అన్ని రకాల ఎక్కువ తక్కువలు అందరిలోను ఉంటాయి
ఎక్కువ తక్కువలు ఒకటిగా ఆలోచిస్తే ముందుకు సాగిపోతాం
ఒక్కటైనా నాడే ప్రగతిని చాలా త్వరగా అందుకోగలం
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

Friday, August 21, 2015

ఎదిగే కొద్ది క్షీణించుట తప్పదు

ఎదిగే కొద్ది క్షీణించుట తప్పదు
ఎదగాలన్న కోరిక కలుగుట తప్పదు
ఎదుగుటచే బాధ్యత పెరగక తప్పదు
ఎదుగుతూనే ఏదైనా నేర్చుకోక తప్పదు
ఎదగాలంటే ఏమైనా చేయక తప్పదు
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

శరీరం నశిస్తున్నందుకే ఆహార భోగ భాగ్యాలు

శరీరం నశిస్తున్నందుకే ఆహార భోగ భాగ్యాలు
వయస్సు పెరుగుతున్నందుకే బంధాల బాధ్యతలు
కాలం వెళ్ళుతున్నందుకే జీవన జనన మరణాలు  
ఆలోచన కలుగుతున్నందుకే భావ తత్వ గుణాలు
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

ఈ మేధస్సు నాది కాదు ఏ నాటికి నాది కానే కాదు

ఈ మేధస్సు నాది కాదు ఏ నాటికి నాది కానే కాదు
నేనుగా ఆలోచించుట లేదు నా కోసం ప్రయత్నించుట లేదు
నాలో దాగిన విశ్వ భావ మర్మమేదో నన్ను ఆవరించి ఉన్నది
నాలో కలిగే ఆలోచన నాకై కాక విశ్వ భావానికే అంకితమౌతున్నది
భావాలతోనే జీవించేలా నా మేధస్సు కాలాన్ని వెంబడిస్తున్నది
ఆలోచనను భావనతో గ్రహిస్తూ మేధస్సు మరో ద్రోవలో వెళ్ళుతున్నది
భావమే జీవంగా తత్వమే విశ్వంగా నా మేధస్సు ఆలోచిస్తున్నది
ఏనాటికి భావాన్ని మరచిపోగలనో ఆనాడు మరణిస్తానేమో
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

సూర్యుడే నా దేశం నక్షత్ర కూటమే నా గ్రామం

సూర్యుడే నా దేశం నక్షత్ర కూటమే నా గ్రామం
విశ్వమే నా ఇల్లు ప్రకృతియే నా గృహోపకరణాలు
ఆకాశమే నా గురువు చంద్రుడే నా స్నేహితుడు
మేఘమే నా అతిధి చీకటి వెలుగులే నా లోకం  
గాలియే నాకు మాతృత్వం నీరే నాకు పితృత్వం
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

దేశ విదేశాలలో నా భావాలు విస్తరించి పోయేను

దేశ విదేశాలలో నా భావాలు విస్తరించి పోయేను
దేశ భావాల విదేశ స్నేహా బంధాలు మెరుగయ్యేను
దేశ విదేశాలలో తెలుగు జాతి తత్వాలు కీర్తించేను
విశ్వమంతా మన దేశ మానవుల విదేశ బంధాలే ముడిపడెను
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

Thursday, August 20, 2015

శర్మ నీవు చేయని కర్మ ఏది

శర్మ నీవు చేయని కర్మ ఏది
వర్మ నీవు పొందిన వరం ఏది
బర్మ నీవు పాటించే ధర్మం ఏది
వరం పొందుటచే కర్మ చేయని ధర్మం పాటించగలమా  
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

ప్రతి క్షణము విశ్వమున అధ్బుతమే

ప్రతి క్షణము విశ్వమున అధ్బుతమే
ప్రతి నిమిషము జగతిలో అభియోగమే
ప్రతి గడియ సృష్టిలో అనుబంధమే
ప్రతి రోజు ప్రపంచంలో అణువేదమే
విశ్వ కాలమున ప్రతి క్షణము ఎంతో విజ్ఞాన వేదం
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

ప్రతి అణువులో వర్ణమునై భావాన్ని తలచెదనా

ప్రతి అణువులో వర్ణమునై భావాన్ని తలచెదనా
ప్రతి కణములో తేజస్సునై తత్వాన్ని స్మరించెదనా
ప్రతి రూపములో ఆకారమై ఆత్మనే దర్శించెదనా
ప్రతి జీవములో శ్వాసనై విశ్వాన్ని తిలకించెదనా
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

నీ రూపం నాలోనే నీ ధ్యాస నాతోనే

నీ రూపం నాలోనే నీ ధ్యాస నాతోనే
నీ కదలిక నాలోనే నీ శ్వాస నాతోనే
నీ భావన నాలోనే నీ తత్వం నాతోనే
నీ వర్ణం నాలోనే నీ స్పందన నాతోనే
నీ ఆలోచనన నాలోనే నీ స్వప్నం నాతోనే
నీ ఆత్మ నాలోనే నీ దేహం నాతోనే
నీ విశ్వం నాలోనే నీ ప్రకృతి నాతోనే
నీవని నేనని విశ్వమందు నేను ఒకటే
ఒకటిగా జీవించే జగతిలో జీవం ఒకటే
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

ఆకాశాన ఒక రూపం మేఘంలో ఒక వర్ణం

ఆకాశాన ఒక రూపం మేఘంలో ఒక వర్ణం
క్షణ క్షణమున మారే రూప వర్ణాలు ఎన్నో
అణువణువునా మారే ఆకార రూప వర్ణాలెన్నో
ప్రతి క్షణం అణువులో దాగిన వర్ణ భావన ఏదో
క్షణాలలో మారే ఆకార వర్ణ భావాలు ఏవో
వర్ణ భావాలన్నీ ఆకాశానికి తెలియకున్నా
నా మేధస్సులో ప్రతి భావన వర్ణ కాంతిగా తోచే
విశ్వ భావాలలో వర్ణ భావాల కూటమి నాలోనే
మేధస్సుకు తోచే ప్రతి భావన ఒక విశ్వ తత్వమే
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

సూర్యుడే జగతికి మహా వైద్యుడు

సూర్యుడే జగతికి మహా వైద్యుడు
విశ్వమే ప్రతి జీవరాసికి వైద్యశాల
ప్రకృతియే సర్వ రోగాల ఔషధము
చంద్రుడే రోగాన్ని స్వస్థత చేసేను
శ్వాస ధ్యాసతో ధ్యానం చేయగా నిత్యం ఆరోగ్యమే
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

Wednesday, August 19, 2015

శ్రీ పాద పద్మ భావాలు కలవారికి పద్మశ్రీ సరిపోవునా

శ్రీ పాద పద్మ భావాలు కలవారికి పద్మశ్రీ సరిపోవునా
శ్రీ పాద పద్మములను అలంకరించు వారికి పద్మ భూషణ సరిపోవునా
శ్రీ పాద పద్మములచే పూజించు వారికి పద్మ విభూషణ సరిపోవునా
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

ఆకాశాన కిరణము ఉదయించునట్లు నా మేధస్సులో ఆలోచన కలిగేనా

ఆకాశాన కిరణము ఉదయించునట్లు నా మేధస్సులో ఆలోచన కలిగేనా
కిరణాలన్నీ కనిపించునట్లు ఆలోచనలు ఎన్నో నాలో ఉదయించునా
ప్రతి ఆలోచన దివ్య కిరణాల తేజస్సుతో మేధస్సును మెప్పించేనా
ఆకాశాన కనిపించే వర్ణాలన్నీ మేధస్సులో ఆలోచనగా కలిగేనా
విశ్వాన్ని కిరణ తేజస్సుతో తిలకించేలా మేధస్సు ఆలోచించేనా
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

నా భాషా విజ్ఞానానికి ఏ పురస్కారమైన సంతోషమే

నా భాషా విజ్ఞానానికి ఏ పురస్కారమైన సంతోషమే
నా భావ కాలానికి ఏ మహత్వ పూర్ణమైనా ఆనందమే
నా విశ్వ కవిత్వానికి ఏ యోగ్యతా పత్రమైనా సంసిద్ధమే
నా విశ్వ విఖ్యాత విజ్ఞాన పద జాలానికి ఏదైనా పారితోషికమే
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

క్షణములో ఒక జీవమునై జన్మించి మరణించెదను

క్షణములో ఒక జీవమునై జన్మించి మరణించెదను
క్షణములోనే జన్మించి మరణించుట అల్ప ఆయుస్సే
క్షణములో విశ్వాన్ని ఎలా తలచెదను తిలకించెదను
క్షణములో నా జీవితము సరిపోవునా ఓ సృష్టి కర్తా
క్షణములోనే అద్బుత భావనతో జన్మించి మరణించెదనులే
భావనతో జీవించుట విశ్వానికి సమంజసమములే
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

Tuesday, August 18, 2015

స్వర్గపు అంచుల సరి హద్దుల దాక వెళ్ళాను చూశాను

స్వర్గపు అంచుల సరి హద్దుల దాక వెళ్ళాను చూశాను
అద్భుతమైన వర్ణాలను ఎన్నో చూశాను తిలకించాను
తేజస్సుతో కూడిన ఆకార రూపాలనే ఎన్నో దర్శించాను
మరణాన్ని కూడా విశ్వపు అంచుల యందు చూశాను
క్షణములో కలిగే మరణ భయమే దేహాన్ని గగుర్పాటు చేశేను
ఎంతటి విజ్ఞానము ఉన్నా భవిష్యత్ ను చూడాలనుకున్నా
వయసుతో ముగిసే కాలమే మరణ గమ్యముగా వచ్చేను
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

విశ్వ కవిగా నేనే దర్శకుడను

విశ్వ కవిగా నేనే దర్శకుడను జీవ కవిగా నేనే నిర్మాతను
భావ కవిగా నేనే పరిష్కర్తను ఆలోచన కవిగా నేనే నాయకుడను
విజ్ఞాన కవిగా నేనే సలహాదారుడను ఆత్మ కవిగా నేనే ఛాయాచిత్ర కారుడను
ధ్యాన కవిగా నేనే సూత్ర ధారుడను శ్వాస కవిగా నేనే సర్వాధికారుడను
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

Monday, August 17, 2015

నీ వెంట ఎవరు నీ తోడు ఎవరు

నీ వెంట ఎవరు నీ తోడు ఎవరు
నీలాగే నీడలా కనిపించేది ఎవరు  
నీలాంటి మరో రూపమా నీలోని ఆత్మనా
నీవైన నీ శక్తిని ఎంతటిదో తెలుసుకో
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా!

విశ్వమున నీవే సమర్ధవంతుడవు

విశ్వమున నీవే సమర్ధవంతుడవు
జగమున నీవే ప్రతిభావంతుడవు
సృష్టిలో నీవే శ్రీమంతుడవు
జనములలో నీవే గుణవంతుడవు
శ్వాస నీలోనేగా ధ్యాస నీతోనేగా - ఇక ఆత్మ పరిశోధన చేసుకో మిత్రమా! 

Friday, August 14, 2015

కాలం నీలోనే ఉంది సమయం నీతోనే ఉంది ప్రయత్నం

కాలం నీలోనే ఉంది సమయం నీతోనే ఉంది ప్రయత్నం నీ కోసమే ఉంది
జీవం ఉన్నంత వరకు కాలం నీలోనే ఆలోచన ఉన్నంత వరకు సమయం నీతోనే
పట్టుదల ఉన్నంత వరకు ప్రయత్నం నీ యందే నీకు సాధనగా ఉంటుంది
ఆలోచనను విజ్ఞానంగా మార్చుకుంటూ కార్యాన్ని ధృడంగా ఆరంభించాలి
విజయమైనను లాభమే అపజయమైనను అనుభవమే నని మనం గ్రహించాలి
ఆరంభం ఒక క్షణం మాత్రమే సాగిపోతే రోజులుగా సంవత్సరాలుగా వెళ్తాయి
అనుకున్నది సాధించే వరకు క్షణం కాలం సమయం ప్రయత్నం నీ కోసమే
అడ్డంకులు అర సున్నా మాత్రమే విజయాలు ఒకటి నుండే మొదలు
జీవనాన్ని సరి చేసుకో జీవితాన్ని సరి మార్చుకో కాలాన్ని ఉపయోగించుకో  

పరమాత్మ! పరిశుద్ధమైన ప్రతి ఇంటికి అథిదిగా వెళ్ళుతున్నా

పరమాత్మ! పరిశుద్ధమైన ప్రతి ఇంటికి అథిదిగా వెళ్ళుతున్నా
ప్రతి ఇంటి యందు ఆత్మగా సంతోష భావాలను కలిగిస్తున్నా
పరిశుద్ధమైన ఆత్మలో ధ్యానించు వారి శ్వాసలో జీవిస్తున్నా
అథిదిగా ఆత్మనై విశ్వ చైతన్యమై విశ్వాంతరమున సాగుతున్నా
ఆత్మలో ఆత్మనై పరిశుద్ధమైన జీవమై విశ్వమున నిలుస్తున్నా
అతిధి భావాలతో ఆత్మ తత్వాలతో పరమాత్మగా నేనే వస్తున్నా 

వజ్రములో వర్ణాన్ని నేనే సువర్ణములో తేజస్సును నేనే

వజ్రములో వర్ణాన్ని నేనే సువర్ణములో తేజస్సును నేనే
సూర్యుడిలో వర్ణాన్ని నేనే కిరణాలలో తేజస్సును నేనే
చంద్రునిలో వర్ణాన్ని నేనే వెన్నెలలో కాంతిని నేనే
మేఘంలో వర్ణాన్ని నేనే మెరుపులో కాంతిని నేనే
ఆకాశంలో వర్ణాన్ని నేనే విశ్వంలో కాంతిని నేనే
దేహంలో వర్ణాన్ని నేనే ఆత్మలో కాంతిని నేనే 

Thursday, August 13, 2015

భారత రత్నగా నా భావాలు ఎదిగేనా

భారత రత్నగా నా భావాలు ఎదిగేనా
విశ్వానికి తెలిసేనా నా భావ తత్వములు
విశ్వమందు నిలిచేనా నా భావ ఆలోచనములు
విశ్వమే నన్ను గుర్తించేనా నా భావ తత్వములతో
ఏనాటికైనా అందుకోనా నా భారత రత్న భావాన్ని
భావనతో రత్నమై నిలిచెదనా భారత దేశమున
విశ్వ భావమై అందుకోనా నా భారతీయ రత్నాన్ని
ఆలోచనగా సాగించనా నా విశ్వ బహుమతిని 

నా మేధస్సులో మర్మము దాగి ఉన్నది

నా మేధస్సులో మర్మము దాగి ఉన్నది
మర్మమున విశ్వ తత్వములు దాగి ఉన్నాయి
విశ్వ భావాలతో విశ్వ తత్వాల అన్వేషణ
మర్మముతో విశ్వ కాల స్వభావపు ఆలోచనలు 

నా మేధస్సులో అనంతమైన విశ్వ మందిరం నిర్మితమై ఉన్నది

నా మేధస్సులో అనంతమైన విశ్వ మందిరం నిర్మితమై ఉన్నది
విశ్వ మందిరమున అనేకమైన భావాలోచనలు దాగి ఉన్నాయి
విశ్వ తత్వాలు వేద విజ్ఞాన భావాలు మేధస్సులో కలుగుతున్నాయి
వివిధ లోకాల భావాలు ఊహా చిత్ర రూప స్వరూపాలెన్నో ఉన్నాయి
తిలకించుటలో అనంతం భావాలలో అమోఘం ఆలోచనలలో అఖండం
అపురూపమైన వర్ణ కాంతులు అద్వితీయమైన కిరణాల తేజస్సులు
దైవత్వంతో కూడిన స్వప్న మందిరాలు యోగుల ధ్యాన శిభిరాలు
అనిర్వచనీయమైన కాల తత్వ స్వభావాలు సమయోచిత స్వర కీర్తనలు
సుగంధ పరిమళాల పుష్పాలు సువర్ణ సుమధుర సుదీర్ఘ క్షేత్రములు
శ్రేష్టమైన పరిశుద్ధమైన పవిత్రమైన పరిపూర్ణ దేవామృత శిలా విగ్రహములు  
నైవేద్యితమైన అభిరుచులు ప్రకృతి పర్యావరణ అంద చందములు
తెలుపుటకు యుగాల కాల భావాలు తలచుటకు మేధస్సులో మర్మములు 

Wednesday, August 12, 2015

శ్వాస లేని జీవితం లేనే లేదు

శ్వాస లేని జీవితం లేనే లేదు
ధ్యాస లేని జీవితం తెలియుట లేదు
మనస్సు లేని జీవితం ఎరుకకు లేదు
మేధస్సు లేని జీవితం విజ్ఞానానికి లేదు 

దేవా! శ్వాస వదిలి వెళ్ళిపోతుంది ధ్యానించవా

దేవా! శ్వాస వదిలి వెళ్ళిపోతుంది ధ్యానించవా
శ్వాస పై నిత్యం ధ్యాస ఉంచి మరణాన్ని నిలపవా
శ్వాసతోనే అఖండమైన భవిష్య జీవితాన్ని సాగించవా
శ్వాస యందే జనన మరణాలు ఉదయిస్తూ అస్తమించవా 

Tuesday, August 11, 2015

మరణమందు మౌనమై ఒదిగి ఉన్నావా

మరణమందు మౌనమై ఒదిగి ఉన్నావా
రూపమందు లీనమై నిలిచి పోయావా
ఆకారమందు వికారమై నశిస్తున్నావా
పృథ్వీ యందు శూన్యమై వెళ్లి పోయావా

వేదములు పలికే నాలుకతో అనర్థాలను పలికించ వద్దు

వేదములు పలికే నాలుకతో అనర్థాలను పలికించ వద్దు
మంత్రాలను జపించే ధ్యాసతో అనర్థాలను తిలకించ వద్దు
యంత్రాలను సృష్టించే విజ్ఞానంతో అనర్థాలను కలిగించ వద్దు
తంత్రాలను నేర్చే కాలంతో అనర్థాలను పెంచ వద్దు
భావాలను తెలిపే మేధస్సుతో పరమార్థాన్నే గ్రహించు 

రోగం తోనే జీవిస్తున్నా

రోగం తోనే జీవిస్తున్నా
రోగం తోనే ఎదుగుతున్నా
రోగం తోనే మరణిస్తున్నా
రోగం తోనే ఆలోచిస్తున్నా
రోగం తోనే శ్వాసిస్తున్నా
రోగం తోనే కార్యాలెన్నో చేస్తున్నా
రోగం తోనే క్షీణిస్తున్నా
రోగం తోనే నిర్లక్ష్యం చేస్తున్నా
రోగం తోనే మార్గం తప్పుతున్నా
రోగం తోనే వ్యర్థమవుతున్నా
రోగం తోనే విశ్వాన్ని తిలకిస్తున్నా
రోగం తోనే ప్రయాణిస్తున్నా
రోగం తోనే తెలుపుతున్నా ...!
రోగం ఉందని తలచకు ఆరోగ్యం కలదని నడిచిపో
విజయం రోగాన్ని జయించేలా ఆరోగ్యంతో సాగిపో

విశ్వమందు కవులు ఎందరున్నను విశ్వ కవి ఒక్కరే

విశ్వమందు కవులు ఎందరున్నను విశ్వ కవి ఒక్కరే
విశ్వ తత్వములు కలవారే విశ్వ కవిగా ఎదుగుదురు
ప్రకృతి భావాలతో జీవించే వారికే విశ్వ తత్వములు
విశ్వాన్ని మేధస్సుగా తలిచే వారికే విశ్వ కవిత్వం
ఉఛ్వాస నిఛ్వాసములు విశ్వ ప్రకృతిగా శ్వాసిస్తాయి
విశ్వ కవి ఓ యోగ జీవన ప్రకృతి సిద్ధాంత తత్వవేత్త
ఆలోచనను భావనగా అర్థించు వారే విశ్వ కవి 

మరణముతో తెలుపలేని భావన నా మేధస్సులోనే దాగి ఉన్నది

మరణముతో తెలుపలేని భావన నా మేధస్సులోనే దాగి ఉన్నది
ఆత్మగా నాకు తెలిసివున్నా నిర్జీవమైన మేధస్సుతో తెలుపలేను
నా మేధస్సులో దాగిన భావాలను ఆత్మలో జీవింప జేస్తున్నాను
ఆత్మగా మరణం లేనందున నా భావాలు విశ్వానికి తెలియును
విశ్వమందు నా జీవ భావాలు ఎల్లప్పుడు జీవిస్తూనే ఉంటాయి 

సంపూర్ణమైన అమావాస్య నాడు అంతరిక్షమున వెలిగే

సంపూర్ణమైన అమావాస్య నాడు అంతరిక్షమున వెలిగే అఖండమైన దివ్య నక్షత్రాన్ని నేనే
నా దివ్య తేజస్సు కాంతికి వివిధ నక్షత్రాలు గ్రహాలన్నీ రూప రహిత వెలుగుతో మిలితమౌతాయి  
అంతరిక్షమున నా నక్షత్ర కాంతి తప్ప ఏ రూపము ఏ నేత్రానికి కనిపించని విధంగా ఉంటుంది
మలినమైనను మహా రూపమైనను ఆనాడు మహోదయ వర్ణపు కాంతితో ఆవరించి ఉంటుంది
ఆకాశానికి ఒకవైపు సంపూర్ణమైన చీకటి మరో వైపు సుందరమైన కాంతి తత్వం ఉంటుంది

ఓ వర్ణ మోహపు సుందరీ.. నీవు సువర్ణ దేశపు యువరాణివే

ఓ వర్ణ మోహపు సుందరీ.. నీవు సువర్ణ దేశపు యువరాణివే  
విశ్వ దేశాల సుందరీ..  నీవు అఖండ జగతికే నవనీత తరంగిణివి

సువర్ణాలతో పొదిగిన నీ దేహం సుగంధ పరిమళాల సౌందర్యం
నవ వర్ణాలతో ఒదిగిన నీ రూపం సూర్యోదయ కాంతికే సుందరం  

నీ ఆకార రూపం మనస్సులో మంత్రమై ధ్యాసలో తంత్రమయ్యేను
నీ నాట్య కళా భావం మేధస్సులో మర్మమై శ్వాసలో స్థిరమయ్యేను  

నక్షత్రాల వెలుగులో నడిచి వెళ్ళే ఆకాశ దేశపు మేఘ మాలిని నీవే
గంధర్వ లోకాన జల సుగంధాల పల్లకిలో ఊరేగే సుధారాణి నీవే

ఊహా చిత్రాలలో ఒదిగిన అనంత దేశాల దివ్యమైన విశ్వ సుందరి నీవేలే
అజంతా ఎల్లోరా శిల్పాలలో అలరించినా అందాల ఆణి ముత్యానివి నీవేలే

జగమున జత కలిసే జాబిలి రాత్రి జగన్మోహన సుందిరి నీవేలే
జగతిలో జలదరించే జన జీవన జాడలో జగదేక సుందరి నీవేలే

నక్షత్రాల దీవిలో నవ మోహన వర్ణ ఛాయలో నిలచిన తారవు నీవేలే
విశ్వపు దీవుల వీధిలో వయ్యారి హంసల అతిలోక సుందరి నీవేలే

అమృత తేనీయపు సెలయేరులో జలకాలాడే జలధారపు నెరజాణవు నీవేలే
శికరపు అంచుల సరస్సులలో సరసాలాడే సరోవర సంయుక్తవు నీవేలే

మరణాన్ని ఒక క్షణమైనా ఆపగలమా

మరణాన్ని ఒక క్షణమైనా ఆపగలమా
క్షణం ఆగినా ఏదైనా ఒకటి చేయగలమా
భావనగా తోచినా ఆలోచనగా మరచి పోయెదమా
ఆగిన క్షణం మరణాన్ని ఆపినా కాలంతో క్షణం ఆగదుగా
ఒక క్షణం ఆగే మరణం మనం మరణించేందుకే 

హారతి ఆరి పోవునా ప్రాణం ఆగి పోవునా

హారతి ఆరి పోవునా ప్రాణం ఆగి పోవునా
హృదయం కరిగి పోవునా శ్వాస నిలిచి పోవునా
మనస్సు మరల పోవునా ధ్యాస మరచి పోవునా
భావన రాక పోవునా ఆలోచన కలిగి పోవునా
శరీరం నశించి పోవునా ఆత్మ విడిచి పోవునా 

హృదయమే దేహా భావాల దైవం

హృదయమే దేహా భావాల దైవం
ప్రేమే జీవన సాగర అద్వైత్వం
మనస్సే మోహన మందిర అనిర్వచనం
ధ్యాసే అన్వేషిత భావాల నిత్యం అపేక్షితం 

Monday, August 10, 2015

విశ్వ కవిగా మరణించినా జీవ కవిగా ఉదయిస్తా

విశ్వ కవిగా మరణించినా జీవ కవిగా ఉదయిస్తా
విశ్వ భావాలతో ఆలోచించినా జీవ తత్వాలనే తెలుసుకున్నా
ప్రకృతిలో జీవిస్తున్నా అంతరిక్షమున ప్రయాణిస్తున్నా
మేధస్సులో విజ్ఞానమే ఉన్నా ఆత్మలో వేదమే ఉన్నది
మనిషిగా మరణించినా ఆత్మగా ఉదయిస్తూనే ఉంటా 

మేధస్సులో ఉదయించే సూర్యుడిని నేనే

మేధస్సులో ఉదయించే సూర్యుడిని నేనే
నేత్రాన్ని దర్శించే కిరణ తేజస్సును నేనే
భావాల ఆలోచనల విజ్ఞాన అర్థాన్ని నేనే
విశ్వ రూపాల ఆకార వర్ణ ప్రకృతి జీవిని నేనే 

Friday, August 7, 2015

ఏమిటో నా ఆలోచన మరచి పోయేంత వరకు ధ్యాసతోనే

ఏమిటో నా ఆలోచన మరచి పోయేంత వరకు ధ్యాసతోనే
నాలో కలిగే విజ్ఞాన ఆలోచనను మరవలేక ధ్యాసతోనే ఉన్నా
ధ్యాస లేని ఆలోచన అర్థం లేని అజ్ఞాన ఆలోచనగా తోచునేమో
ధ్యాసతోనే ఆలోచనను విజ్ఞాన ఆలోచనగా మార్చుకుంటున్నాము
ధ్యాస ఉన్నంతవరకు మనము విజ్ఞానాన్ని మరచి పోలేము
ధ్యాసతో జీవించు ఆలోచనతో సాధించు అర్థాన్ని కలిగించు 

ఓ సూర్య తేజమా! నా నేత్రము నిన్నే తిలకిస్తున్నది

ఓ సూర్య తేజమా! నా నేత్రము నిన్నే తిలకిస్తున్నది
ప్రతి కిరణమూ నా నేత్రములో నిండుగా దాగి ఉన్నది
ప్రతి కిరణపు వర్ణ భావాలన్నింటిని పరిశీలిస్తున్నా
ప్రతి కిరణము నాలో సంపూర్ణంగా నిక్షిప్తమై ఉన్నది
ప్రతి వర్ణ భావనను నేను ఆకాశాన తెలుపుతుంటాను
నా మేధస్సులో ప్రతి కణము ఓ సూర్య తేజ కిరణమే
నాలో కలిగే ప్రతి ఆలోచన నీ రూప నేత్ర దర్శనముతోనే
నీ తేజమే నా జీవము నీ కిరణమే నా శ్వాస ధ్యాస
నీ యందే నా ఆలోచన నీ కోసమే నా విజ్ఞాన మేధస్సు 

Thursday, August 6, 2015

తెలిసినా తెలియక సాగే జీవనమే జీవితమా

తెలిసినా తెలియక సాగే జీవనమే జీవితమా
తెలిసినా చేయలేని పరిస్థితులే కారణమా

తెలుసుకున్నాక సాగించే కార్యాలు కఠినమేనా
ఆలోచిస్తే ప్రతి కార్యానికి ఎన్నో మార్గాలే కదా

తెలిసింది మన కోసం చేసుకోవడమే జీవితార్థం
తెలియనిది మన కోసం నేర్చుకోవడమే జీవనం

తెలిసినదంతా మన ప్రగతికి మార్గం కావాలి
తెలియనిదంతా మన అభివృద్ధికి తోడ్పడాలి

ఓ విశ్వ జీవి! నీవు ఎచట ఉన్నావో

ఓ విశ్వ జీవి! నీవు ఎచట ఉన్నావో
నీవు లేని ఇచట మనస్సులో మరో మాట
నీ శ్వాస ఎప్పటిదో నీ ధ్యాస ఎంతటిదో
యుగాలుగా ధ్యానిస్తూనే ఉన్నావు శ్వాసగా జీవిస్తూనే ఉన్నావు
నీ శ్వాసలో ఏమున్నదో నీ ధ్యాసలో ఏది ఉన్నదో
శూన్యము నుండి ఆరంభ మైనదా నీ శ్వాస ధ్యాస
ఖండాలుగా విభజించినా నీ శ్వాస అఖండమే
నీ శ్వాస భావన నాలో కలిగించే అన్వేషణ
నీ ధ్యాస తత్వం నాలో మెలిగే ఆలోచన
నీ శ్వాస ధ్యాసకై నా మేధస్సులో నిత్యం పర్యవేక్షణ
మరణం లేని నీ శ్వాసలో నా ధ్యాస అమరమై అన్వేషిస్తున్నది 

Tuesday, August 4, 2015

దేవా! ఇక నైనా ధ్యానించవా

దేవా! ఇక నైనా ధ్యానించవా
శ్వాస నీలోనే ధ్యాస నీతోనే కదా!
మనస్సు మంత్రమైనా విజ్ఞాన ఆలోచన నీదే
ఆలోచనతో మనస్సు నిలయమై దారి చేసుకో
శ్వాస ధ్యాస దారిలో ఏకాగ్రతను పెంచుకో
విశ్వ కాలంతో సాగుతూ విశ్వ శక్తిని గ్రహించుకో
విశ్వ భావాలతో ఎదుగుతూ విశ్వ భాషను తెలుసుకో
విశ్వమంతా నీవేనని విశ్వానికి తెలుపుకో
విశ్వమందే ఉంటావని విశ్వానికి చాటుకో
విశ్వ శ్వాసయే నీ జీవం విశ్వ ధ్యాసయే నీ ప్రాణం
విశ్వ తంత్రమే నీ తత్వం విశ్వ మంత్రమే నీ మందిరం
ఆత్మయే నీ తపనం అంతర్భావమే నీ తన్మయం 

విశ్వ సుందరి నీవు విశ్వమున ఎక్కడ ఉన్నావో

విశ్వ సుందరి నీవు విశ్వమున ఎక్కడ ఉన్నావో
విశ్వపు అంచులలలో నీవు ఎక్కడ దాగి ఉన్నావో

విశ్వ భావాలు నీకు తెలుసా విశ్వ లోకాలు నీకు తెలియునా ॥

విశ్వమందు నీవు ఎక్కడ ఉన్నా అచటనే నే ఉండగలను
విశ్వమందు నీవు ఎలా ఉన్నా అలాగే నే చూడగలను

విశ్వమంటే నీకు నేస్తమా విశ్వమంటే నీకు ప్రాణమా
విశ్వమంటే నాకు వేదమే విశ్వమంటే నాకు జీవమే

విశ్వ ధ్యాసలో నీవు ఉన్నా విశ్వ భాషలో నే దాగి ఉన్నా
విశ్వ శ్వాసతో నీవు ఉన్నా విశ్వ నాభిలో నేనై ఉన్నా

విశ్వ ధ్యానమే చేసినా విశ్వ యోగమే సాగునా
విశ్వ రూపమే చూసినా విశ్వ సుందరియే దర్శించునా  ॥

విశ్వమే నా నేత్రమై విశ్వ తేజమే నీ రూపమగునులే
విశ్వమే నా దైవమై విశ్వ లోకమే నీ స్థానమగునులే

విశ్వమందు నీవు లేకపోతే నాలో అఖండ అన్వేషణయే
విశ్వమందు నీవు శూన్యమైతే నాలో విశ్వం అంతరించునే

విశ్వమందు నీవు లేని సౌందర్యం పుస్పమే లేని ప్రకృతియే
విశ్వమందు నీవు లేని జీవితం నిధి లేని జీవన సన్నిదియే  

విశ్వమంతా నా జగతియే విశ్వమంతా నా తత్వమే
విశ్వమంతా నా అణువులే విశ్వమంతా నా జీవ భావాలే ॥